Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 41:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఏడవ నెలలో, రాజవంశానికి చెందిన వాడు, రాజు అధికారులలో ఒకడైన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొని మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు వచ్చాడు. అక్కడ వారు కలిసి భోజనం చేస్తుండగా,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పదిమంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనముచేసిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 కాని ఏడో నెలలో ఎలీషామా మనవడూ, నెతన్యా కొడుకూ, రాజవంశం వాడూ, రాజు ప్రధానుల్లో ఒకడైన ఇష్మాయేలూ, అతనితోపాటు మరో పదిమంది మనుషులు కలిసి, మిస్పాలో ఉన్న అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి వచ్చి అక్కడ అతనితోపాటు మిస్పాలో భోజనం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడు అగు ఇష్మాయేలు ఏడవ మాసంలో అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వచ్చాడు. అతనితో తమ మనుష్యులు పదిమంది ఉన్నారు. వారు మిస్పా పట్టణానికి వచ్చారు. ఇష్మాయేలు రాజ కుటుంబంలో ఒక సభ్యుడు. యూదా రాజు అధికారులలో ఒకడు. ఇష్మాయేలు, అతని మనుష్యులు గెదల్యాతో కలిసి భోజనం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఏడవ నెలలో, రాజవంశానికి చెందిన వాడు, రాజు అధికారులలో ఒకడైన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొని మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు వచ్చాడు. అక్కడ వారు కలిసి భోజనం చేస్తుండగా,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 41:1
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు ఎవరూ వినకుండా అతనితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్లి తన సోదరుడైన అశాహేలును చంపినందుకు ప్రతీకారంగా యోవాబు అబ్నేరు పొట్టలో కత్తితో పొడవగా అతడు చనిపోయాడు.


అహజ్యా తల్లి అతల్యా, తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని రాజకుటుంబం వారందరినీ నాశనం చేయడానికి పూనుకుంది.


బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాలో కొంతమందిని ఉండనిచ్చాడు. వారిమీద అతడు షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడు.


అయితే ఏడవ నెలలో రాజవంశానికి చెందిన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొని గెదల్యా దగ్గరకు వచ్చి అతన్ని, మిస్పాలో అతనితో ఉన్న యూదా వారిని, బబులోనీయులను చంపాడు.


అహజ్యా తల్లి అతల్యా తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని ఆమె యూదా రాజకుటుంబం వారందరినీ నాశనం చేయడానికి పూనుకుంది.


నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తారు. నా ప్రేమకు ప్రతిగా ద్వేషం చూపుతారు.


నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు, నా ఆహారం తిన్నవాడే, నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.


గర్వము ఉన్నచోట తగాదా ఉంటుంది, కాని సలహా తీసుకునేవారికి జ్ఞానము దొరుకుతుంది.


కోపం క్రూరమైనది ఆగ్రహం వరదలా పొర్లుతుంది. కానీ అసూయ ముందు ఎవరు నిలబడగలరు?


అతడు రాజభవనంలోని లేఖికుని గదిలోకి వెళ్లాడు, అక్కడ అధికారులందరు అనగా లేఖికుడైన ఎలీషామా, షెమయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా, ఇంకా ఇతర అధికారులందరూ కూర్చుని ఉన్నారు.


తర్వాత వారు ఆ గ్రంథపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో పెట్టి, తన భవన ప్రాంగణంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లి, జరిగినదంతా ఆయనతో చెప్పారు.


మనుష్యులను పంపి యిర్మీయాను కావలివారి ప్రాంగణం నుండి బయటకు తీసుకువచ్చారు. అతన్ని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లమని షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యాకు అప్పగించారు. కాబట్టి యిర్మీయా తన సొంత ప్రజల మధ్యనే ఉండిపోయాడు.


కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న సైన్య అధికారులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు వచ్చి,


అయితే, యిర్మీయా బయలుదేరక ముందు, నెబూజరదాను, “బబులోను రాజు యూదా పట్టణాలపై నియమించిన షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు తిరిగివెళ్లి, అతనితో పాటు ప్రజలమధ్య నివసించు, లేదా ఎక్కడికి వెళ్లడం సరియైనది అని నీకు అనిపిస్తే అక్కడికి వెళ్లు” అని చెప్పాడు. తర్వాత దళాధిపతి అతనికి ఆహారపదార్థాలు బహుమానం ఇచ్చి అతన్ని పంపించాడు.


కాబట్టి యిర్మీయా మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి వెళ్లి, దేశంలో మిగిలిపోయిన ప్రజలమధ్య నివసించాడు.


బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడని, అలాగే బబులోనుకు బందీలుగా వెళ్లకుండా మిగిలిన నిరుపేదలైన పురుషులు, స్త్రీలు, పిల్లల మీద అధికారిగా నియమించాడని చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న సైన్య అధిపతులందరు, వారి మనుష్యులు విన్నప్పుడు,


నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహానాను యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏఫా కుమారులు, మయకాతీయుని కుమారుడైన యెజన్యా వారి మనుష్యులు మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు వచ్చారు.


తర్వాత అతడు రాజ కుటుంబీకుల్లో ఒకన్ని ఎంచుకుని, అతనితో ప్రమాణం చేయించి, అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాక ఆ రాజ్యం బలహీనపడి, మరలా అది బలపడకుండా తన ఒప్పందాన్ని పాటించడం ద్వారా మాత్రమే మనుగడ సాగించేలా, దేశంలోని నాయకులను తీసుకెళ్లిపోయాడు.


“నేను మీ అందరి గురించి చెప్పడం లేదు; మీలో నేను ఎంపిక చేసుకున్నవారెవరో నాకు తెలుసు. అయితే ‘నా ఆహారం తిన్నవాడే నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తుతాడు’ అనే లేఖనం నెరవేరడానికి అలా జరగాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ