Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 21:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 వారు ఇశ్రాయేలీయుల గోత్రాల్లో యెహోవా ఎదుట మిస్పాలో జరిగిన సమావేశానికి రానిది ఎవరు, అని విచారించినప్పుడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 అప్పుడు ఇశ్రాయేలు మనుష్యులు, “ఇశ్రాయేలుకి చెందిన ఏ వంశం వారు మిస్పాకి రాలేదు? మేము దేవుని సమక్షమున ఏకమైనాము. ఒక వంశం ఇక్కడికి రాలేదని మేము అనుకొంటున్నాము” అని అడిగారు. ఆ తర్వాత యాబేష్గీలాదు నగరం నుండి ఎవ్వరూ వచ్చి ఇశ్రాయేలుకి చెందిన ఇతరుల్ని కలుసుకోలేదని వారు కనుగొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 21:8
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు వాసులందరు విన్నప్పుడు,


వారికి మన కుమార్తెలను ఇవ్వవద్దని మనం యెహోవా పేరట శపథం చేశాం, మరి మిగిలిన వారికి భార్యలను ఎక్కడ చూడగలం?” అనుకున్నారు.


ప్రజలందరినీ లెక్కపెట్టినప్పుడు, యాబేషు గిలాదు నుండి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు.


యెహోవా దూత, ‘మేరోసును శపించండి, దాని ప్రజలను తీవ్రంగా శపించండి. ఎందుకంటే యెహోవాకు సహాయంగా వారు రాలేదు, శక్తిగల శూరులకు విరుద్ధంగా యెహోవాకు సహాయంగా వారు రాలేదు’ అన్నారు.


ఒక జత ఎడ్లను తీసుకుని వాటిని ముక్కలుగా చేసి ఇశ్రాయేలు దేశమంతటికి రాయబారులచేత వాటిని పంపి, “సౌలుతోను సమూయేలుతోను చేరకుండ ఉండే ప్రతిఒక్కరి ఎడ్లు ఇలాగే చేయబడతాయి” అని ప్రకటించాడు. అప్పుడు ప్రజలందరిలో యెహోవా భయం కలిగింది కాబట్టి అందరు ఒక్కటిగా కలసివచ్చారు.


అప్పుడు వారు, “రేపు సూర్యుడు వేడెక్కే సమయానికి మీరు రక్షించబడతారు” అని వచ్చిన రాయబారులతో చెప్పారు. ఆ రాయబారులు వెళ్లి యాబేషు గిలాదు వారికి ఈ వార్త తెలియజేసినప్పుడు వారు సంతోషించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ