యిర్మీయా 13:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 నా మాటలు వినకుండ, తమ హృదయాల మొండితనాన్ని అనుసరించి, ఇతర దేవుళ్ళను సేవించే, ఆరాధించే ఈ దుష్ట ప్రజలు ఈ పట్టీలా ఎందుకు పనికిరానివారిగా ఉంటారు! အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు, నా మాటలు విన నొల్లక తమ హృదయకాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని యీ నడికట్టువలె అగుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఈ ప్రజలు అన్య దేవుళ్ళను పూజిస్తూ, వాటికే నమస్కారం చేస్తున్నారు. వాటినే అనుసరిస్తూ, నా మాటలు వినకుండా తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుస్తున్నారు. వారు ఎందుకూ పనికిరాని ఈ నడికట్టులాగా అవుతారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 యూదాలోని గర్విష్టులను, దుష్టులను నాశనం చేస్తాను. వారు నా వాక్కు వినటానికి నిరాకరిస్తున్నారు. మొండి వైఖరి దాల్చి, వారు చేయదలచుకున్న పనులే వారు చేస్తారు. వారు అన్యదేవుళ్లను అనుసరించి, ఆరాధిస్తారు. అటువంటి యూదా వారంతా ఈ నార నడికట్టు బట్టలా అయిపోతారు. వారు సర్వనాశనమవుతారు. వారెందుకూ పనికిరారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 నా మాటలు వినకుండ, తమ హృదయాల మొండితనాన్ని అనుసరించి, ఇతర దేవుళ్ళను సేవించే, ఆరాధించే ఈ దుష్ట ప్రజలు ఈ పట్టీలా ఎందుకు పనికిరానివారిగా ఉంటారు! အခန်းကိုကြည့်ပါ။ |
నా సేవకులైన ప్రవక్తలందరినీ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి పంపాను. వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తన సరిచేసుకోవాలి; ఇతర దేవతలను సేవించవద్దు వాటిని అనుసరించవద్దు. అప్పుడు నేను మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు” అని ప్రకటించారు. కానీ మీరు నా మాట వినలేదు పట్టించుకోలేదు.