Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 31:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 ఎందుకంటే యెహోవా యాకోబును, వారికంటే బలవంతుల చేతిలో నుండి వారిని విడిపిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 ఎందుకంటే, మూల్యం చెల్లించి, తనకు మించిన బలం ఉన్న వాడి చేతిలోనుంచి యెహోవా యాకోబును విమోచించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 యెహోవా యాకోబును తిరిగి తీసికొని వస్తాడు. యెహోవా తన ప్రజలను వారి కంటె బలవంతుల బారి నుండి రక్షిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 ఎందుకంటే యెహోవా యాకోబును, వారికంటే బలవంతుల చేతిలో నుండి వారిని విడిపిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 31:11
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను చాలా క్రుంగిపోయాను, నా మొరను ఆలకించండి. నన్ను వెంటాడే వారి నుండి రక్షించండి, వారు నాకంటే బలంగా ఉన్నారు.


భయం దిగులు వారి మీద పడతాయి. యెహోవా, మీ ప్రజలు దాటి వెళ్లేవరకు, మీరు కొనిన మీ ప్రజలు దాటి వెళ్లేవరకు మీ బాహుబలము చేత వారు రాతిలా కదలకుండా ఉంటారు.


యెహోవా దీనిని చేశారు కాబట్టి ఆకాశాల్లారా, ఆనందంతో పాడండి; భూమి లోతుల్లారా, బిగ్గరగా అరవండి. పర్వతాల్లారా, అరణ్యమా, నీలో ఉన్న ప్రతి చెట్టు సంగీత నాదం చేయండి. యెహోవా యాకోబును విడిపించారు ఆయన ఇశ్రాయేలులో తన మహిమను చూపిస్తారు.


బబులోనును విడిచిపెట్టండి. బబులోనీయుల నుండి పారిపోండి! “యెహోవా తన సేవకుడైన యాకోబును విడిపించారు” అని ఆనంద కేకలతో తెలియజేయండి. దానిని ప్రకటించండి. భూమి అంచుల వరకు దానిని తెలియజేయండి.


యోధుల నుండి దోపుడుసొమ్ము తీసుకోబడుతుందా? నీతిమంతుని నుండి బందీలు విడిపించబడతారా?


అయితే యెహోవా చెప్పే మాట ఇదే: “అవును, వీరుల నుండి బందీలు విడిపించబడతారు, క్రూరుల నుండి దోపుడుసొమ్ము తిరిగి వస్తుంది; నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను. నీ పిల్లలను నేను రక్షిస్తాను.


యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.


“దుష్టుల చేతుల నుండి నేను నిన్ను రక్షించి క్రూరమైన వారి పట్టు నుండి నిన్ను విడిపిస్తాను.”


సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కూడా అణచివేయబడ్డారు. వారిని బంధించినవారు వారిని పట్టుకొని ఉన్నారు వారిని విడిచిపెట్టడానికి నిరాకరించారు.


అయినా వారి విమోచకుడు బలవంతుడు; ఆయన పేరు సైన్యాల యెహోవా. ఆయన వారి దేశానికి విశ్రాంతిని తెచ్చేలా వారి పక్షాన వాదిస్తారు, బబులోనులో నివసించేవారికి అశాంతి కలుగుతుంది.”


ప్రభువా, నీవు నా కేసు తీసుకున్నావు. నీవు నా ప్రాణాన్ని విమోచించావు.


“నేను ఈ ప్రజలను పాతాళం శక్తి నుండి విడిపిస్తాను; మరణం నుండి వారిని విమోచిస్తాను. ఓ మరణమా, నీవు కలిగించే తెగుళ్ళు ఎక్కడ? ఓ పాతాళమా, నీవు కలిగించే నాశనం ఎక్కడ? “అతడు తన సోదరుల మధ్య ఎదుగుతున్నా సరే,


కాపరి తన గొర్రెల మందను కాపాడినట్లు ఆ రోజున వారి దేవుడైన యెహోవా వారిని కాపాడతారు. వారు కిరీటంలోని ప్రశస్తమైన రాళ్లలా ఆయన దేశంలో ఉంటారు.


“ఎవడైనా బలవంతుడైనవాని ఇంట్లోకి వెళ్లి మొదట ఆ బలవంతుని బంధించకుండా అతని ఆస్తిని దోచుకోగలడా? అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు.


ఎందుకంటే మనుష్యకుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు కాని సేవ చేయడానికి, తన ప్రాణాన్ని అనేకులకు విమోచన క్రయధనంగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నారు.


అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కాబట్టి మీరు పొరపాటు పడుతున్నారు.


యేసు క్రీస్తు మన అతిక్రమాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మంచి చేయడానికి ఆసక్తి కలిగిన తన ప్రజలుగా మనల్ని పవిత్రపరచాలని తనను తాను అర్పించుకున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ