Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 1:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 “వారి దుష్టత్వమంతా మీ ముందుకు రావాలి; నా పాపాలన్నిటిని బట్టి మీరు నాతో ఎలా వ్యవహరించారో వారితో కూడా అలాగే వ్యవహరించాలి. నా మూలుగులు అనేకం నా హృదయం సొమ్మసిల్లింది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 వారు చేసిన దుష్కార్యములన్నియు నీ సన్నిధినుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు క్రుంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటినిబట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 వాళ్ళు చేసిన చెడుతనం అంతా నీ ఎదుటికి వస్తుంది గాక. నా అతిక్రమాల కారణంగా నువ్వు నాకు కలిగించిన హింస వాళ్ళకు కూడా కలిగించు. నేను తీవ్రంగా మూలుగుతున్నాను. నా గుండె చెరువై పోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 “నా శత్రువుల దుష్టత్వం నీ ముందు ప్రకటితమవ్వనిమ్ము. నా పాపాలకు నీవు నన్ను శిక్షించినట్లు, అప్పుడు వారి దుష్టత్వానికి వారిని శిక్షించుము. పొంగిన ధుఃఖంతో ఎడతెరిపి లేకుండా నేను మూల్గుతున్నాను. అందువల్ల నీవు ఇది చెయ్యి. నా హృదయం కృంగి కృశించినందున నీవు ఈ పని చెయ్యి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 “వారి దుష్టత్వమంతా మీ ముందుకు రావాలి; నా పాపాలన్నిటిని బట్టి మీరు నాతో ఎలా వ్యవహరించారో వారితో కూడా అలాగే వ్యవహరించాలి. నా మూలుగులు అనేకం నా హృదయం సొమ్మసిల్లింది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 1:22
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా, నాకు త్వరగా జవాబివ్వండి; ఆత్మ నీరసించి పోతూ ఉంది. మీ ముఖాన్ని మరుగు చేయకండి, లేకపోతే గొయ్యిలో దిగిపోయిన వారిలా నేనుంటాను.


“వారి దేవుడు ఎక్కడ?” అని ఇతర దేశాలు ఎందుకు అనాలి? మీ సేవకుల రక్తానికి మీరు ప్రతీకారం తీర్చుకుంటారని మా కళ్ళెదుట ఇతర దేశాల వారికి తెలియజేయండి.


దీనిని బట్టి, చేతులన్నీ బలహీనపడతాయి, ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది.


మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. వారు యాకోబును మ్రింగివేశారు; వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు అతని మాతృభూమిని నాశనం చేశారు.


అయితే యెహోవా, నన్ను చంపడానికి వారు పన్నిన కుట్రలన్నీ మీకు తెలుసు. వారి నేరాలను క్షమించకండి మీ దృష్టి నుండి వారి పాపాలను తుడిచివేయకండి. వారిని మీ ఎదుట కూలనివ్వండి; మీరు కోపంలో ఉన్నప్పుడే వారికి తగిన శాస్తి చేయండి.


“ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను.


మన శరీరానికి చేసిన హింస బబులోనుకు జరుగును గాక,” అని సీయోను నివాసులు అంటున్నారు. “మా రక్తదోషం బబులోనులో నివసించేవారి మీద ఉండును గాక,” అని యెరూషలేము అంటుంది.


దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే, నా హృదయం నాలో నీరసించి ఉంది.


“ఆయన పైనుండి అగ్ని పంపారు, దాన్ని నా ఎముకల్లోకి పంపారు. నా పాదాలకు వలవేసి నన్ను వెనుకకు తిరిగేలా చేశారు. ఆయన నన్ను నిర్జనంగా చేశారు, నేను బాధతో మూర్ఛపోయాను.


మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి, వీటిని బట్టి మా కళ్లు క్షీణిస్తున్నాయి


పచ్చగా ఉన్న చెట్టుకే వారు ఇలా చేస్తే, ఎండిన దానికి ఇంకా ఏమి చేస్తారు?” అని చెప్పారు.


కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ గురించి నేను పడిన శ్రమలను బట్టి మీరు నిరుత్సాహపడవద్దు, అవి మీకు కీర్తి.


వారు పెద్ద స్వరంతో, “ఓ సర్వశక్తిగల ప్రభువా! పరిశుద్ధుడా, సత్యవంతుడా, మా రక్తానికి ప్రతిగా భూనివాసులను తీర్పు తీర్చడానికి ఇంకా ఎంతకాలం?” అని కేకలు వేశారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ