Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 9:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులను చంపి వారికి చేసిన ద్రోహానికి, వారిని చంపిన వారి సోదరుడైన అబీమెలెకు మీదికి, తన సోదరులను చంపడానికి అతనికి సహాయం చేసిన షెకెము పౌరుల మీదికి ప్రతిఫలం వచ్చేలా దేవుడు చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 యెరుబ్బయలు డెబ్భైమంది కొడుకులకు అబీమెలెకు చేసిన ద్రోహం మూలంగా వాళ్ళను చంపిన వారి సోదరుడు అబీమెలెకు మీదికి ప్రతిఫలం వచ్చేలా దేవుడు ఈ విధంగా చేశాడు. అతడు తన సహోదరులను చంపేలా అతన్ని బలపరచిన షెకెము నాయకుల మీదికి కూడా ఆ నరహత్య ఫలం వచ్చేలా ఆయన చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులను చంపి వారికి చేసిన ద్రోహానికి, వారిని చంపిన వారి సోదరుడైన అబీమెలెకు మీదికి, తన సోదరులను చంపడానికి అతనికి సహాయం చేసిన షెకెము పౌరుల మీదికి ప్రతిఫలం వచ్చేలా దేవుడు చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 9:24
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు చిందించిన రక్తానికి యెహోవా అతనికి ప్రతిఫలమిస్తారు. ఎందుకంటే అతనికంటే మంచివారు, ఉత్తములు అయిన నేరు కుమారుడు ఇశ్రాయేలు సేనాధిపతియైన అబ్నేరు, యెతెరు కుమారుడు యూదా సేనాధిపతియైన అమాశా అనే ఇద్దరిపై అతడు నా తండ్రియైన దావీదుకు తెలియకుండా దాడి చేసి వారిని ఖడ్గంతో చంపాడు.


వారి రక్తం యొక్క అపరాధం యోవాబు మీద అతని సంతతివారి మీద ఎల్లప్పుడు ఉండును గాక. కాని దావీదు, అతని సంతతివారు, అతని ఇల్లు, అతని సింహాసనం మీద యెహోవా సమాధానం ఎల్లప్పుడు ఉండును గాక” అని చెప్పాడు.


అయితే ఈ కుట్ర గురించి రాజుకు తెలిసినప్పుడు, అతడు హామాను యూదులకు వ్యతిరేకంగా తలపెట్టిన కీడు అతని మీదికే వచ్చేలా చేసి, అతన్ని అతని కుమారులను ఉరికంబాలకు వ్రేలాడదీయాలని రాజు వ్రాతపూర్వక ఆదేశాలు జారీ చేశాడు.


వారు చేసిన కీడు వారికే చుట్టుకుంటుంది; వారు చేసిన హింస వారి తల మీదికే వస్తుంది.


యెహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మహోన్నతుడైన యెహోవా నామానికి నేను స్తుతులు పాడతాను.


“ ‘మీరున్న భూమిని కలుషితం చేయకండి. రక్తపాతం దేశాన్ని కలుషితం చేస్తుంది రక్తపాతం చేసిన ఆ వ్యక్తి రక్తం ద్వారానే తప్ప ఆ భూమికి ప్రాయశ్చిత్తం చేయలేము.


“నిర్దోషి ప్రాణం తీయటానికి లంచం తీసుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.


అప్పుడు రాజైన అదోని-బెజెకు, “ఇలా కాలు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన డెబ్బైమంది రాజులు నా బల్లక్రింద పడిన ముక్కలు ఏరుకునేవారు. నేను వారికి చేసిన దానికి దేవుడు నాకు తగిన ప్రతిఫలమిచ్చారు” అని అన్నాడు. వారు అతన్ని యెరూషలేముకు తీసుకువచ్చారు, అతడక్కడ చనిపోయాడు.


అతనికి వ్యతిరేకంగా ఈ షెకెము పౌరులు దారిలో వెళ్లే వారందరి మీద దాడి చేసి దోచుకునేలా కొండ శిఖరాల మీద మనుషులను ఉంచారు. ఇది అబీమెలెకుకు తెలిసింది.


అయితే సమూయేలు, “నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్లు, స్త్రీల మధ్యలో నీ తల్లికి సంతానం లేకుండా పోతుంది” అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిలో అగగును ముక్కలుగా నరికాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ