Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోహాను 2:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 “అందరు మొదట మంచి ద్రాక్షరసాన్ని పోసి, అతిథులు త్రాగలేని స్థితిలో ఉన్నప్పుడు చౌక ద్రాక్షరసాన్ని పోస్తారు, కాని నీవైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసాన్నే ఉంచావు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 –ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 “అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 “అందరూ మంచి ద్రాక్షారసమును మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాక మాములు ద్రాక్షారసమును పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసమును యింతవరకు ఎందుకు దాచావు?” అని అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 “అందరు మొదట మంచి ద్రాక్షరసాన్ని పోసి, అతిథులు త్రాగలేని స్థితిలో ఉన్నప్పుడు చౌక ద్రాక్షరసాన్ని పోస్తారు, కాని నీవైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసాన్నే ఉంచావు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

10 “అందరు మొదట మంచి ద్రాక్షరసాన్ని పోసి, అతిథులు తాగలేని స్థితిలో ఉన్నప్పుడు చౌక ద్రాక్షరసాన్ని పోస్తారు, కాని నీవైతే ఇప్పటి వరకు మంచి ద్రాక్షరసాన్నే ఉంచావు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోహాను 2:10
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

యోసేపు బల్ల నుండి వారికి భోజనం వడ్డించబడినప్పుడు, ఇతరులకంటే అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. కాబట్టి వారు అతనితో స్వేచ్ఛగా విందు చేసుకున్నారు, త్రాగారు.


మానవ హృదయాలకు సంతోషం కలిగించడానికి ద్రాక్షరసాన్ని, వారి ముఖాలను ప్రకాశించేలా చేయడానికి నూనెను, వారి హృదయాలను బలపరిచే ఆహారాన్ని ఇస్తున్నారు.


నా సోదరీ, నా వధువు, నా ఉద్యాన వనానికి వచ్చేశాను; నా పరిమళాలతో పాటు నా గోపరసాన్ని సేకరించుకున్నాను. నేను తేనెతెట్టె తేనె తిన్నాను; నేను నా ద్రాక్షరసం, నా పాలు త్రాగాను. స్నేహితులారా, తినండి త్రాగండి; ప్రేమికులారా! తృప్తిగా సేవించండి.


తన తోటి సేవకులను కొట్టడం మొదలుపెట్టి త్రాగుబోతులతో కలిసి తిని త్రాగుతూ ఉంటాడు.


కాని ఒకవేళ ఆ సేవకుడు, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడని’ తన మనస్సులో అనుకుని, తన తోటి సేవకులను, పురుషులు స్త్రీలను కూడా కొట్టడం మొదలుపెట్టి, తింటూ త్రాగుతూ మత్తులో ఉండి!


“అందుకు అబ్రాహాము, ‘కుమారుడా, జ్ఞాపకం చేసుకో, లాజరు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు నీ జీవితంలో నీవు మేళ్ళను అనుభవించావు, కానీ ఇప్పుడు ఇక్కడ అతడు ఆదరణ పొందుతున్నాడు, కానీ నీవు యాతనపడుతున్నావు.


మీరందరు అనుకుంటున్నట్లు, వీరు మద్యం త్రాగిన మత్తులో లేరు. ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది!


ఎందుకంటే, మీరు తింటున్నప్పుడు, మీలో కొందరు తమ భోజనాన్ని ముందుగానే చేసేస్తున్నారు. దాని ఫలితంగా ఒకరు ఆకలితో ఉండగా మరొకరు మత్తులై పోతున్నారు.


మద్యంతో మత్తులు కాకండి, అది మిమ్మల్ని దుష్టత్వంలోనికి నడిపిస్తుంది. అయితే ఆత్మ పూర్ణులై ఉండండి,


నిద్రపోయేవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తులుగా ఉండేవారా రాత్రివేళ మత్తులై ఉంటారు.


భూ రాజులు ఆ వేశ్యతో వ్యభిచరించారు, ఆమె వ్యభిచారమనే మద్యంతో భూనివాసులందరు మత్తులయ్యారు” అని చెప్పాడు.


ఈ స్త్రీ దేవుని పరిశుద్ధ ప్రజల రక్తాన్ని అనగా యేసు హతసాక్షుల రక్తాన్ని త్రాగి మత్తులో ఉండడం నేను చూశాను. నేను ఆమెను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ