Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 46:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 “ఈజిప్టులో ప్రకటన చేయండి, మిగ్దోలులో చాటించండి; మెంఫిసులో, తహ్పన్హేసులో కూడా చాటించండి: ‘ఖడ్గం నీ చుట్టూ ఉన్నవారందరిని హతమారుస్తుంది, కాబట్టి మీరు మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నొపులోను తహపనేసులోను ప్రకటనచేయుడి ఏమనగా–ఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మ్రింగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 ఐగుప్తులో తెలియజేయండి. అది మిగ్దోలులోనూ మెంఫిస్ లోనూ వినిపించాలి. తహపనేసులో వాళ్ళు ఇలా ప్రకటించారు. నీ చుట్టూ కత్తి స్వైర విహారం చేస్తూ అంతటినీ మింగివేస్తుంది. కాబట్టి మీరు లేచి ధైర్యంగా నిలిచి ఉండండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 “ఈ సందేశాన్ని ఈజిప్టులో తెలియజెప్పండి. మిగ్దోలు నగరంలో బోధించండి. ఈ సందేశాన్ని నోపు (మెంఫిన్) లోను, తహపనేసులోను ప్రచారం చేయండి: ‘యుద్ధానికి సిద్ధపడండి. ఎందువల్లనంటే మీ చుట్టూవున్న ప్రజలు కత్తిచే చంపబడుతున్నారు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 “ఈజిప్టులో ప్రకటన చేయండి, మిగ్దోలులో చాటించండి; మెంఫిసులో, తహ్పన్హేసులో కూడా చాటించండి: ‘ఖడ్గం నీ చుట్టూ ఉన్నవారందరిని హతమారుస్తుంది, కాబట్టి మీరు మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 46:14
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు అబ్నేరు బిగ్గరగా, “కత్తి ఎప్పుడూ నాశనం చేస్తూనే ఉండాలా? అది చివరకు ద్వేషంతోనే ముగుస్తుందని నీకు తెలియదా? తోటి ఇశ్రాయేలీయులను తరమడం ఆపమని నీ మనుష్యులకు చెప్పకుండా ఎంతకాలం ఉంటావు?” అని యోవాబుతో అన్నాడు.


“ఇశ్రాయేలీయులను వెనుకకు తిరిగి పీ హహీరోతుకు సమీపంలో మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో బయల్-సెఫోనుకు సరిగ్గా ఎదురుగా సముద్రతీరాన బసచేయమని వారితో చెప్పు.


ఒకవేళ మీరు ఎదిరించి తిరుగుబాటు చేస్తే, మీరు ఖడ్గం చేత నాశనమవుతారు” యెహోవా ఈ మాట చెప్తున్నారు.


సోయను అధిపతులు మూర్ఖులయ్యారు, మెంఫిసు నాయకులు మోసపోయారు. ఈజిప్టు గోత్రానికి మూలరాళ్లుగా ఉన్నవారు దానిని దారి తప్పేలా చేశారు.


“మనుష్యులు చేయని ఖడ్గానికి అష్షూరు పడిపోతుంది. మానవులు చేయని ఖడ్గం వారిని మ్రింగివేస్తుంది. వారు ఖడ్గం ఎదుట నుండి పారిపోతారు వారి యవ్వనస్థులు వెట్టిచాకిరి చేస్తారు.


యెహోవా ఖడ్గం రక్తసిక్తం అవుతుంది, అది క్రొవ్వుతో కప్పబడి ఉంది. గొర్రెపిల్లల, మేకల రక్తంతో, పొట్టేళ్ల మూత్రపిండాల మీది క్రొవ్వుతో కప్పబడి ఉంది. ఎందుకంటే బొస్రాలో యెహోవా బలి జరిగిస్తారు. ఎదోము దేశంలో ఆయన గొప్ప వధ జరిగిస్తారు.


ఎడారిలో ఉన్న బంజరు కొండలపైకి నాశనం చేసేవారు గుంపుగా వస్తున్నారు, యెహోవా ఖడ్గం భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు హతం చేస్తుంది; ఎవరూ క్షేమంగా ఉండరు.


అలాగే, మెంఫిసు, తహ్పన్హేసు పట్టణస్థులు, నీ పుర్రె పగులగొట్టారు.


“నేను వ్యర్థంగా నీ పిల్లలను శిక్షించాను; వారు దిద్దుబాటుకు స్పందించలేదు. నీ ఖడ్గం నీ ప్రవక్తలను, బాగా ఆకలిగా ఉన్న సింహంలా చంపింది.


ఈజిప్టులోని మిగ్దోలు, తహ్పన్హేసు, మెంఫిసులో, పత్రూసులో నివసిస్తున్న యూదులందరి గురించి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది:


అయితే ఈ దినం సైన్యాల అధిపతియైన యెహోవాది; తన శత్రువుల మీద పగతీర్చుకునే దినం. ఖడ్గం తనకు తృప్తి కలిగే వరకు హతమారుస్తుంది, తన రక్త దాహం తీరే వరకు హతమారుస్తుంది. ఎందుకంటే యూఫ్రటీసు నది ప్రక్కన ఉత్తర దేశంలో సైన్యాల అధిపతియైన యెహోవా బలి అర్పించబోతున్నారు.


ఈజిప్టులో నివసించేవారలారా, బందీలుగా వెళ్లడానికి మీ సామాన్లు సర్దుకోండి, ఎందుకంటే మెంఫిసు పాడుచేయబడి, నివాసులు లేక శిథిలమవుతుంది.


ఈజిప్టును గురించి: యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో యూఫ్రటీసు నది దగ్గర కర్కెమీషులో ఓడిపోయిన ఈజిప్టు రాజైన ఫరో నెకో సైన్యానికి వ్యతిరేకంగా వచ్చిన సందేశం ఇది:


“మనుష్యకుమారుడా! నీవు ప్రవచించి ఇలా చెప్పు, ‘అమ్మోనీయుల గురించి వారి అవమానాల గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం, వధ కోసం దూయబడింది, నాశనం చేయడానికి మెరుగు పెట్టబడి, మెరుపులా తళతళలాడుతూ ఉంది!


“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘విగ్రహాలను నాశనం చేసి మెంఫిసులో ఒక్క విగ్రహం కూడా మిగలకుండా చేస్తాను. ఈజిప్టు దేశంలో ఒక్క యువరాజు కూడా ఉండడు, ఆ దేశమంతా భయం పుట్టిస్తాను.


వారు నాశనాన్ని తప్పించుకున్నా సరే, ఈజిప్టువారిని సమకూరుస్తుంది, మెంఫిసు వారిని పాతిపెడుతుంది. వారికి ప్రియమైన వెండి వస్తువులను దురదగొండ్లు ఆక్రమిస్తాయి, వారి గుడారాలు ముళ్ళతో నిండుతాయి.


సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు “నేను నీకు వ్యతిరేకిని, నీ రథాల నుండి పొగ వచ్చేలా కాల్చివేస్తాను, ఖడ్గం నీ కొదమ సింహాలను చంపివేస్తుంది. నేను భూమ్మీద నీకు ఏ ఎర దొరక్కుండా చేస్తాను. నీ దూతల స్వరాలు ఇక వినబడవు.”


నా ఖడ్గం మాంసాన్ని తింటుండగా, నేను నా బాణాలను రక్తంతో మత్తెక్కేలా చేస్తాను: చంపబడినవారి రక్తం, బందీల రక్తంతో, శత్రు నాయకుల తలలను అవి తింటాయి.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ