Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 51:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 “ ‘మనం బబులోనును స్వస్థపరచి ఉండేవారం, కానీ దానికి స్వస్థత కలగదు; మనం దాన్ని విడిచి మన సొంత దేశానికి వెళ్దాం, ఎందుకంటే దాని తీర్పు ఆకాశాన్ని తాకుతుంది, అది మేఘాలంత ఎత్తుగా లేస్తుంది.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 మనము బబులోనును స్వస్థపరచగోరితిమి అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచి పెట్టుడి. మన మన దేశములకు వెళ్లుదము రండి దాని శిక్ష ఆకాశమంత యెత్తుగా సాగుచున్నది అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 మేము బబులోనును బాగు చేద్దామనుకున్నాం. కానీ ఆమె బాగవ్వలేదు. అందరం ఆమెను విడిచిపెట్టి వెళ్లి పోదాం. మన స్వదేశాలకు వెళ్ళి పోదాం. ఆమె దోషం తీవ్రత ఆకాశాన్నంటింది. అది మేఘాల్లో పోగవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 బబులోనుకు స్వస్థత చేకూర్చాలని యత్నించాము. కాని ఆమె స్వస్థతనొందలేదు. కావున ఆమెను వదిలివేసి మనందరం మన మన దేశాలకు వెళ్లిపోదాం. వరలోకంలో దేవుడు బబులోనుకు శిక్ష నిర్ణయిస్తాడు. బబులోనుకు ఏమి సంభవించాలో ఆయన నిర్ణయిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 “ ‘మనం బబులోనును స్వస్థపరచి ఉండేవారం, కానీ దానికి స్వస్థత కలగదు; మనం దాన్ని విడిచి మన సొంత దేశానికి వెళ్దాం, ఎందుకంటే దాని తీర్పు ఆకాశాన్ని తాకుతుంది, అది మేఘాలంత ఎత్తుగా లేస్తుంది.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 51:9
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే యెహోవా ప్రవక్తయైన ఓదేదు అనే ఒకడు అక్కడ ఉన్నాడు. అతడు సమరయకు వస్తున్న సైన్యాన్ని కలుసుకోడానికి వెళ్లి వారితో ఇలా చెప్పాడు, “మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు యూదా వారి మీద కోపం వచ్చి, వారిని మీ చేతికి అప్పగించారు. కానీ మీరు ఆకాశాన్నంటే క్రోధంతో వారిని చంపేశారు.


ఇలా ప్రార్థించాను: “నా దేవా, నా ముఖాన్ని మీ వైపు ఎత్తడానికి నాకు చాలా సిగ్గుగా, అవమానంగా ఉంది. మా పాపాలు మా తల కన్న ఎత్తుగా ఉన్నాయి, మా అపరాధం ఆకాశాన్ని అంటింది.


తరుమబడుతున్న జింకలా, కాపరి లేని గొర్రెలా, వారు తమ సొంత ప్రజల వైపు తిరుగుతారు, వారు తమ స్వదేశాలకు పారిపోతారు.


నీ చిన్నప్పటి నుండి నీవు ఎవరి కోసం శ్రమపడ్డావో వారంతా నిన్ను నిరాశపరుస్తారు. వారంతా తమ తప్పుదారిలో వెళ్లిపోతారు. నిన్ను రక్షించగలిగే వారొక్కరూ ఉండడు.


వారు పదే పదే తడబడతారు; వారు ఒకరి మీద ఒకరు పడతారు. వారు, ‘లేవండి, మనం అణచివేసే వారి ఖడ్గానికి దూరంగా, మన స్వదేశాలకు, మన సొంత ప్రజల దగ్గరికి తిరిగి వెళ్దాం’ అని చెప్తారు.


దాని శాలల్లో ఉన్న కిరాయి సైనికులు బలిసిన దూడల వంటివారు. వారు కూడా నిలబడలేక, వెనక్కి పారిపోతారు. విపత్తు రోజు వారి మీదికి రాబోతోంది, అది వారు శిక్షించబడే సమయము.


బబులోను నుండి విత్తేవారిని, కొడవలితో కోత కోసేవారిని నిర్మూలం చేయండి. అణచివేసే వారి ఖడ్గం కారణంగా ప్రతి ఒక్కరూ తమ ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరూ తమ సొంత దేశానికి పారిపోతున్నారు.


“కోత సమయం దాటిపోయింది, వేసవికాలం ముగిసింది, అయినా మనం రక్షించబడలేదు.”


వారికి శ్రమ కలుగుతుంది, ఎందుకంటే నా మీద తిరుగుబాటు చేశారు! వారికి నాశనం కలుగుతుంది, ఎందుకంటే నాకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. నేను వారిని విమోచించాలని ఆశిస్తాను, కాని వారు నా గురించి అబద్ధాలు చెప్పారు.


అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది: “ ‘నా ప్రజలారా! మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా’ ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాకుండా, ఆమెలో నుండి బయటకు రండి;


ఆమె చేసిన పాపాలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి కాబట్టి, దేవుడు ఆమె అతిక్రమాలను జ్ఞాపకం చేసుకున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ