Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 4:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 అయితే హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు సుత్తిని తీసుకుని, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని దగ్గరకు నెమ్మదిగా వెళ్లింది. ఆమె ఆ మేకును అతని కణతలలో నుండి నేలలోకి దిగగొట్టగా అతడు చనిపోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 పిమ్మట హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు తీసికొని సుత్తె చేతపట్టుకొని అతనియొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 ఆ తరువాత హెబెరు భార్య యాయేలు గుడారానికి కొట్టే మేకు తీసుకుని ఒక సుత్తె చేత్తో పట్టుకుని మెల్లగా అతని దగ్గరికి వచ్చి, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని కణతలో ఆ మేకు దిగగొట్టగా అది అతని తలలో గుండా నేలలోకి దిగింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 కానీ యాయేలు ఒక గుడారపు మేకును, ఒక సుత్తెను చూసింది. యాయేలు త్వరగా సీసెరా దగ్గరకు వెళ్లింది. సీసెరా చాలా అలసిపోయినందువల్ల, నిద్రపోతున్నాడు. యాయేలు గుడారపు మేకును సీసెరా కణతల మీద పెట్టి, సుత్తెతో దిగ గొట్టేసింది. ఆ గుడారపు మేకు సీసెరా కణతల్లో నుండి నేల మీదికి దిగిపోయింది. సీసెరా మరణించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 అయితే హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు సుత్తిని తీసుకుని, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని దగ్గరకు నెమ్మదిగా వెళ్లింది. ఆమె ఆ మేకును అతని కణతలలో నుండి నేలలోకి దిగగొట్టగా అతడు చనిపోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 4:21
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా, లెండి! నా దేవా, నన్ను విడిపించండి! నా శత్రువులందరిని దవడపై కొట్టండి; దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి.


దీని గురించి వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, “జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను; వివేకవంతుల తెలివిని వ్యర్థం చేస్తాను.”


అయితే, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలోని బుద్ధిహీనులను దేవుడు ఎన్నుకున్నారు; బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలోని బలహీనులను దేవుడు ఎన్నుకున్నారు.


అక్కడే అతనికి గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి దొరికింది. అతడు దాన్ని చేతపట్టుకుని దానితో వేయిమందిని చంపేశాడు.


ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ ఖడ్గాన్ని తీసి రాజు పొట్టలో పొడిచాడు.


ఏహూదు తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు వచ్చాడు, పశువులను తోలే ములుకోలుతో ఆరువందలమంది ఫిలిష్తీయులను హతం చేశాడు. అతడు కూడా ఇశ్రాయేలీయులను కాపాడాడు.


అతడు ఆమెతో, “గుడార ద్వారం దగ్గర నిలబడు, ఎవరైనా వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.


అప్పుడు బారాకు సీసెరాను తరుముతూ వెళ్తునప్పుడు యాయేలు అతన్ని ఎదుర్కొని, “రండి, మీరు వెదుకుతున్న మనిషిని నేను చూపిస్తాను” అని అన్నది. అతడు ఆమెతో లోనికి వచ్చినప్పుడు, అక్కడ సీసెరా కణతలలో మేకుతో చచ్చి పడి ఉన్నాడు.


అప్పుడు దెబోరా, “నీతో నేను తప్పకుండా వస్తాను, అయితే నీ ప్రయాణం వలన నీకు ఘనత రాదు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగిస్తారు” అని చెప్పి ఆమె బారాకుతో కలిసి కెదెషుకు వెళ్లింది.


అతడు దావీదుతో, “కర్ర తీసుకుని నా మీదికి వస్తున్నావు నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తన దేవుళ్ళ పేరట దావీదును శపించాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ