Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోబు 1:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 ఒక రోజు దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు, సాతాను కూడా వారితో కలిసి వచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఒకరోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 అప్పుడు దేవదూతలు యెహోవా సముఖంలో సమావేశమయ్యే ఒక రోజు వచ్చింది. అప్పుడు ఆ దేవదూతలతోబాటు సాతానుకూడ వచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 ఒక రోజు దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు, సాతాను కూడా వారితో కలిసి వచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోబు 1:6
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందంగా ఉండడం చూసి, వారిలో నచ్చిన వారిని పెళ్ళి చేసుకున్నారు.


ఆ దినాల్లో భూమిపై నెఫిలీములు ఉండేవారు, వీరు తర్వాత కూడా ఉన్నారు. వీరు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు పుట్టిన పిల్లలు. వీరు ప్రాచీన కాలంలో పేరు పొందిన యోధులు.


మీకాయా ఇంకా ఇలా అన్నాడు, “కాబట్టి యెహోవా మాట వినండి: యెహోవా తన సింహాసనంపై కూర్చుని ఉండగా తన చుట్టూ తన కుడి ఎడమలు పరలోక సమూహాలన్ని నిలబడి ఉండడం నేను చూశాను.


సాతాను ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేచి, వారి జనాభా లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు.


చివరికి ఒక ఆత్మ ముందుకు వచ్చి, యెహోవా సమక్షంలో నిలబడి, ‘నేను అతన్ని ప్రలోభపెడతాను’ అన్నాడు. “ ‘ఎలా?’ అని యెహోవా అడిగారు.


దేవదూతలు యెహోవా సమక్షంలో నిలబడవలసిన రోజున, యెహోవా ఎదుట నిలబడడానికి వారితో పాటు సాతాను కూడా వచ్చాడు.


అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమి మీద లేడు; అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు, దేవుడంటే భయం కలిగి, చెడుకు దూరంగా ఉండేవాడు. ఏ కారణం లేకుండా నీవు అతన్ని నాశనం చేయడానికి నన్ను ఒప్పించినా అతడు తన యథార్థతను విడువక స్థిరంగా ఉన్నాడు” అని అన్నారు.


యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన మాటలను నెరవేర్చే బలశూరులైన దూతలారా, ఆయనను స్తుతించండి.


అతడు, “చూడండి! అగ్నిలో అటూ ఇటూ తిరుగుతూ నలుగురు కనబడుతున్నారు, వారు బంధించబడినట్లుగాని, ఏ హాని కలిగినట్లు గాని లేరు, ఆ నాలుగవ వ్యక్తి దేవుళ్ళ కుమారునిగా కనిపిస్తున్నాడు” అన్నాడు.


అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం, అతన్ని నిందించడానికి సాతాను అతని కుడి ప్రక్కన నిలబడి ఉండడం అతడు నాకు చూపించాడు.


“ఈ చిన్నపిల్లల్లో ఒకరిని కూడా తక్కువగా చూడకండి, ఎందుకంటే పరలోకంలో ఉన్న వీరి దూతలు ఎల్లప్పుడు పరలోకంలోని నా తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారని మీతో చెప్తున్నాను.


“సీమోనూ, సీమోనూ, సాతాను గోధుమలను జల్లించినట్లు నిన్ను జల్లించాలని అడిగాడు.


కేయినాను ఎనోషు కుమారుడు, ఎనోషు షేతు, షేతు ఆదాము కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు.


అప్పుడు యేసు, “మీ పన్నెండుమందిని నేను ఎన్నుకోలేదా? అయినా మీలో ఒకడు దుష్టుడు” అని వారితో చెప్పారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ