Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 12:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 నా వారసత్వం నాకు మచ్చలున్న క్రూరపక్షిలా కాలేదా? దాన్ని ఇతర పక్షులు చుట్టుముట్టి దాడి చేస్తాయి వెళ్లి క్రూర మృగాలన్నిటిని పోగు చేయండి; మ్రింగివేయడానికి వాటిని తీసుకురండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయెనా? క్రూరపక్షులు దానిచుట్టు కూడుచున్నవా? రండి అడవిజంతువులన్నిటిని పోగు చేయుడి; మ్రింగివేయుటకై అవి రావలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నా వారసత్వం నాకు ఒక హైనా జంతువులాగా అయ్యింది. క్రూరపక్షులు దాని చుట్టూ గుమిగూడి ఉంటున్నాయి. రండి, అవి తినడానికి అడవి జంతువులన్నిటినీ పోగు చేయండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 నా ఆస్తి రాబందులచే ఆవరింపబడిన చనిపోయే జంతువులా వుంది. ఆ పక్షులు దాని చుట్టూ ఎగురుతాయి. వన్య (అడవి) మృగములారా, రండి. రండి, తినటానికి ఆహారం తీసుకోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 నా వారసత్వం నాకు మచ్చలున్న క్రూరపక్షిలా కాలేదా? దాన్ని ఇతర పక్షులు చుట్టుముట్టి దాడి చేస్తాయి వెళ్లి క్రూర మృగాలన్నిటిని పోగు చేయండి; మ్రింగివేయడానికి వాటిని తీసుకురండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 12:9
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి యెహోవా దాని మీదికి బబులోనీయుల, అరామీయుల, మోయాబీయుల, అమ్మోనీయుల దోపిడి మూకను పంపించాడు. ఇది యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా చెప్పినట్లు జరిగింది.


మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది, మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది; ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.


సైన్యాల యెహోవా అహంకారం, గర్వం ఉన్న ప్రతివారి కోసం హెచ్చింపబడిన వాటన్నిటి కోసం ఒక రోజును నియమించారు. (అవి అణచివేయబడతాయి),


పొలం లోని సమస్త జంతువులారా, రండి, అడవిలోని సమస్త మృగాల్లారా, వచ్చి తినండి!


“నేను నాలుగు రకాల బాధలను వారి మీదికి పంపుతాను. చంపడానికి ఖడ్గాన్ని, చీల్చడానికి కుక్కలను, తిని నాశనం చేయడానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


సింహాలు గర్జించాయి; అవి అతని మీదికి గుర్రుమన్నాయి. వారు అతని దేశాన్ని పాడుచేశారు; అతని పట్టణాలు కాలిపోయి నిర్జనమయ్యాయి.


వారిని చంపాలనుకున్న వారి శత్రువుల చేతికి నేను వారిని అప్పగిస్తాను. వారి మృతదేహాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి.


అప్పుడు ఈ ప్రజల కళేబరాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి వాటిని భయపెట్టడానికి ఎవరూ ఉండరు.


సీయోను చేతులు చాచింది, ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. యాకోబుకు తన పొరుగువారే శత్రువులుగా మారాలని యెహోవా శాసించారు; యెరూషలేము వారి మధ్య అపవిత్రం అయ్యింది.


కాపరి లేనందున అవి చెదిరిపోయాయి, అవి చెదిరిపోయి అడవి జంతువులన్నిటికి ఆహారమయ్యాయి.


నీవు చూసిన ఆ మృగం ఆ పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమెను దిక్కులేని దానిగా, దిగంబరిగా చేయడానికి ఆమెను తీసుకొస్తాయి. అవి ఆమె మాంసాన్ని తిని, ఆమె శరీరాన్ని అగ్నితో కాల్చివేస్తాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ