విలాపవాక్యములు 1:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 “యెహోవా, చూడండి, నేను ఎంత బాధలో ఉన్నానో! నా లోలోపల చిత్రహింసను అనుభవిస్తున్నాను, నా హృదయంలో నేను కలత చెందాను, ఎందుకంటే నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను. బయట, ఖడ్గం హతమారుస్తూ ఉంది; లోపల, కేవలం మరణమే. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 యెహోవా, నన్ను తేరి చూడు. నాకు అమితమైన బాధ కలిగింది. నా కడుపు తిప్పుతోంది. నేను చేసిన దారుణమైన తిరుగుబాటు కారణంగా నా గుండె నాలో తలక్రిందులై పోతూ ఉంది. వీధుల్లో మా పిల్లలు కత్తివాత పడుతున్నారు. ఇంట్లో చావు ఉంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్20 “యెహోవా, నా వైపు చూడు. నేను బాధలో ఉన్నాను! నాలో కలవరం చెలరేగింది! నా గుండె తలక్రిందులైనట్లు నాకు భావన కలుగుతూ వుంది! నా కలవరపాటుకు కారణం నేను మొండిగా తిరిగుబాటు చేయటమే! నా పిల్లలు నడివీధుల్లో కత్తికి గురి అయ్యారు. ఇంటిలోపల మృత్యువు పొంచివుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 “యెహోవా, చూడండి, నేను ఎంత బాధలో ఉన్నానో! నా లోలోపల చిత్రహింసను అనుభవిస్తున్నాను, నా హృదయంలో నేను కలత చెందాను, ఎందుకంటే నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను. బయట, ఖడ్గం హతమారుస్తూ ఉంది; లోపల, కేవలం మరణమే. အခန်းကိုကြည့်ပါ။ |