Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 20:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 నేను ఈ పట్టణంలోని సంపాదనంతటిని అంటే దాని ఉత్పత్తులన్నిటినీ, విలువైన వస్తువులన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు దానిని దోచుకుని బబులోనుకు తీసుకెళ్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభ మంతయు దాని అమూల్యవస్తువులన్నియు యూదారాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ఈ పట్టణంలోని సంపద అంతా, దాని ఆస్తి, విలువైన వస్తువులన్నీ యూదా రాజుల ఖజానా అంతా నేనప్పగిస్తాను. మీ శత్రువుల చేతికి వాటిని అప్పగిస్తాను. శత్రువులు వాటిని దోచుకుని బబులోను తీసుకుపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 యెరూషలేము నగర వాసులు ధనాన్ని కూడబెట్టటానికి, ఇతర నిర్మాణ కార్యక్రమాలకు చాలా కష్టపడినారు. కాని వాటన్నిటినీ వారి శత్రువులకు ఇచ్చివేస్తాను. యెరూషలేములోని రాజుకు ధనాగారాలు వున్నాయి. ఆ ధనాగారాలను నేను శత్రువుకు ఇచ్చివేస్తాను. శత్రువు ఆ ధనరాశులను తీసుకొని బబులోను దేశానికి పట్టుకు పోతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 నేను ఈ పట్టణంలోని సంపాదనంతటిని అంటే దాని ఉత్పత్తులన్నిటినీ, విలువైన వస్తువులన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు దానిని దోచుకుని బబులోనుకు తీసుకెళ్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 20:5
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

వసంతకాలం వచ్చినప్పుడు నెబుకద్నెజరు రాజు మనుష్యులను పంపి అతన్ని, అతనితో పాటు యెహోవా మందిరంలో ఉన్న విలువైన వస్తువులను బబులోనుకు రప్పించాడు. అతడు యెహోయాకీను పినతండ్రియైన సిద్కియాను యూదా, యెరూషలేము మీద రాజుగా చేశాడు.


ఒక సమయం రాబోతుంది, నీ భవనంలో ఉన్నవన్నీ, ఈనాటి వరకు మీ పూర్వికుల కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెప్తున్నారు.


ఎడారిలో ఉన్న బంజరు కొండలపైకి నాశనం చేసేవారు గుంపుగా వస్తున్నారు, యెహోవా ఖడ్గం భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు హతం చేస్తుంది; ఎవరూ క్షేమంగా ఉండరు.


“మీ దేశమంతటా మీరు చేసిన పాపాలన్నిటి కారణంగా మీ సంపదను, మీ ఖజానాను నేను ఎలాంటి రుసుము లేకుండా దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను.


నీవు పాపం నీ దేశమంతటా ఉంది కాబట్టి దేశంలోని నా కొండలను, నీ ధనాన్ని, నీ సంపదను, నీ క్షేత్రాలతో పాటు దోపుడు సొమ్ముగా ఇస్తాను.


మన పూర్వికుల శ్రమ ఫలాలను వారి గొర్రెలను, మందలను, వారి కుమారులు, కుమార్తెలను మా యవ్వనం నుండి సిగ్గుమాలిన దేవతలు తినివేశాయి.


“పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముట్టడి దిబ్బలు ఎలా నిర్మించబడ్డాయో చూడండి. ఖడ్గం, కరువు తెగులు కారణంగా పట్టణం దాని మీద దాడి చేస్తున్న బబులోనీయుల చేతులకు అప్పగించబడుతుంది. నీవు చెప్పింది జరగడం ఇప్పుడు నీవే చూస్తున్నావు.


సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం నాలుగవ నెల తొమ్మిదవ రోజు పట్టణ ప్రాకారం విరగ్గొట్టబడింది.


బబులోనీయులు రాజభవనాలన్నిటిని ప్రజల ఇళ్ళను తగలబెట్టి యెరూషలేము గోడలను పడగొట్టారు.


విపత్తు తర్వాత విపత్తు వస్తున్నాయి; దేశం మొత్తం శిథిలావస్థలో ఉంది. వెంటనే నా గుడారాలు ధ్వంసమయ్యాయి, నా ఆశ్రయం క్షణంలో ధ్వంసమయ్యాయి.


ఆమె సంపదలన్నిటినీ ఆమె శత్రువులు చేజిక్కించుకున్నారు; యూదేతరుల దేశాలు ఆమె పరిశుద్ధాలయంలోకి ప్రవేశించడం ఆమె చూసింది, మీరు మీ సమాజంలోకి ప్రవేశించకుండ నిషేధించబడినవారు.


తన బాధలో, ఆమె నిరాశ్రయురాలిగా ఉన్న రోజుల్లో, యెరూషలేము పూర్వకాలంలో తనకు చెందిన సంపదలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటుంది. ఆమె ప్రజలు శత్రువు చేతిలో పడినప్పుడు, వారికి సాయం చేయడానికి ఎవరూ లేరు. ఆమె శత్రువులు ఆమె వైపు చూసి ఆమెకు కలిగిన నాశనాన్ని బట్టి నవ్వారు.


శత్రువులు, శత్రువులు యెరూషలేము గుమ్మాల్లోకి ప్రవేశించవచ్చని భూరాజులు నమ్మలేదు, ప్రపంచంలోని జనాంగలెవరూ నమ్మలేదు.


సింహం గర్జిస్తూ వేటను చీల్చేటట్లు దానిలో దాని ప్రవక్తలు కుట్ర చేస్తారు. వారు మనుష్యులను మ్రింగివేస్తారు. ప్రజల సంపదను విలువైన వస్తువులను దోచుకుంటారు. చాలామందిని విధవరాండ్రుగా చేస్తారు.


ప్రభువు నెబుకద్నెజరు చేతికి యూదా రాజైన యెహోయాకీమును, దేవుని ఆలయపు పరికరాలతో పాటు అప్పగించారు. బబులోను రాజు వాటిని తన బబులోనియా దేవుని గుడికి తీసుకెళ్లి వాటిని తన దేవుని ధనాగారంలో ఉంచాడు.


నేను ఎఫ్రాయిం పట్ల దయ చూపించను. యెహోవా నుండి తూర్పు గాలి వస్తుంది, ఎడారి నుండి అది వీస్తుంది. అతని నీటిబుగ్గ ఎండిపోతుంది అతని బావి ఇంకిపోతుంది. అతని ధననిధులు, ప్రియమైన వస్తువులు దోచుకోబడతాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ