Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 13:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 నడుముకు పట్టీ కట్టినట్లు నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదా ప్రజలందరినీ, నా కీర్తి, స్తుతి ఘనత కోసం నా ప్రజలుగా ఉండడానికి నాకు కట్టుకున్నాను. కానీ వారు వినలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 వారిని నా ప్రజలుగా చేసుకుని వారి ద్వారా నాకు కీర్తి ప్రతిష్టలు, మహిమ కలగాలని నేను ఆశించాను. ఒకడు నడికట్టు కట్టుకున్నట్టుగా నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలందరినీ నా నడుము చుట్టూ కట్టుకున్నాను గానీ, వారు నా మాటలు వినలేదు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 నడికట్టు వస్త్రాన్ని మనుష్యులు తమ నడుము చుట్టూ గట్టిగా కట్టుకుంటారు. అదే మాదిరి ఇశ్రాయేలు సంతతి వారిని, యూదా వంశంవారిని నాచుట్టూ కప్పుకొన్నాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “నేనలా ఎందుకు చేసినానంటే వారంతా నా ప్రజలు కావాలని. నా ప్రజలు నాకు ఖ్యాతిని, మహిమను, గౌరవాన్ని తెస్తారనుకున్నాను. కాని నా ప్రజలు నా మాటనే వినలేదు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 నడుముకు పట్టీ కట్టినట్లు నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదా ప్రజలందరినీ, నా కీర్తి, స్తుతి ఘనత కోసం నా ప్రజలుగా ఉండడానికి నాకు కట్టుకున్నాను. కానీ వారు వినలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 13:11
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు. ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు.


ఏ ఇతర జాతికి కూడా ఆయన ఈ విధంగా జరిగించలేదు; ఆయన న్యాయవిధులు వారికి తెలియవు. యెహోవాను స్తుతించండి.


“కాని నా ప్రజలు నా మాట వినలేదు; ఇశ్రాయేలు నాకు లోబడలేదు.


వారు నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు, వారు నా సుత్తిని ప్రకటిస్తారు.


వారు పరిశుద్ధ ప్రజలని, యెహోవా విడిపించినవారని పిలువబడతారు; నీవు అందరికి కావలసిన దానివని పాడుబడని పట్టణమని పిలువబడతావు.


యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి నార పట్టీ కొని నీ నడుముకు పెట్టుకో, అయితే అది నీళ్లతో తడపవద్దు.”


నా మాటలు వినకుండ, తమ హృదయాల మొండితనాన్ని అనుసరించి, ఇతర దేవుళ్ళను సేవించే, ఆరాధించే ఈ దుష్ట ప్రజలు ఈ పట్టీలా ఎందుకు పనికిరానివారిగా ఉంటారు!


“వారితో ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ప్రతి ద్రాక్ష తిత్తి ద్రాక్షరసంతో నింపబడాలి.’ ఒకవేళ వారు నీతో, ‘ప్రతి ద్రాక్ష తిత్తి ద్రాక్షరసంతో నింపబడాలని మాకు తెలీదా?’ అని అంటే,


“ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘వినండి! వారు మెడవంచని వారై నా మాటలు వినలేదు కాబట్టి నేను ఈ పట్టణం మీద దాని చుట్టుప్రక్కల గ్రామాలన్నిటి మీదికి నేను చెప్పిన ప్రతి విపత్తును తీసుకురాబోతున్నాను.’ ”


మీరు ఈజిప్టులో సూచకక్రియలు, అద్భుతాలు చేశారు, నేటికీ ఇశ్రాయేలు మధ్య, ఇతర మనుష్యలందరి మధ్య వాటిని కొనసాగిస్తూ మీరు ఇంకా పేరు కీర్తి కలిగించుకుంటున్నారు.


అప్పుడు నేను వారి కోసం చేయబోతున్న మంచి పనులన్నిటి గురించి విన్న భూప్రజలందరి ముందు ఈ పట్టణం నాకు కీర్తిని ఆనందాన్ని గౌరవాన్ని తెస్తుంది. నేను వారికి ఇచ్చే విస్తారమైన వృద్ధిని సమాధానాన్ని చూసి వారు భయంతో వణికిపోతారు.’


నేను మీపై కావలివారిని నియమించాను వారు మీతో ఇలా చెప్పారు, ‘బూరధ్వని వినండి!’ కాని మీరన్నారు, ‘మేము వినము.’


మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, నేను మీతో పదే పదే మాట్లాడాను, కానీ మీరు వినలేదు; నేను మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు జవాబివ్వలేదు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.


నేను వారికి ఈ ఆజ్ఞ ఇచ్చాను: నాకు లోబడండి, నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. మీకు మేలు జరిగేలా నా మార్గాలన్నిటిని అనుసరించండి.


కానీ వారు వినలేదు, అసలు పట్టించుకోలేదు; పైగా, వారు తమ చెడ్డ హృదయాల్లో ఉన్న మొండి కోరికలను అనుసరించి, వారు ముందుకు వెళ్లకుండా వెనుకకు వెళ్లారు.


కానీ వారు నా మాట వినలేదు, అసలు పట్టించుకోలేదు. వారు మెడ వంగనివారై, వారి పూర్వికులకంటే ఇంకా ఎక్కువ చెడు చేశారు.’


ఇశ్రాయేలీయులారా! యెహోవా ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన కుటుంబమంతటి గురించి నేను పలికిన ఈ మాట వినండి:


‘మీకు హెచ్చరికగా మా పాదాల దుమ్మును కూడా దులిపి వేస్తున్నాము. అయినా దేవుని రాజ్యం సమీపించింది’ అని తెలుసుకోండి.


యెహోవా ఈ రోజున మీరు ఆయన ప్రజలని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు ఆయన స్వంత ప్రజలుగా ఉంటూ ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించాలని ప్రకటించారు.


ఆయన తాను చేసిన అన్ని దేశాల కంటే మిమ్మల్ని హెచ్చిస్తారని, అప్పుడు మీరు ప్రశంసలు, కీర్తి, గౌరవం పొందుకుంటారని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలుగా ఉంటారని ఆయన ప్రకటించారు.


మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్పప్రజలకు వారి దేవుళ్ళు సమీపంగా ఉంటారు?


కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ