Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 25:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను, మీ చెడు ఆచారాలను ఇప్పటికైనా విడిచిపెట్టండి, యెహోవా మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు శాశ్వతంగా ఉండగలరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ఈ ప్రవక్తలు ఇలా చెప్పారు, ‘మీలో ప్రతి ఒక్కరూ మీ దుర్మార్గం, దురాచారాల నుంచి మళ్ళుకోండి. యెహోవా మీకూ, మీ పూర్వీకులకూ శాశ్వతమైన బహుమానంగా దయచేసిన ఈ దేశంలో మీరు నివసించేలా చేసుకోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 ఆ ప్రవక్తలు, “మీ జీవిత విధానం మార్చుకోండి. ఆ చెడు కార్యాలు చేయటం మానండి. మీలోమార్పు వస్తే, ఏనాడో దేవుడు మీరు నివసించుటకు మీ పితరులకు ఇచ్చిన రాజ్యానికి మీరు తిరిగి రాగలరు. మీరు శాశ్వాతంగా నివసించటానికి ఈ రాజ్యాన్ని ఆయన మీకిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను, మీ చెడు ఆచారాలను ఇప్పటికైనా విడిచిపెట్టండి, యెహోవా మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు శాశ్వతంగా ఉండగలరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 25:5
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు పరదేశిగా ఉంటున్న కనాను దేశమంతా నీకు, నీ తర్వాత నీ వారసులకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను; వారికి నేను దేవునిగా ఉంటాను.”


చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.


కీడు చేయడం మాని మేలు చేయి; అప్పుడు నీవు శాశ్వతంగా దేశంలో నివసిస్తావు.


“మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి. మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి; తప్పు చేయడం మానండి.


దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులు తమ అధికారులతో కలిసి ఈ నగర ద్వారాల గుండా వస్తారు. వారు, వారి అధికారులు రథాల మీద, గుర్రాల మీద స్వారీ చేస్తూ, యూదా వారితో, యెరూషలేము నివాసులతో కలిసి వస్తారు, ఈ పట్టణం శాశ్వతంగా ఉంటుంది.


“కాబట్టి ఇప్పుడు యూదా ప్రజలతోను, యెరూషలేము నివాసులతోను ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: చూడండి! నేను మీ కోసం ఒక విపత్తును రప్పిస్తున్నాను, మీకు వ్యతిరేకంగా ఒక ఆలోచన చేస్తున్నాను. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తనను సరిచేసుకోండి.’


నా సేవకులైన ప్రవక్తలందరినీ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి పంపాను. వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తన సరిచేసుకోవాలి; ఇతర దేవతలను సేవించవద్దు వాటిని అనుసరించవద్దు. అప్పుడు నేను మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు” అని ప్రకటించారు. కానీ మీరు నా మాట వినలేదు పట్టించుకోలేదు.


“ఇశ్రాయేలూ, నీవు తిరిగి వస్తే, నా దగ్గరకు తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీ అసహ్యమైన విగ్రహాలను నా దృష్టికి దూరంగా ఉంచితే ఇక దారి తొలగకుండా ఉంటే,


నేను మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో, అంటే ఈ స్థలంలో, మిమ్మల్ని శాశ్వతంగా నివాసం చేయనిస్తాను.


“ఇశ్రాయేలు ప్రజలారా! ఎవరి ప్రవర్తనను బట్టి వారిని నేను శిక్షిస్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. పశ్చాత్తాపపడి మీ అక్రమాల కారణంగా మీరు శిక్షించబడకుండా వాటిని విడిచిపెట్టండి.


నీవు వారితో ఇలా చెప్పు, ‘నా జీవం తోడు, దుర్మార్గులు చనిపోతే నాకు సంతోషం ఉండదు గాని వారు తమ చెడు మార్గాలు విడిచి బ్రతికితే నాకు సంతోషము. తిరగండి! మీ చెడు మార్గాల నుండి తిరగండి! ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చస్తారు?’ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


అయితే యూదా వారికి నా ప్రేమను చూపించి వారిని రక్షిస్తాను; విల్లు, ఖడ్గం, యుద్ధం, గుర్రాలు, రౌతుల వల్ల కాదు, కాని వారి దేవుడనైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను.”


మొదట దమస్కులో ఉన్నవారికి, తర్వాత యెరూషలేములో ఉన్నవారికి యూదయ ప్రాంతమంతటిలో ఉన్నవారందరికి, ఆ తర్వాత యూదేతరులకు పశ్చాత్తాపపడి దేవుని వైపునకు తిరగమని మారుమనస్సు పొందిన కార్యాలను చేయాలని నేను ప్రకటించాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ