Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 38:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 యూదారాజు యొక్క రాజభవనంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను రాజు యొక్క అధికారుల దగ్గరికి తీసుకువస్తారు. అప్పుడు ఆ స్త్రీలు నిన్ను చూసి వెటకారంగా ఇలా అంటారు: “ ‘మీ నమ్మకమైన స్నేహితులు మిమ్మల్ని తప్పుదారి పట్టించారు, వారు మిమ్మల్ని అప్పగించారు. మీ పాదాలు బురదలో దిగబడినప్పుడు; మీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 –యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్ర్రీలు నిన్ను చూచి–నీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరనియందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 యూదా రాజమందిరంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను అధిపతుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు, చూడు! ఆ స్త్రీలు నిన్ను చూసి ఇలా అంటారు, ‘నీ స్నేహితులు నిన్ను మోసం చేసి నిన్ను నాశనం చేశారు. నీ పాదాలు బురదలో కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళు నిన్ను విడిచి పెట్టి పారిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 యూదా రాజగృహంలో మిగిలివున్న స్త్రీలంతా బయటకు లాగబడతారు. వారు బబులోను రాజు ముఖ్య అధికారుల వద్దకు తేబడుతారు. నీ స్త్రీలే నిన్ను ఒక పాట పాడి ఎగతాళి చేస్తారు. ఆ స్త్రీలు ఇలా అంటారు. ‘నీ మంచి స్నేహితులే నిన్ను తప్పుదోవ పట్టించారు. నీవారు నీకంటె బలవంతులైనారు. అటువంటి స్నేహితులనే నీవు నమ్మావు. నీ కాళ్లు బురదలో కూరుకున్నాయి. నీ స్నేహితులు నిన్ను వదిలి పెట్టారు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 యూదారాజు యొక్క రాజభవనంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను రాజు యొక్క అధికారుల దగ్గరికి తీసుకువస్తారు. అప్పుడు ఆ స్త్రీలు నిన్ను చూసి వెటకారంగా ఇలా అంటారు: “ ‘మీ నమ్మకమైన స్నేహితులు మిమ్మల్ని తప్పుదారి పట్టించారు, వారు మిమ్మల్ని అప్పగించారు. మీ పాదాలు బురదలో దిగబడినప్పుడు; మీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 38:22
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాని నా సహోదరులు నమ్మదగని జలప్రవాహాల్లా ఉన్నారు, ఉప్పొంగే వాగుల్లా ఆధారపడదగనివారుగా ఉన్నారు,


నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు, నా ఆహారం తిన్నవాడే, నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.


ఊబిలో నుండి నన్ను విడిపించండి, నన్ను మునిగి పోనివ్వకండి; నన్ను ద్వేషించేవారి నుండి లోతైన నీటిలో నుండి నన్ను కాపాడండి.


లోతైన ఊబిలో నేను దిగబడిపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను. నేను అగాధ జలాల్లో ఉన్నాను; వరదలు నన్ను ముంచేస్తున్నాయి.


అయితే చెక్కిన విగ్రహాలను నమ్మినవారు ప్రతిమలతో, ‘మీరు మాకు దేవుళ్ళు’ అని చెప్పేవారు, చాలా సిగ్గుతో వెనుకకు తిరుగుతారు.


నీ ప్రత్యేక మిత్రులుగా నీవు చేసుకొన్న వారిని యెహోవా నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేమంటావు? ప్రసవిస్తున్న స్త్రీ పడే బాధలాంటి బాధ నీకు కలుగదా?


చాలామంది గుసగుసలాడడం విన్నాను, “అన్ని వైపుల భయం! అతన్ని ఖండించండి! అతన్ని ఖండిద్దాము.” నా స్నేహితులందరూ నేను జారిపడాలని చూస్తూ ఉన్నారు, “బహుశా అతడు మోసపోవచ్చు; అప్పుడు మనం అతనిపై విజయం సాధించి అతని మీద పగ తీర్చుకుందాము.”


ప్రవక్తల మాటలను వినవద్దు, వారు మీతో, ‘నీవు బబులోను రాజుకు సేవ చేయవు’ అని అబద్ధాలు ప్రవచిస్తున్నారు.


యెహోవా ఇలా చెప్తున్నారు, ‘నేను వారిని పంపలేదు, నా పేరుతో వారు అబద్ధాలు ప్రవచిస్తున్నారు. కాబట్టి, నేను నిన్ను వెళ్లగొడతాను, మీరూ మీతో పాటు ప్రవచించే ప్రవక్తలు కూడా నశిస్తారు.’ ”


సిద్కియా రాజు యిర్మీయాతో, “బబులోనీయుల దగ్గరకు వెళ్లిపోయిన యూదుల గురించి నేను భయపడుతున్నాను, ఎందుకంటే బబులోనీయులు నన్ను వారి చేతికి అప్పగిస్తే, వారు నన్ను ఘోరంగా అవమానిస్తారు” అని అన్నాడు.


కానీ మీరు లొంగిపోవడానికి నిరాకరిస్తే, యెహోవా నాకు ఇలా తెలియజేశారు:


ఇష్మాయేలు మిస్పాలో ఉన్న మిగిలిన ప్రజలందరినీ రాజకుమార్తెలతో పాటు అక్కడ మిగిలిపోయిన వారందరినీ బందీలుగా చేశాడు. రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను వారి మీద అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడు. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని బందీలుగా తీసుకుని అమ్మోనీయుల దగ్గరకు బయలుదేరి వెళ్ళాడు.


షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యా దగ్గర రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను విడిచిపెట్టిన వారందరినీ అనగా పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను కూడా వారు తీసుకెళ్లారు. అలాగే వారు ప్రవక్తయైన యిర్మీయాను, నేరియా కుమారుడైన బారూకును తమ వెంట తీసుకెళ్లారు.


దాని శాలల్లో ఉన్న కిరాయి సైనికులు బలిసిన దూడల వంటివారు. వారు కూడా నిలబడలేక, వెనక్కి పారిపోతారు. విపత్తు రోజు వారి మీదికి రాబోతోంది, అది వారు శిక్షించబడే సమయము.


నేను చూస్తున్నదేంటి? వారు భయభ్రాంతులకు గురవుతున్నారు, వారు వెన్ను చూపుతున్నారు, వారి యోధులు ఓడిపోయారు. వారు వెనుకకు చూడకుండ వేగంగా పారిపోతున్నారు, అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


నేను దేశంలో నివసించే వారిపై నా చేయి చాచినప్పుడు వారి ఇల్లు, వారి పొలాలతో పాటు, వారి భార్యలు ఇతరులకు అప్పగించబడతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


కాబట్టి నేను వారి భార్యలను ఇతర పురుషులకు వారి పొలాలను క్రొత్త యజమానులకు ఇస్తాను. అల్పుల నుండి గొప్పవారి వరకు, అందరు లాభం కోసం అత్యాశతో ఉన్నారు; ప్రవక్తలు, యాజకులు అంతా ఒకటే, అందరు మోసం చేసేవారే.


“ఆయన పైనుండి అగ్ని పంపారు, దాన్ని నా ఎముకల్లోకి పంపారు. నా పాదాలకు వలవేసి నన్ను వెనుకకు తిరిగేలా చేశారు. ఆయన నన్ను నిర్జనంగా చేశారు, నేను బాధతో మూర్ఛపోయాను.


రాత్రంతా ఆమె ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది, ఆమె చెంపల మీద కన్నీరు ఉంటుంది. ఆమె ప్రేమికులందరి మధ్య ఉన్నా ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. ఆమె స్నేహితులందరూ ఆమెను అప్పగించారు; వారు ఆమెకు శత్రువులయ్యారు.


సీయోనులో స్త్రీలు, యూదా పట్టణాల్లో కన్యలు హింసించబడ్డారు.


పొరుగువారిని నమ్మకండి; స్నేహితుని మీద నమ్మకం పెట్టుకోకండి. మీ కౌగిటిలో ఉండే స్త్రీ దగ్గర కూడా మీ పెదవుల నుండి వచ్చే మాటలను కాచుకోండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ