Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 2:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 నీవు సబ్బుతో నిన్ను నీవు కడుక్కున్నా శుభ్రం చేయడానికి వాడే చూర్ణం వాడినా, నీ అపరాధపు మరక ఇంకా కనిపిస్తుంది,” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 నువ్వు నదిలో కడుక్కున్నా, ఎక్కువ సబ్బు రాసుకున్నా నీ దోషం నాకు గొప్ప మరకలాగా కనిపిస్తున్నది. ఇది ప్రభువైన యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 క్షారజలంతో స్నానం చేసుకున్నా, నీవు విస్తరించి సబ్బు వినియోగించినా నేను నీ దోష కళంకాన్ని చూడగలను.” ఈ వర్తమానం దేవుడైన యెహోవాది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 నీవు సబ్బుతో నిన్ను నీవు కడుక్కున్నా శుభ్రం చేయడానికి వాడే చూర్ణం వాడినా, నీ అపరాధపు మరక ఇంకా కనిపిస్తుంది,” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 2:22
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు దావీదు, “సరే, ఈ రోజు కూడా ఇక్కడే ఉండు. రేపు నేను నిన్ను వెనుకకు పంపిస్తాను” అని ఊరియాతో చెప్పాడు. కాబట్టి ఊరియా ఆ రోజు, మరుసటిరోజు యెరూషలేములోనే ఉండిపోయాడు.


నా అతిక్రమాలు సంచిలో మూసివేయబడతాయి; మీరు నా పాపాన్ని కప్పివేస్తారు.


యెహోవా, మీరు పాపాలను లెక్కిస్తే, ప్రభువా, ఎవరు నిలవగలరు?


మీరు మా దోషాలను మీ ఎదుట, మా రహస్య పాపాలను మీ సన్నిధి కాంతిలో ఉంచారు.


వారి మార్గాలన్నిటిపై నా దృష్టి ఉంది; నాకు కనబడకుండ లేదు, వారి పాపం నా కళ్ళకు దాచబడలేదు.


“యూదా పాపం వారి హృదయ పలకలపై, వారి బలిపీఠాల కొమ్ములపై, ఇనుప పనిముట్టుతో చెక్కబడింది. వజ్రపు మొనతో లిఖించబడింది.


యెరూషలేమా, నీ హృదయంలోని చెడును కడిగి రక్షించబడు. మీరు ఎంతకాలం చెడ్డ ఆలోచనలను కలిగి ఉంటారు?


“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ, మడ్డి ఉన్న కుండకు శ్రమ, దాని తుప్పు పోదు. ఏ వరుసలో వచ్చినా సరే దానిలో నుండి మాంసాన్ని ముక్క తర్వాత ముక్కగా తీయండి.


ఎఫ్రాయిం అపరాధం పోగుచేయబడింది, అతని పాపాలు వ్రాయబడ్డాయి.


యాకోబు ఆత్మగౌరవమైన తన నామం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశారు: “నేను వారు చేసిన వాటిలో ఒక్కటి కూడా ఎన్నటికీ మరువను.


“వారి క్రియలు ఎలాంటివో ఆ లెక్క అంతా నా దగ్గరే ఉంది, దాన్ని నిల్వచేసే నా ఖజానాలో భద్రపరచలేదా?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ