Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 22:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ఒకవేళ మీరు ఈ ఆజ్ఞలను పాటించకపోతే, నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ రాజభవనం శిథిలమవుతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 మీరు ఈ మాటలు విననియెడల ఈ నగరుపాడై పోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 మీరు ఈ మాటలు వినకపోతే ఈ పట్టణం పాడైపోతుంది.’ ఇది యెహోవా వాక్కు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 కాని మీరీ ఆదేశాలను పాటించకపోతే యెహోవా ఇలా చెప్పుచున్నాడు: యెహోవానైన నేను ప్రమాణ పూర్వకంగా చెప్పేదేమంటే, ఈ రాజగృహం నాశనం చేయబడుతుంది. ఇది కేవలం ఒక రాళ్ల గుట్టగా మారిపోతుంది.’”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ఒకవేళ మీరు ఈ ఆజ్ఞలను పాటించకపోతే, నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ రాజభవనం శిథిలమవుతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 22:5
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

“యెహోవా ప్రకటిస్తున్నారు, నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నీవిలా నీ ఏకైక కుమారున్ని ఇవ్వడానికి వెనుకాడలేదు కాబట్టి,


“అయితే ఒకవేళ మీరు నన్ను అనుసరించుట మాని, నేను మీకు ఇచ్చిన శాసనాలు, ఆజ్ఞలు విడిచి ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తే,


ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు.


అప్పుడు ప్రజలు, ‘వారు తమను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చిన తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్ళను హత్తుకుని, పూజిస్తూ వాటికి సేవ చేశారు, అందుకే యెహోవా వారిపై ఈ విపత్తును తెచ్చారు’ అని జవాబిస్తారు.”


కాబట్టి, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.”


ఒకవేళ మీరు ఎదిరించి తిరుగుబాటు చేస్తే, మీరు ఖడ్గం చేత నాశనమవుతారు” యెహోవా ఈ మాట చెప్తున్నారు.


“నా ఇంటిని విడిచిపెడతాను, నా వారసత్వాన్ని వదిలివేస్తాను; నేను ప్రేమించిన దానిని తన శత్రువుల చేతికి అప్పగిస్తాను.


అయితే మీరు సబ్బాతు దినాన యెరూషలేము గుమ్మాల గుండా వస్తున్నప్పుడు ఎలాంటి బరువును మోస్తూ రాకుండ సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడంలో మీరు నాకు విధేయత చూపితే సరి, లేకపోతే నేను యెరూషలేము గుమ్మాల్లో ఆర్పలేని అగ్నిని రప్పిస్తాను, అది దాని భవనాలను దహించివేస్తుంది.’ ”


వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు నా మాట వినకపోయినా, నేను మీ ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినా,


బబులోనీయులు రాజభవనాలన్నిటిని ప్రజల ఇళ్ళను తగలబెట్టి యెరూషలేము గోడలను పడగొట్టారు.


అయితే ఈజిప్టులో నివసిస్తున్న యూదులారా, యెహోవా మాట వినండి: ‘నా గొప్ప నామం తోడు’ అంటూ యెహోవా ఇలా చెప్తున్నారు, ‘ఈజిప్టులో నివసించే యూదా వారెవరూ ఇకపై, “ప్రభువైన యెహోవా జీవం తోడు.”


ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసి, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “నేను యాకోబు గర్వాన్ని అసహ్యించుకుంటున్నాను అతని కోటలను ద్వేషిస్తున్నాను; నేను పట్టణాన్ని దానిలో ఉన్న అంతటితో శత్రువు వశం చేస్తాను.”


కాబట్టి మీ కారణంగా, సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో మట్టి దిబ్బగా మారుతుంది.


చూడు, నీ ఇల్లు నిర్జనమైనదిగా నీకే విడిచిపెట్టబడుతుంది.


తన విశ్రాంతిలో ఎన్నడూ ప్రవేశించరని దేవుడు అవిధేయులతో కాక, మరెవరికి ప్రమాణం చేశాడు?


దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినపుడు, ఆయన కంటే గొప్పవాడు మరియొకడు లేడు కాబట్టి ఆయన తన మీదనే ప్రమాణం చేసి,


తన వాగ్దానానికి వారసులైన వారికి తన మార్పులేని స్వభావంలోని ఉద్దేశాన్ని స్పష్టం చేయడానికి దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని ప్రమాణంతో దృఢపరిచారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ