Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 10:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 తర్షీషు నుండి సాగగొట్టబడిన వెండి ఊఫజు నుండి బంగారం తీసుకురాబడ్డాయి. హస్తకళాకారుడు, కంసాలివాడు తయారుచేసిన వాటికి నీలం, ఊదా రంగుల వస్త్రాలు ధరింపచేశారు, అవన్నీ నైపుణ్యం కలిగిన పనివారిచేత తయారుచేయబడ్డాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 తర్షీషునుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజునుండి బంగారమును తెత్తురు, అది పని వాని పనియేగదా; పోతపోయువాడు దాని చేసెను, నీల ధూమ్రవర్ణములుగల వస్త్రములు వాటికున్నవి, అవన్నియు నేర్పరులగు పనివారి పనియే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టిన వెండినీ ఉఫాజ్ నుండి బంగారాన్నీ తెస్తారు. అది కూలీల చేతి పని. ఆ విగ్రహాలకు నీలి, ఊదా రంగు వస్త్రాలు తొడిగారు. అవన్నీ వైపుణ్యం గల పనివారు చేసినవే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 వారు తర్షీషు నగరంనుండి వెండిని, ఉపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను చేస్తారు. విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని వారిచే చేయబడతాయి. ఈ విగ్రహాలను నీలి రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు. “జ్ఞానులు” ఆ “దేవుళ్ల” ని చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 తర్షీషు నుండి సాగగొట్టబడిన వెండి ఊఫజు నుండి బంగారం తీసుకురాబడ్డాయి. హస్తకళాకారుడు, కంసాలివాడు తయారుచేసిన వాటికి నీలం, ఊదా రంగుల వస్త్రాలు ధరింపచేశారు, అవన్నీ నైపుణ్యం కలిగిన పనివారిచేత తయారుచేయబడ్డాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 10:9
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజుకు సముద్రంలో హీరాము ఓడలతో పాటు తర్షీషు నౌకలు కూడా ఉన్నాయి. అవి మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి.


హీరాము మనుష్యులతో పాటు రాజు ఓడలు సముద్రంలో తర్షీషు వెళ్లి, మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి.


అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు.


తర్షీషు రాజులు దూర దేశపు రాజులు, ఆయనకు పన్నులు చెల్లిస్తారు. షేబ సెబా రాజులు కానుకలు తెస్తారు.


తర్షీషుకు వెళ్లండి; సముద్ర తీర వాసులారా దుఃఖపడండి.


విగ్రహాన్ని ఒక శిల్పి పోతపోస్తాడు, కంసాలి దానికి బంగారు రేకులు పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు.


“ ‘నీ గొప్ప సంపదను బట్టి తర్షీషు వారు నీతో వ్యాపారం చేశారు; వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి మీ సరుకు తీసుకున్నారు.


ఈజిప్టు నుండి వచ్చిన కుట్టుపని చేసిన సన్నని నార నీ తెరచాపగా జెండాగా పని చేశాయి; ఎలీషా తీరాల నుండి తెచ్చిన నీలం ఊదా రంగుల బట్ట నీ అంతస్తుల పైకప్పులు.


నేను తేరిచూడగా, నా ఎదుట సన్నని నారబట్టలు ధరించి నడుముకు ఊఫజు నుండి తెప్పించబడిన మేలిమి బంగారు నడికట్టు నడుముకు కట్టుకున్న మనిషి కనిపించాడు.


ఆ విగ్రహాలు ఇశ్రాయేలువి! ఈ దూడను కంసాలి తయారుచేశాడు. అది దేవుడు కాదు, ఆ సమరయ దూడ ముక్కలుగా విరగ్గొట్టబడుతుంది.


అయితే యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోదామని తర్షీషు వైపు వెళ్లాడు. అతడు యొప్పేకు వెళ్లి అక్కడ తర్షీషుకు వెళ్లే ఓడను చూశాడు. అతడు డబ్బు చెల్లించి, యెహోవా నుండి పారిపోవడానికి ఓడ ఎక్కి తర్షీషుకు ప్రయాణమయ్యాడు.


చెక్కను చూసి, ‘ప్రాణం తెచ్చుకో’ అని నిర్జీవమైన రాయితో, ‘మేలుకో’ అని చెప్పేవానికి శ్రమ! అది దారి చూపించగలదా? అది బంగారం వెండితో పూత వేయబడింది; దానిలో శ్వాస లేదు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ