యిర్మీయా 2:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 నీ దుర్మార్గం నిన్ను శిక్షిస్తుంది; నీ భక్తిహీనత నిన్ను గద్దిస్తుంది. నీ దేవుడైన యెహోవాను, నీవు విడిచిపెట్టడం, నేనంటే భయం లేకపోవడం, నీకు ఎంత బాధ శ్రమ కలిగిస్తుందో ఆలోచించు, గ్రహించు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులులేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 నీ చెడుతనం నీ శిక్షకు కారణమౌతుంది. నువ్వు చేసిన ద్రోహం నిన్ను దండిస్తుంది అని ప్రభువు, సేనల ప్రభువు అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నీవు విడిచిపెట్టావు. నేనంటే నీకెంత మాత్రం భయం లేదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్19 మీరు చెడు పనులు చేశారు. మీ చెడ్డ పనులు మీకు శిక్షను తెస్తాయి. మీకు కష్టాలు సంభవిస్తాయి. ఆ ఆపద మీకు తగిన గుణపాఠం నేర్పుతుంది. దీనిని గురించి యోచన చేయండి! మీకై మీరు మీ దేవునికి దూరమగుట ఎంతటి ఘోరమైన విషయమో అప్పుడు మీకు అర్థమవుతుంది. నేనంటే భయ భక్తులు లేకపోవుట తగనిపని!” ఈ వర్తమానం నా ప్రభువును, సర్వశక్తి మంతుడయిన దేవుని వద్దనుండి వచ్చినది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 నీ దుర్మార్గం నిన్ను శిక్షిస్తుంది; నీ భక్తిహీనత నిన్ను గద్దిస్తుంది. నీ దేవుడైన యెహోవాను, నీవు విడిచిపెట్టడం, నేనంటే భయం లేకపోవడం, నీకు ఎంత బాధ శ్రమ కలిగిస్తుందో ఆలోచించు, గ్రహించు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |