Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహోషువ 18:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 ఆ సరిహద్దు రెఫాయీము లోయకు ఉత్తరాన బెన్ హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ దిగువకు వెళ్లింది. ఇది హిన్నోము లోయ నుండి యెబూసీయుల పట్టణపు దక్షిణ వాలు వెంబడి ఎన్-రోగేలు వరకు కొనసాగింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 ఉత్తరదిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్‍హిన్నోము లోయయెదుటనున్న కొండప్రక్కననుండి దక్షిణదిక్కున బెన్‌హిన్నోము లోయమార్గమున యెబూసీయుల ప్రదేశమువరకు సాగి ఏన్‌రోగేలువరకు వ్యాపించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 ఉత్తరం వైపు రెఫాయీయుల లోయలో ఉన్న బెన్‌ హిన్నోము లోయ ఎదురుగా ఉన్న కొండప్రక్కనుండి దక్షిణంగా బెన్‌హిన్నోము లోయ గుండా యెబూసీయుల ప్రదేశం వరకూ సాగి ఏన్‌రోగేలు వరకూ వెళ్ళింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 తర్వాత బెన్‌హిన్నోము లోయ దగ్గర కొండ మట్టానికి ఆ సరిహద్దు విస్తరించింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తర దిశ. ఆ సరిహద్దు యెబూసు పట్టణానికి దక్షిణంగా హిన్నోము లోయగుండా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు ఎన్‌రోగెలుకు విస్తరించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 ఆ సరిహద్దు రెఫాయీము లోయకు ఉత్తరాన బెన్ హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ దిగువకు వెళ్లింది. ఇది హిన్నోము లోయ నుండి యెబూసీయుల పట్టణపు దక్షిణ వాలు వెంబడి ఎన్-రోగేలు వరకు కొనసాగింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహోషువ 18:16
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

యోనాతాను అహిమయస్సు తాము పట్టణంలోనికి వచ్చిన సంగతి ఎవరికీ తెలియకూడదని వారు ఎన్-రోగేలు దగ్గర ఉన్నారు. ఒక సేవకురాలు వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి చెప్పగా వారు వెళ్లి రాజైన దావీదుకు ఆ సంగతి చెప్పారు.


ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయను విస్తరించారు.


అదోనియా ఎన్-రోగేలు వాగు దగ్గర ఉండే సోహెలేతు రాయి దగ్గర గొర్రెలను, పశువులను, క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, తన సోదరులైన రాజకుమారులందరిని, యూదాలో రాజు అధికారులందరిని ఆహ్వానించాడు,


తర్వాత ఎవరు కూడా తన కుమారుని గాని, కుమార్తెను గాని మోలెకు విగ్రహం ముందు అగ్నిగుండం దాటించకుండా ఉండేలా అతడు బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతు అనే స్థలాన్ని అపవిత్రపరచాడు.


ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దాడి చేశారు.


అతడు బెన్ హిన్నోము లోయలో బలులను కాల్చివేసి, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా ఏ జనాలనైతే వెళ్లగొట్టారో, ఆ జనాలు చేసిన హేయక్రియలు చేసి, తన కుమారులను అగ్నిలో బలి ఇచ్చాడు.


అతడు తన పిల్లలను బెన్ హిన్నోము లోయలో అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని, చేతబడిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ, ఆయనకు కోపం రేపాడు.


చాలా కాలం క్రితమే మండుతున్న స్థలం సిద్ధపరచబడింది; అది రాజు కోసం సిద్ధపరచబడింది. విస్తారమైన అగ్ని, చెక్కతో దాని అగ్ని గుంట లోతుగా విశాలంగా చేయబడింది; యెహోవా ఊపిరి మండుతున్న గంధక ప్రవాహంలా దానిని రగిలిస్తుంది.


వారితో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మరలా బాగుచేయడానికి వీలు లేకుండ ఈ కుమ్మరి కుండను పగలగొట్టినట్లు నేను ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని ధ్వంసం చేస్తాను. తోఫెతులో స్థలం లేకపోయేంతగా అక్కడే చనిపోయినవారిని పాతిపెడతారు.


హర్సీతు ద్వారం దగ్గర ఉన్న బెన్ హిన్నోము లోయకు వెళ్లి అక్కడ నేను మీకు చెప్పే మాటలు ప్రకటిస్తూ,


ప్రజలు ఇకపై ఈ ప్రదేశాన్ని తోఫెతు లేదా బెన్ హిన్నోము లోయ అని పిలువకుండా, వధ లోయ అని పిలిచే రోజులు రాబోతున్నాయి, కాబట్టి జాగ్రత్త వహించండి, అని యెహోవా హెచ్చరించారు.


వారు తమ కుమారులను, కుమార్తెలను మోలెకుకు బలి ఇవ్వడానికి బెన్ హిన్నోము లోయలో బయలుకు క్షేత్రాలు కట్టారు. అది నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా పాపంలో పడి అలాంటి అసహ్యమైనది చేస్తారని కనీసం నా మనస్సులోకి రాలేదు.


యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను యూదా వారు వెళ్లగొట్టలేకపోయారు; నేటి వరకు యెబూసీయులు యూదా ప్రజలతో కలిసి అక్కడ నివసిస్తున్నారు.


సేలా ఎలెపు, యెబూసి పట్టణం (యెరూషలేము) గిబియా, కిర్యత్ అనేవి పద్నాలుగు పట్టణాలు వాటి గ్రామాలు, వారి వారి వంశాల ప్రకారం ఇది బెన్యామీను గోత్రం వారికి వచ్చిన వారసత్వము.


అయితే బెన్యామీను గోత్రం వారు యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను తరమలేదు; ఇప్పటివరకు యెబూసీయులు బెన్యామీనీయులతో కలిసి నివసిస్తున్నారు.


యూదా వారు యెరూషలేము మీద దాడి చేసి దానిని పట్టుకుని అక్కడి ప్రజలను ఖడ్గంతో చంపి, వారు పట్టణాన్ని కాల్చివేశారు.


కాని ఇంకొక రాత్రి ఉండడానికి అతడు ఒప్పుకోకుండా తన ఉంపుడుగత్తెను తీసుకుని కట్టిన రెండు గాడిదలతో యెబూసు అనగా యెరూషలేము వైపు వెళ్లాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ