యిర్మీయా 49:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 “హెష్బోనూ, ఏడువు. ఎందుకంటే హాయి నాశనం చేయబడింది! రబ్బా నివాసులారా, బిగ్గరగా ఏడవండి! గోనెపట్ట కట్టుకుని దుఃఖించండి; గోడల లోపల ఇటు అటు పరుగెత్తండి, ఎందుకంటే మోలెకు దేవుడు తన యాజకులు, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 హెష్బోనూ, అంగలార్చుము, హాయి పాడాయెను, మల్కోమును అతని యాజకులును అతని యధిపతులును చెరలోనికి పోవు చున్నారు; రబ్బా నివాసినులారా, కేకలువేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 హెష్బోనూ, రోదన చెయ్యి. ఎందుకంటే హాయి నాశనమై పోయింది. రబ్బా కుమార్తెలారా, ఏడవండి, గోనె పట్టలు కట్టుకోండి. విలపించండి. ఊరకే అటూ ఇటూ పరుగెత్తండి. ఎందుకంటే మోలెకు దేవుడు చెరలోకి వెళ్తున్నాడు. వాడితో పాటు వాడి యాజకులూ, అధిపతులూ కూడా చెరలోకి వెళ్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 “హెష్బోను ప్రజలారా, విలపించండి! ఎందువల్లనంటే, హాయి పట్టణం పాడైపోయింది. రబ్బోతు-అమ్మోను మహిళల్లారా, విలపించండి! విషాద సూచకంగా మీరు నారబట్టలు ధరించి శోకించండి. రక్షణ కొరకు నగరానికి పరుగెత్తండి. ఎందువల్లనంటే, శత్రువు మీ మీదికి వస్తున్నాడు. వారు మల్కోము దైవాన్ని తీసికొనిపోతారు. వారు మల్కోము యాజకులను, అధికారులను చెరపట్టుతారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 “హెష్బోనూ, ఏడువు. ఎందుకంటే హాయి నాశనం చేయబడింది! రబ్బా నివాసులారా, బిగ్గరగా ఏడవండి! గోనెపట్ట కట్టుకుని దుఃఖించండి; గోడల లోపల ఇటు అటు పరుగెత్తండి, ఎందుకంటే మోలెకు దేవుడు తన యాజకులు, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు. အခန်းကိုကြည့်ပါ။ |