Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 6:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 ఆ రాత్రే యెహోవా అతనితో ఇలా అన్నారు, “నీ తండ్రి మందలో నుండి ఏడు సంవత్సరాల వయస్సున్న రెండవ కోడెను తీసుకో. నీ తండ్రి కట్టిన బయలు దేవత బలిపీఠాన్ని పడగొట్టు, దాని ప్రక్కనున్న అషేరా స్తంభాన్ని విరగ్గొట్టు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 మరియు ఆ రాత్రియందే యెహోవా–నీ తండ్రి కోడెను, అనగా ఏడేండ్ల రెండవ యెద్దును తీసికొని వచ్చి, నీ తండ్రికట్టిన బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి, దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 ఆ రాత్రే యెహోవా “నీ తండ్రికి చెందిన ఎద్దును, ఏడేళ్ళ వయస్సు ఉన్న రెండవ యెద్దును తీసుకు వచ్చి, నీ తండ్రి బయలుకు కట్టిన బలిపీఠాన్ని పడగొట్టి, దానికి పైగా ఉన్న దేవతా స్తంభాన్ని నరికివెయ్యి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 అదే రాత్రి గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: “నీ తండ్రికి చెందిన బాగా ఎదిగిన ఎద్దును, అనగా ఏడు సంవత్సరాల ఎద్దును తీసుకో. నీ తండ్రికి బూటకపు బయలు దేవతా బలిపీఠము ఒకటి ఉంది. ఆ బలిపీఠము ప్రక్కగా ఒక కొయ్యస్తంభం ఉంది. బూటకపు దేవత అషేరా ఘనత కోసం ఆ స్తంభం చేయబడింది. బయలు బలిపీఠాన్ని పడదోసేందుకు, అషేరా స్తంభాన్ని విరగగొట్టేందుకు ఆ ఎద్దును ఉపయోగించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 ఆ రాత్రే యెహోవా అతనితో ఇలా అన్నారు, “నీ తండ్రి మందలో నుండి ఏడు సంవత్సరాల వయస్సున్న రెండవ కోడెను తీసుకో. నీ తండ్రి కట్టిన బయలు దేవత బలిపీఠాన్ని పడగొట్టు, దాని ప్రక్కనున్న అషేరా స్తంభాన్ని విరగ్గొట్టు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 6:25
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి యాకోబు తన ఇంటివారితో, తనతో ఉన్నవారందరితో అన్నాడు, “మీ దగ్గర ఉన్న ఇతర దేవతలను తీసివేయండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని శుభ్రమైన బట్టలు వేసుకోండి.


ఏలీయా ప్రజల దగ్గరకు వెళ్లి, “మీరు ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే అతన్ని అనుసరించండి” అని అన్నాడు. అయితే ప్రజలు ఏమి బదులు చెప్పలేదు.


ఒకవేళ నీవు సర్వశక్తిమంతుని వైపు తిరిగితే, నీవు మళ్ళీ పునరుద్ధరించబడతావు: నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నీవు తొలగించి


నేను నింద లేకుండ జీవించేలా వివేకంతో ప్రవర్తిస్తాను, మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు? నేను నిందారహితమైన హృదయంతో నా ఇంటి వ్యవహారాలను నిర్వహిస్తాను.


మీరు వారి బలిపీఠాలను పడగొట్టండి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టండి, వారి అషేరా స్తంభాలను ముక్కలు చేయండి.


“తన తండ్రిని గాని తల్లిని గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు.


“ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేదా ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవున్ని ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.


అందుకు పేతురు యోహానులు, “దేవుని దృష్టిలో మీ మాట వినడం న్యాయమా లేదా దేవుని మాట వినడం న్యాయమా? మీరే న్యాయం చెప్పండి.


అందుకు పేతురు ఇతర అపొస్తలులు, “మేము మనుష్యుల కన్నా దేవునికే లోబడాలి కదా!


మీరు వారికి ఇలా చేయాలి: వారి బలిపీఠాలను పడగొట్టండి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టండి, వారి అషేరా స్తంభాలను ముక్కలు చేయండి, వారి విగ్రహాలను అగ్నితో కాల్చివేయండి.


ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడు కార్యాలు చేసి బయలు దేవుళ్లను పూజించారు.


ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడు కార్యాలు చేశారు; తమ దేవుడైన యెహోవాను మరచి బయలు అషేరా ప్రతిమలను సేవించారు.


తర్వాత ఈ దుర్గం పైన సరియైన విధంగా నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టు. నీవు విరగ్గొట్టిన అషేరా స్తంభం కర్రను వాడుతూ ఆ రెండవ కోడెను దహనబలిగా అర్పించు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ