Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోబు 7:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 “కాబట్టి నేను మౌనంగా ఉండను; నా ఆత్మలోని వేదన బట్టి మాట్లాడతాను. నా మనస్సులోని బాధను బట్టి నేను ఫిర్యాదు చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 కావున నేను నా నోరు మూసికొనను నా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదను నా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 అందువల్ల నేను నోరు మూసుకుని ఉండను. నా ఆత్మలో వేదన ఉంది. నా వేదన కొద్దీ నేను మాట్లాడతాను. నా మనసులోని వేదనను బట్టి మూలుగుతూ ఉంటాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 “అందుచేత నేను మౌనంగా ఉండను. నేను గట్టిగా మాట్లాడతాను. నా ఆత్మ శ్రమ పడుతోంది. నా ఆత్మ వేదనపడుతోంది గనుక నేను ఆరోపణ చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 “కాబట్టి నేను మౌనంగా ఉండను; నా ఆత్మలోని వేదన బట్టి మాట్లాడతాను. నా మనస్సులోని బాధను బట్టి నేను ఫిర్యాదు చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోబు 7:11
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మన తమ్మున్ని బట్టి మనం ఇలా శిక్షించబడుతున్నాము. తనను చంపవద్దని అతడు మనలను ఎంత వేడుకున్నా మనం వినలేదు అప్పుడు అతడు ఎంత బాధపడ్డాడో చూశాం; మనం చేసిన ఆ దోషం వల్లే ఇప్పుడు మనకు ఈ దుస్థితి వచ్చింది” అని మాట్లాడుకున్నారు.


“నా బ్రతుకును నేను అసహ్యించుకొంటున్నాను; కాబట్టి నేను స్వేచ్ఛగా ఫిర్యాదు చేస్తాను నా మనస్సులోని బాధను బట్టి మాట్లాడతాను.


నేను దోషినైతే నాకు శ్రమ! నేను నిర్దోషినైనప్పటికి నా తల పైకెత్తలేను, ఎందుకంటే నేను అవమానంతో నిండుకొని నా బాధలో మునిగి ఉన్నాను.


మౌనంగా ఉండండి నన్ను మాట్లాడనివ్వండి; అప్పుడు నా మీదికి ఏది రావాలో అది వస్తుంది.


అయితే నేను మాట్లాడినప్పటికి నా బాధకు ఉపశమనం లేదు; మౌనంగా ఉన్నా నా బాధ తీరదు.


మరొకరు ఎన్నడు ఏ మంచిని అనుభవించకుండానే, మనోవేదనతో చనిపోతారు.


ఈ రోజు కూడా నా ఫిర్యాదు తీవ్రంగానే ఉంది; నా మూల్గుల కంటే ఆయన హస్తం నా మీద భారంగా ఉంది.


చెడు వైపు తిరుగకుండ జాగ్రత్త వహించండి, ఎందుకంటే మీరు బాధల్లో పరీక్షించబడతారు.


నేను చెప్పే మాటలను సరిచేయాలని చూస్తున్నారా, నిరాశతో కూడిన నా మాటలు గాలివంటివే అని అనుకుంటున్నారా?


నా ఫిర్యాదు మరచిపోయి, నా విచారం విడిచిపెట్టి సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే,


నా గుండె నాలో వేడెక్కింది. నేను ధ్యానిస్తూ ఉండగా మంట రగులుకుంది; అప్పుడు నోరు తెరచిమాట్లాడాను:


యెహోవా! మీకు తెలిసినట్టుగా, నేను నా పెదవులు మూసుకోకుండ మహా సమాజంలో మీ నీతిని గురించిన సువార్త ప్రకటించాను.


కాని నేనేమి అనగలను? ఆయనే నాకు మాట ఇచ్చారు, ఆయనే ఇది నెరవేర్చారు. నాకు కలిగిన వేదన బట్టి నా సంవత్సరాలన్నీ దీనుడిగా జీవిస్తాను.


నేను అనుభవించిన ఈ వేదన ఖచ్చితంగా నాకు నెమ్మది కలగడానికే. మీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతినుండి విడిపించారు; నా పాపాలన్నిటిని మీ వెనుక పారవేశారు.


ఆయన బహు వేదనతో, మరింత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేల మీద పడుతూ ఉంది.


ఎంతో దుఃఖ హృదయంతో, కన్నీటితో మీకు వ్రాశాను. నేను వ్రాసింది మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు కాని, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, మీరు గుర్తించడానికి మాత్రమే.


హన్నా తీవ్ర వేదనలో ఏడుస్తూ యెహోవాకు ప్రార్థించింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ