యిర్మీయా 48:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 “ఆమెకు మత్తు ఎక్కేలా త్రాగించండి, ఎందుకంటే ఆమె యెహోవాను ధిక్కరించింది. మోయాబు తన వాంతిలో పడిదొర్లుతుంది; ఆమె హేళన చేయబడుతుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 మోయాబు యెహోవాకు విరోధముగా తన్నుతాను గొప్పచేసికొనెను దాని మత్తిల్లజేయుడి మోయాబు తన వమనములో పొర్లుచున్నది అది అపహాస్యమునొందును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 “యెహోవానైన నాకు విరోధంగా మోయాబు ఆహంకరించాడు. అతనికి మత్తెక్కనీ. మోయాబు తన వాంతిలో పొర్లాడి అవమానం పొందుతాడు. ఎగతాళి పాలవుతాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్26 “యెహోవా కంటె తానే ముఖ్యమైనట్లు మోయాబు భావించటం జరిగింది. కావున, తాగినవాని మాదిరి తూలిపోయే వరకు మోయాబును శిక్షించండి. మోయాబు తాను కక్కిన పదార్థంలోపడి దొర్లుతాడు. ప్రజలు మోయాబును చూచి హేళన చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 “ఆమెకు మత్తు ఎక్కేలా త్రాగించండి, ఎందుకంటే ఆమె యెహోవాను ధిక్కరించింది. మోయాబు తన వాంతిలో పడిదొర్లుతుంది; ఆమె హేళన చేయబడుతుంది. အခန်းကိုကြည့်ပါ။ |
పరలోక ప్రభువుకు వ్యతిరేకంగా నిన్ను నీవు గొప్ప చేసుకున్నావు. దేవాలయ పాత్రలను తెప్పించి వాటిలో ద్రాక్షరసం పోసుకొని నీవు, నీ అధికారులు, నీ భార్యలు, నీ ఉంపుడుగత్తెలు త్రాగారు. చూడలేని, వినలేని, గ్రహించలేని వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, కర్ర, రాతి దేవుళ్ళను నీవు స్తుతించావు. కాని నీ జీవితాన్ని, నీ మార్గాలన్నిటిని తన చేతిలో పట్టుకున్న దేవున్ని నీవు గౌరవించలేదు.