Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 51:55 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

55 యెహోవా బబులోనును నాశనం చేస్తారు; ఆయన దాని సందడిని అణచివేస్తారు. శత్రువుల కెరటాలు మహా జలాల్లా ఎగసిపడతాయి; వారి స్వరాల గర్జన ప్రతిధ్వనిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

55 యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహజలములవలె ఘోషించుచున్నవివారి ఆర్భాటము వినబడుచున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

55 యెహోవా బబులోనును నాశనం చేస్తున్నాడు. దాని మహా ఘోషను అణచివేస్తున్నాడు. వాళ్ళ శత్రువులు అనేక ప్రవాహ జలాల్లా గర్జిస్తున్నారు. వాళ్ళు చేసే శబ్దం బలంగా వినిపిస్తున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

55 అతి త్వరలో యెహోవా బబులోనును ధ్వంసం చేస్తాడు. నగరంలో వినవచ్చే గొప్ప సందడిని ఆయన అణచి వేస్తాడు. మహాసముద్రపు అలలు ఘోషించినట్లు శత్రువులు వచ్చిపడతారు. చుట్టు పట్లవున్న ప్రజలు ఆ గర్జన వింటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

55 యెహోవా బబులోనును నాశనం చేస్తారు; ఆయన దాని సందడిని అణచివేస్తారు. శత్రువుల కెరటాలు మహా జలాల్లా ఎగసిపడతాయి; వారి స్వరాల గర్జన ప్రతిధ్వనిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 51:55
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

మరణపు ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; దుష్టులు వరదలా పొంగి నన్ను ముంచెత్తుతారు.


సముద్రం యొక్క హోరును, అలల యొక్క ఘోషను దేశాల్లోని కలకలాన్ని నిమ్మళం చేసేవారు ఆయనే.


లోతైన ఊబిలో నేను దిగబడిపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను. నేను అగాధ జలాల్లో ఉన్నాను; వరదలు నన్ను ముంచేస్తున్నాయి.


మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒక రాత్రిలోనే మోయాబులోని ఆరు పట్టణం పాడై నశిస్తుంది! ఒక రాత్రిలోనే మోయాబులోని కీరు పట్టణం పాడై నశిస్తుంది!


ఉప్పొంగుతున్న నీటిలా ప్రజలు గర్జించినా ఆయన వారిని బెదిరించగా, వారు దూరంగా పారిపోతారు. కొండల మీది పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు, సుడిగాలికి గిరగిరా తిరుగుతూ ఎగిరిపోయే పిచ్చిమొక్కలా తరమబడతారు.


“బబులోనీయుల రాణి పట్టణమా, మౌనంగా కూర్చో, చీకటిలోనికి వెళ్లిపో; రాజ్యాలకు రాణివని ఇకపై నీవు పిలువబడవు.


నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను.


సముద్రం బబులోను మీదికి పొంగి వచ్చింది; ఎగసిపడే అలలు దాన్ని కప్పివేస్తాయి.


కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తూరు పట్టణమా, నేను నీకు విరోధిని. సముద్రంలో అలలు పొంగినట్లు అనేక జనాంగాలను నీ మీదికి రప్పిస్తాను.


“ఇంకా సూర్య, చంద్ర, నక్షత్రాలలో సూచనలు, సముద్ర తరంగాల గర్జనలతో భూమి మీద ఉన్న దేశాలు వేదనతో కలవరంతో సతమతం అవుతాయి.


అప్పుడు ఆ దేవదూత నాతో, “ఆ వేశ్య కూర్చుని ఉన్న ఆ జలాలే ప్రజలు, జనసమూహాలు, దేశాలు, వివిధ భాషలు మాట్లాడేవారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ