Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 41:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 తమ గడ్డాలు గీసుకుని, బట్టలు చింపుకుని, తమను తాము గాయపరచుకున్న ఎనభైమంది షెకెము, షిలోహు, సమరయ నుండి భోజనార్పణలు, ధూపం తీసుకుని యెహోవా ఆలయానికి వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనినయెనుబదిమంది పురుషులు యెహోవా మందిరమునకు తీసికొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండియు షిలోహునుండియు షోమ్రోనునుండియు రాగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 గడ్డాలు గీయించుకుని, బట్టలు చింపుకుని, శరీరాలు గాయపరచుకున్న 80 మంది పురుషులు యెహోవా మందిరానికి తీసుకెళ్ళడానికి నైవేద్యాలు, ధూపద్రవ్యాలు చేతపట్టుకుని షెకెము నుంచి, షిలోహు నుంచి, షోమ్రోను నుంచి వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 తమ గడ్డాలు గీసుకుని, బట్టలు చింపుకుని, తమను తాము గాయపరచుకున్న ఎనభైమంది షెకెము, షిలోహు, సమరయ నుండి భోజనార్పణలు, ధూపం తీసుకుని యెహోవా ఆలయానికి వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 41:5
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

యాకోబు పద్దనరాము నుండి వచ్చి, క్షేమంగా కనానులో ఉన్న షెకెము పట్టణానికి చేరాడు, ఆ పట్టణం ఎదురుగా గుడారం వేసుకున్నాడు.


ఆ ప్రాంత పాలకుడు, హివ్వీయుడైన హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూశాడు, ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.


యోసేపు అన్నలు తమ తండ్రి మందలను మేపడానికి షెకెముకు వెళ్లారు.


అందువల్ల హానూను దావీదు దూతలను పట్టుకుని ఒక్కొక్కరికి సగం గడ్డం గీసి, పిరుదుల దగ్గర వారి వస్త్రాలు కత్తిరించి పంపించేశాడు.


రెహబామును రాజుగా చేయడానికి ఇశ్రాయేలు ప్రజలంతా షెకెముకు వెళ్లగా రెహబాము అక్కడికి వెళ్లాడు.


తర్వాత యరొబాము ఎఫ్రాయిం కొండ సీమలో కోటగోడలు గల షెకెము పట్టణం కట్టించుకుని అక్కడ నివసించాడు. అక్కడినుండి వెళ్లి పెనీయేలు కట్టించాడు.


అతడు షెమెరు దగ్గర సమరయ కొండను రెండు తలాంతుల వెండికి కొని దాని మీద పట్టణం కట్టించి, ఆ కొండకు మునుపటి యజమానియైన షెమెరు పేరిట దానికి సమరయ అని పేరు పెట్టాడు.


యూదా రాజైన ఆసా పరిపాలనలోని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో ఇశ్రాయేలు మీద ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు.


అతడు యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని యెరూషలేములోని ఇళ్ళన్నిటిని తగలబెట్టాడు. అతడు ప్రతి ప్రాముఖ్య భవనాన్ని తగలబెట్టాడు.


అందువల్ల హానూను దావీదు దూతలను పట్టుకుని వారి జుట్టు గొరిగించి, పిరుదుల దగ్గర వారి వస్త్రాలు కత్తిరించి పంపించేశాడు.


దాని రాళ్లు మీ సేవకులకు ఇష్టమైనవి; దుమ్ము వారికి దయ కలిగించింది.


షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని, మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు.


దీబోను ఏడ్వడానికి గుడికి తన క్షేత్రాలకు వెళ్తుంది; నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది. ప్రతి తల క్షౌరం చేయబడింది ప్రతివాని గడ్డం గొరిగించబడింది.


“ఈ దేశంలో గొప్పవారు చిన్నవారు అందరు చనిపోతారు. వారు పాతిపెట్టబడరు, వారి కోసం ఎవరు దుఃఖించరు, చనిపోయినవారి కోసం ఎవరూ తమను తాము కోసుకోరు, తల క్షౌరం చేయించుకోరు.


గెదల్యా హత్య జరిగిన మరుసటిరోజు, ఆ విషయం ఎవరికీ తెలియకముందే,


గాజా దుఃఖంలో తల క్షౌరం చేసుకుంటుంది; అష్కెలోను నిశ్శబ్దం చేయబడుతుంది. సమతల మైదానంలో మిగిలి ఉన్నవారలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపరచుకుంటారు?


ప్రతి తల గుండు చేయబడింది ప్రతి గడ్డం కత్తిరించబడింది; ప్రతి చేయి నరకబడింది ప్రతి నడుము గోనెపట్టతో కప్పబడింది.


“ ‘షిలోహులో నా పేరు కోసం నేను మొదట నివాసం ఏర్పరచుకున్న ప్రదేశానికి వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల దుష్టత్వాన్ని బట్టి నేను దానికి చేసినది ఏంటో చూడండి.


కాబట్టి, నేను షిలోహుకు చేసినట్టే, నా పేరు కలిగి ఉన్న ఆలయానికి, మీరు నమ్మిన ఆలయానికి, మీకు మీ పూర్వికులకు నేను ఇచ్చిన స్థలానికి ఇప్పుడు చేస్తాను.


మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చీల్చుకుని, మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి, ఆయన కృపా కనికరం గలవాడు, త్వరగా కోప్పడడు, మారని ప్రేమగలవాడు ఆయన జాలిపడుతూ విపత్తును పంపించకుండా ఉంటారు.


మీరు మీ దేవుడైన యెహోవాకు పిల్లలు. చనిపోయినవారి కోసం మిమ్మల్ని మీరు కోసుకోకూడదు, మీ కనుబొమ్మల మధ్య క్షవరం చేసుకోకూడదు,


ఇశ్రాయేలీయుల సమాజమంతా షిలోహులో సమావేశమై అక్కడ సమావేశ గుడారాన్ని ఏర్పాటు చేసింది. ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది,


ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతిపెట్టారు. యాకోబు దానిని షెకెము తండ్రియైన హమోరు కుమారుల నుండి వంద వెండి నాణేలకు కొన్నాడు. ఇది యోసేపు వారసుల వారసత్వంగా మారింది.


షిలోహులో దేవుని మందిరం ఉన్న కాలమంతా వారు మీకా చేసిన విగ్రహాన్ని పూజించారు.


యెరుబ్-బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సోదరుల దగ్గరకు వెళ్లి వారితో, తన తల్లి కుటుంబీకులందరితో ఇలా అన్నాడు,


ఇది ఏటేటా కొనసాగింది. హన్నా యెహోవా మందిరానికి వెళ్లినప్పుడెల్లా, ఆమె ఏడుస్తూ తినడం మానివేసేలా పెనిన్నా ఆమెను రెచ్చగొట్టేది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ