Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 20:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 “దేవుని పేరు నేనెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటించను” అని అనుకుంటే, అప్పుడది నా హృదయంలో అగ్నిలా మండుతుంది. నా ఎముకల్లో మూయబడిన అగ్ని! ఎంత కాలమని ఓర్చుకోను? విసుగొస్తుంది, చెప్పకుండా ఉండలేను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమునుబట్టి ప్రకటింపను, అని నేననుకొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ‘ఇక నుంచి నేను యెహోవా గురించి ఆలోచించను, ఆయన పేరు ఎత్తను’ అనుకుంటే అది నా గుండెలో మండినట్టుంది. నా ఎముకల్లో మంట పెట్టినట్టుంది. నేను ఓర్చుకుందాం అనుకుంటున్నాను గానీ నావల్ల కావడం లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 “నేనిక దేవుని గురించి మర్చిపోతాను. ఇక ఏ మాత్రం దేవుని నామం పేరిట నేను మాట్లాడను!” అని నేను కొన్ని సార్లు అనుకున్నాను. కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగులుతుంది! అది నన్ను లోపల దహించి వేస్తుంది. దేవుని వర్తమానం నాలో ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను. ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 “దేవుని పేరు నేనెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటించను” అని అనుకుంటే, అప్పుడది నా హృదయంలో అగ్నిలా మండుతుంది. నా ఎముకల్లో మూయబడిన అగ్ని! ఎంత కాలమని ఓర్చుకోను? విసుగొస్తుంది, చెప్పకుండా ఉండలేను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 20:9
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా గుండె నాలో వేడెక్కింది. నేను ధ్యానిస్తూ ఉండగా మంట రగులుకుంది; అప్పుడు నోరు తెరచిమాట్లాడాను:


“నా మాట అగ్నిలాంటిది కాదా, బండను ముక్కలు చేసే సుత్తిలాంటిది కాదా? అని యెహోవా ప్రకటిస్తున్నారు.


ప్రవక్తల గురించి: యెహోవాను బట్టి ఆయన మాట్లాడిన మాటలనుబట్టి నా హృదయం నాలో పగిలిపోయింది; నా ఎముకలన్నీ వణుకుతున్నాయి. త్రాగిన మత్తులో ఉన్నవాడిలా, ద్రాక్షరసానికి లొంగిపోయిన బలవంతునిలా ఉన్నాను,


అయ్యో, నా వేదన, నా వేదన! నేను నొప్పితో విలపిస్తున్నాను. అయ్యో, నా హృదయ వేదన! నా గుండె నాలో కొట్టుకుంటుంది, నేను మౌనంగా ఉండలేను. నేను బూరధ్వని విన్నాను; నేను యుద్ధ కేకలు విన్నాను.


కానీ నేను యెహోవా యొక్క ఉగ్రతతో నిండి ఉన్నాను, నేను దానిని పట్టుకోలేను. “వీధిలో ఉన్న పిల్లల మీద ఒక్కచోట పోగైన యువకుల మీద దానిని కుమ్మరించండి; భార్య భర్తలు, వృద్ధులు, వయస్సు మీరిన వారు అందులో చిక్కుకుంటారు.


అప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకుని తీసుకెళ్లాడు. నేనలాగే కొట్టుకొని పోయాను. నా మనస్సులో పుట్టిన కోపానికి ఎంతో కలత చెందినప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చింది.


అప్పుడు ఆయన, “మనుష్యకుమారుడా, నేనిచ్చే ఈ గ్రంథపుచుట్టను తిని నీ కడుపు నింపుకో” అన్నారు. ఆయన చెప్పినట్లే ఆ గ్రంథాన్ని తిన్నాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది.


సింహం గర్జించింది, భయపడని వారెవరు? ప్రభువైన యెహోవా చెప్పారు దానిని ప్రవచించకుండ ఉన్నవారెవరు?


“నీవు లేచి నీనెవె మహా పట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటించు, ఎందుకంటే దాని చెడుతనం నా దృష్టిలో ఘోరంగా ఉంది.”


అయితే యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోదామని తర్షీషు వైపు వెళ్లాడు. అతడు యొప్పేకు వెళ్లి అక్కడ తర్షీషుకు వెళ్లే ఓడను చూశాడు. అతడు డబ్బు చెల్లించి, యెహోవా నుండి పారిపోవడానికి ఓడ ఎక్కి తర్షీషుకు ప్రయాణమయ్యాడు.


అందుకు యేసు వానితో, “నాగలిపై చేయి వేసాక వెనుకకు తిరిగి చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు” అని అన్నారు.


పౌలు ఏథెన్సు పట్టణంలో వారి కోసం ఎదురుచూస్తూ, ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉందని చూసి ఎంతో దుఃఖించాడు.


సీల తిమోతిలు మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చినప్పుడు, పౌలు యేసే క్రీస్తు అని యూదులకు ప్రకటించడానికి, సాక్ష్యమివ్వడానికి తనను తాను ప్రత్యేకంగా అంకితం చేసుకున్నాడు.


మా మట్టుకైతే, మేము చూసినవాటిని విన్నవాటిని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము” అని బదులిచ్చారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ