Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోబు 38:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 “నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? నీకు వివేకము ఉంటే, నాకు జవాబు చెప్పు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 “యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 “నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? నీకు వివేకము ఉంటే, నాకు జవాబు చెప్పు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోబు 38:4
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు.


యెహోవా దేవుడు భూమిని సృజించినప్పుడు, భూమ్యాకాశాల సృష్టి జరిగిన విధానం ఇదే.


“నీవేమైన మొదట పుట్టిన పురుషునివా? కొండలు ఏర్పడక ముందే నీవు ఉన్నావా?


ఆయన గాలి ప్రభావాన్ని స్థాపించినప్పుడు జలములను కొలిచినప్పుడు,


భూమి మీద ఆయనను నియమించింది ఎవరు? సర్వలోకానికి ఆయనను అధిపతిగా చేసింది ఎవరు?


ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, ఆకాశాలు మీ చేతి పని.


అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు; ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి. మీరు వాటిని దుస్తుల్లా మార్చి వేస్తారు అవి అంతరిస్తాయి.


భూమిని దాని పునాదులపై నిలిపారు; అది ఎన్నటికి కదలదు.


యెహోవా జ్ఞానం వలన భూమికి పునాదులు వేశారు, ఆయన తెలివి వలన ఆకాశ విశాలాన్ని ఏర్పరిచారు;


ఆకాశానికెక్కి మరలా దిగినవారెవరు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వారెవరు? బట్టలో నీళ్లు మూట గట్టినవారెవరు? భూమి దిక్కులను నెలకొల్పినది ఎవరు? ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి? ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి!


“యెహోవా తన సృష్టి ఆరంభ దినాన తాను చేసినపనులలో మొదటి పనిగా నన్ను చేశారు;


ఎవరి దగ్గర యెహోవా ఆలోచన అడిగారు? న్యాయ మార్గాన్ని ఆయనకు నేర్పిన వారెవరు? ఆయనకు తెలివిని నేర్పించిన వారెవరు? ఆయనకు బుద్ధి మార్గాన్ని చూపించిన వారెవరు?


అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.


పర్వతాలను ఏర్పరచింది గాలిని సృష్టించింది ఆయనే, తన ఆలోచనలను మనుష్యులకు వెల్లడి చేసేది, ఉదయాన్ని చీకటిగా మార్చేది ఆయనే, భూమి ఎత్తైన స్థలాల్లో ఆయన నడుస్తారు ఆయన పేరు దేవుడైన సైన్యాల యెహోవా.


ఇంకా ఆయన, “ప్రభువా, ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, ఆకాశాలు మీ చేతి పని.


కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు.


దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే; వారిని అధికారులతో కూర్చునేలా చేసేది ఘనత కలిగిన సింహాసనాన్ని స్వతంత్రింపజేసేది ఆయనే. “భూమి పునాదులు యెహోవాకు చెందినవి; ఆయన వాటి మీద లోకాన్ని నిలిపారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ