Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 1:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 తర్వాత యెహోవా నాతో మాట్లాడుతూ, “యిర్మీయా, నీకేం కనబడుతోంది?” అని అడిగారు. అందుకు నేను, “బాదం చెట్టు కొమ్మ కనబడుతోంది” అని జవాబిచ్చాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై –యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు – బాదముచెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 యెహోవా వాక్కు నాకు కనబడి “యిర్మీయా, నీకేం కనబడుతున్నది?” అని అడిగాడు. అందుకు నేను “బాదం చెట్టు కొమ్మ కనబడుతున్నది” అన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 యెహోవా యొక్క సందేశం నాకు చేరింది యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తూ ఉన్నావు?” అప్పుడు యెహోవాకు నేనిలా సమాధాన మిచ్చాను: “బాదపు చెట్టుకొమ్మతో చేయబడిన ఒక కర్రను నేను చూస్తున్నాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 తర్వాత యెహోవా నాతో మాట్లాడుతూ, “యిర్మీయా, నీకేం కనబడుతోంది?” అని అడిగారు. అందుకు నేను, “బాదం చెట్టు కొమ్మ కనబడుతోంది” అని జవాబిచ్చాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 1:11
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే యాకోబు చినారు, బాదం, సాలు అనే చెట్ల కొమ్మలను తీసుకుని ఆ కొమ్మల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడు.


అలాగే నా నోటి నుండి వచ్చిన నా మాట ఉంటుంది: అది వట్టిగా నా దగ్గరకు తిరిగి రాకుండా నేను కోరుకున్న ప్రకారం చేసి నేను దానిని పంపిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది.


అప్పుడు యెహోవా నన్ను, “యిర్మీయా, నీకు ఏమి కనిపిస్తుంది?” అని అడిగారు. “అంజూర పండ్లు, వాటిలో మంచివి చాలా బాగున్నాయి, కానీ చెడిపోయిన బాగా కుళ్లిపోయిన వాటిని మాత్రం తినలేము” అని నేను జవాబిచ్చాను.


అయితే యెహోవానైన నేను, నేను ఏమి చేస్తానో అదే మాట్లాడతాను, అది ఆలస్యం లేకుండా నెరవేరుతుంది. ఎందుకంటే, తిరుగుబాటుదారులారా, మీ రోజుల్లో నేను చెప్పేది నెరవేరుస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


“కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇకపై నా మాటల్లో ఏదీ ఆలస్యం కాదు; నేను చెప్పిన మాటలన్నీ నెరవేరుతాయి, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


“ ‘ఇదిగో ఆ రోజు! అది వచ్చేస్తుంది! నాశనం బయలుదేరి వచ్చేసింది దండం వికసించింది. గర్వం చిగురించింది.


యెహోవా నన్ను, “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని అడిగారు. “కొలనూలు” అని నేను జవాబిచ్చాను. అప్పుడు ప్రభువు అన్నారు, “చూడు, నా ఇశ్రాయేలు ప్రజలమధ్య కొలనూలు వేయబోతున్నాను, ఇకమీదట వారిని శిక్షించకుండ వదలను.


“ఆమోసూ! నీవేం చూస్తున్నావు?” అని ఆయన అడిగారు. “పండిన పండ్ల గంప” అని నేను జవాబిచ్చాను. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “నా ప్రజలైన ఇశ్రాయేలుకు సమయం దగ్గరపడింది; ఇక నేను వారిని శిక్షించకుండా ఉండను.


“నీకు ఏం కనబడుతుంది?” అని నన్ను అడిగాడు. అందుకు నేను, “బంగారు దీపస్తంభం, దాని మీద ఉన్న గిన్నె, ఏడు దీపాలు, దీపాలకున్న ఏడు గొట్టాలు నాకు కనిపిస్తున్నాయి.


అతడు నన్ను, “నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. నేను, “ఇరవై మూరల పొడవు, పది మూరల వెడల్పు కలిగి ఎగురుతున్న గ్రంథపుచుట్టను చూస్తున్నాను” అని జవాబిచ్చాను.


మర్నాడు మోషే నిబంధన గుడారంలోకి వెళ్లి చూడగా, వాటిలో లేవీ వంశ ప్రతినిధి యైన అహరోను కర్ర చిగురించి మొగ్గలు తొడిగి, పూలు పూసి, బాదం పండ్లు వచ్చాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ