Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 46:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 “వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు, బలాఢ్యులు తప్పించుకోలేరు. ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన వారు తడబడి పడిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందువారు తొట్రిల్లిపడుచున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 వేగం గలవాళ్ళు పారిపోలేక పోతున్నారు. సైనికులు తప్పించుకోలేక పోతున్నారు. ఉత్తర దిక్కులో వాళ్ళు యూఫ్రటీసు నదీ తీరంలో తడబడి పడిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 “వేగంగా పరుగెత్తేవారు, బలవంతులు కూడా తప్పించుకోలేరు. వారు తూలి పడిపోతారు. ఉత్తరదేశంలో యూఫ్రటీసు నదీ తీరాన ఇది జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 “వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు, బలాఢ్యులు తప్పించుకోలేరు. ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన వారు తడబడి పడిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 46:6
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

యోషీయా రాజుగా ఉన్నప్పుడు, ఈజిప్టు రాజైన ఫరో నెకో యూఫ్రటీసు నది దగ్గర అష్షూరు రాజుకు యుద్ధంలో సహాయపడడానికి వెళ్లాడు. రాజైన యోషీయా అతన్ని ఎదుర్కోబోయాడు, అయితే నెకో అతన్ని మెగిద్దో దగ్గర చంపాడు.


ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు నది వరకు ఈజిప్టు రాజు వంశంలో ఉన్న ప్రదేశాలన్నిటినీ బబులోను రాజు స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి అతడు తన సొంత దేశాన్ని విడిచి బయటకు రాలేదు.


నన్ను మ్రింగివేయాలని దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నా శత్రువులు నా పగవారు తూలి పడిపోతారు.


సూర్యుని క్రింద మరొకటి కూడ నేను గమనించాను: వేగంగా ఉన్నవారే పందెం గెలవలేరు బలంగా ఉన్నవారే యుద్ధాన్ని జయించలేరు, జ్ఞానులకు ఆహారం లభించదు తెలివైన వారికే సంపద ఉండదు చదువుకున్న వారికి దయ లభించదు; కాని సమయాన్ని బట్టే అందరికి అవకాశాలు వస్తాయి.


వారిలో అనేకమంది తడబడతారు; వారు పడిపోతారు, గాయపరచబడతారు వారు ఉచ్చులో చిక్కుకుని పట్టబడతారు.”


అప్పుడు యెహోవా నాతో, “ఉత్తరం నుండి దేశంలో నివసించే వారందరి మీద విపత్తు కుమ్మరించబడుతుంది.


అయితే పరాక్రమంగల బలాఢ్యుడైన యెహోవా నాకు తోడు; కాబట్టి నన్ను హింసించేవారు నిలువలేక తడబడతారు, వారు అనుకున్నది సాధించే యుక్తి లేక అవమానపాలవుతారు; వారి అవమానం ఎన్నటికీ మరవబడదు.


నేను ఉత్తరాది జనాంగాలను, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును పిలిపిస్తాను” అని యెహోవా అంటున్నారు. నేను వారిని ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, చుట్టుప్రక్కల ఉన్న అన్ని దేశాల మీదికి తీసుకువస్తాను. నేను ఈ ప్రజలను పూర్తిగా నాశనం చేస్తాను. వారిని భయానకంగా, హేళనగా శాశ్వతమైన నాశనంగా చేస్తాను.


సీయోనుకు కనబడేలా జెండాను ఎత్తండి! ఆలస్యం చేయకుండా క్షేమం కోసం పారిపోండి! నేను ఉత్తరం నుండి విపత్తును, భయంకరమైన నాశనాన్ని కూడా తెస్తున్నాను.”


అయితే ఈ దినం సైన్యాల అధిపతియైన యెహోవాది; తన శత్రువుల మీద పగతీర్చుకునే దినం. ఖడ్గం తనకు తృప్తి కలిగే వరకు హతమారుస్తుంది, తన రక్త దాహం తీరే వరకు హతమారుస్తుంది. ఎందుకంటే యూఫ్రటీసు నది ప్రక్కన ఉత్తర దేశంలో సైన్యాల అధిపతియైన యెహోవా బలి అర్పించబోతున్నారు.


దేశాలు నీ అవమానం గురించి వింటాయి; నీ కేకలు భూమంతటా వినబడతాయి. యోధులు ఒకరికొకరు తగిలి తడబడి; ఇద్దరూ కలిసి క్రిందకు పడిపోతారు.”


వారు పదే పదే తడబడతారు; వారు ఒకరి మీద ఒకరు పడతారు. వారు, ‘లేవండి, మనం అణచివేసే వారి ఖడ్గానికి దూరంగా, మన స్వదేశాలకు, మన సొంత ప్రజల దగ్గరికి తిరిగి వెళ్దాం’ అని చెప్తారు.


గర్విష్ఠులు తడబడి పడిపోతారు ఆమెను లేపడానికి ఎవరూ సహాయం చేయరు. నేను ఆమె పట్టణాల్లో అగ్ని రాజేస్తాను అది ఆమె చుట్టూ ఉన్నవారందరిని కాల్చివేస్తుంది.”


“బెన్యామీను ప్రజలారా, క్షేమం కోసం పారిపోండి! యెరూషలేము నుండి పారిపోండి! తెకోవాలో బూరధ్వని చేయండి! బేత్-హక్కెరెము మీద సంకేతం కోసం ధ్వజం నిలబెట్టండి! ఎందుకంటే ఉత్తర దిక్కునుండి విపత్తు వస్తుంది, భయంకరమైన విధ్వంసం కూడా వస్తుంది.


దీని తర్వాత, అతడు తన దేశ కోటల వైపు తిరుగుతాడు, కాని మరెన్నడు కనిపించకుండా, తడబడి పడిపోతాడు.


అప్పుడు అతని ఎదుట ఉప్పొంగే సైన్యం కొట్టుకుపోతుంది; అది, దాని నిబంధన అధికారి నాశనమవుతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ