యెహోషువ 10:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 ఆ రోజు యెహోషువ మక్కేదాను స్వాధీనపరచుకున్నాడు. అతడు ఆ పట్టణాన్ని దాని రాజును కత్తితో చంపి, దానిలోని వారందరినీ పూర్తిగా నాశనం చేశాడు. ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లుగా మక్కేదా రాజుకు చేశాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతముచేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను; యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఆ రోజు యెహోషువ మక్కేదాను వశం చేసుకుని దాని రాజుతో సహా అందులోని వారందరినీ కత్తితో చంపేశాడు. అతడు దానిలో ఎవరినీ ప్రాణాలతో వదలకుండా నిర్మూలం చేసాడు. యెరికో రాజుకు చేసినట్టు మక్కేదా రాజుకూ చేశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్28 ఆ రోజు యెహోషువ మక్కెదాను జయించాడు. ఆ పట్టణంలోని రాజును, ప్రజలను యెహోషువ చంపేసాడు. మనుష్యులు ఎవ్వరూ ప్రాణాలతో విడిచి పెట్టబడలేదు. యెరికో రాజుకు చేసినట్టే మక్కెదా రాజుకు యెహోషువ చేసాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 ఆ రోజు యెహోషువ మక్కేదాను స్వాధీనపరచుకున్నాడు. అతడు ఆ పట్టణాన్ని దాని రాజును కత్తితో చంపి, దానిలోని వారందరినీ పూర్తిగా నాశనం చేశాడు. ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లుగా మక్కేదా రాజుకు చేశాడు. အခန်းကိုကြည့်ပါ။ |