Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోబు 40:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 “నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా? నిన్ను నీవు సమర్థించుకోడానికి నన్ను ఖండిస్తావా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అప రాధము మోపుదువా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 నేను అన్యాయం చేసానని అంటావా? నిర్దోషివని నువ్వు తీర్పు పొందడం కోసం నా మీద అపరాధం మోపుతావా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 “యోబూ నేను న్యాయంగా లేనని నీవు తలుస్తున్నావా? నీదే సరిగ్గా ఉన్నట్లు కనబడేలా చేయాలని, నేను తప్పు చేశానని నీవు నన్ను నిందిస్తావా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 “నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా? నిన్ను నీవు సమర్థించుకోడానికి నన్ను ఖండిస్తావా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోబు 40:8
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

నన్ను హింసించడం, మీ చేతిపనిని త్రోసివేయడం, దుర్మార్గుల ప్రణాళికలను చూసి సంతోషించడం మీకు ఇష్టమా?


ఇప్పుడు నా వ్యాజ్యెం సిద్ధంగా ఉంది కాబట్టి, నేను నిర్దోషినని రుజువవుతానని నాకు తెలుసు.


దేవుడు నన్ను భక్తిహీనులకు అప్పగించారు. దుర్మార్గుల చేతుల్లో నన్ను పడవేశారు.


దేవుడు నాకు అన్యాయం చేశారని నా చుట్టూ ఆయన తన వల వేశారని తెలుసుకోండి.


యోబు తన దృష్టిలో తాను నీతిమంతునిగా ఉన్నాడని గ్రహించిన ఆ ముగ్గురూ అతనికి సమాధానం ఇవ్వడం మానేశారు.


దేవుని కంటే తాను ఎక్కువ నీతిమంతుడని చెప్పుకుంటున్నాడని, రాము వంశస్థుడును, బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు యోబు మీద చాలా కోప్పడ్డాడు.


న్యాయాన్ని ద్వేషించేవాడు పరిపాలించగలడా? బలాఢ్యుడైన న్యాయవంతుడైన దేవుని మీద నీవు నేరం మోపుతావా?


కేవలం మీకు, మీకే విరోధంగా నేను పాపం చేశాను, మీ దృష్టికి చెడు చేశాను; మీ తీర్పులో మీరు సరిగ్గా ఉంటారు మీరు తీర్పు తీర్చునప్పుడు న్యాయసమ్మతంగా ఉంటుంది.


సైన్యాల యెహోవా దానిని ఉద్దేశిస్తే ఆయనను అడ్డుకునేవారు ఎవరు? ఆయన చేయి చాచి ఉన్నది, దాన్ని త్రిప్పగలవారెవరు?


చావుతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది; పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం నిలవదు. ప్రవాహంలా శాపం మీ మీదికి వచ్చినప్పుడు మీరు దానిచే కొట్టబడతారు.


నాకు గతంలో జరిగింది గుర్తు చేయి మనం కలిసి వాదించుకుందాం; నిన్ను నీవు నీతిమంతునిగా రుజువు చేసుకో.


“మట్టి కుండ పెంకులలో ఒక పెంకుగా ఉండి తనను చేసినవానితో వాదించే వారికి శ్రమ. జిగటమన్ను కుమ్మరితో, ‘నీవు ఏం తయారుచేస్తున్నావు?’ అని అంటుందా? అతని పని అతనితో, ‘కుమ్మరికి నైపుణ్యం లేదు’ అని అంటుందా?


ఎన్నటికి కాదు; ప్రతి ఒక్క మనిషి అబద్ధికుడు కావచ్చు కాని దేవుడు సత్యవంతుడు. దేవుని గురించి లేఖనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, “మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడవని నిరూపించబడతావు తీర్పు తీర్చునప్పుడు నీవు జయిస్తావు.”


సహోదరీ సహోదరులారా, అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనుష్యులు చేసిన ఒడంబడికే అయినా దాన్ని స్థిరపరచిన తర్వాత దాన్ని ఎవరూ కొట్టివేయలేరు దానికి ఏమి కలపలేరు. ఇది కూడా అంతే.


నేను చెప్పేదేంటంటే, 430 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన ధర్మశాస్త్రం దేవునిచే ముందుగానే స్థిరపరచబడిన ఒడంబడికను ప్రక్కన పెట్టదు అలాగే దేవుని వాగ్దానాన్ని నిరర్ధకం చేయదు.


పాత నియమం బలహీనం, నిరుపయోగం కాబట్టి ప్రక్కకు పెట్టబడింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ