న్యాయాధి 21:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని వారున్నారా?” అని అడిగారు. ఎందుకంటే ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాకపోతే వారికి మరణశిక్ష విధించాలని శపథం చేశారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అప్పుడు ఇశ్రాయేలీయులు – ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయినవారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అప్పుడు ఇశ్రాయేలీయులు “ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో మిస్పాలో యెహోవా ఎదుట జరిగిన సమావేశానికి రాకుండా ఉన్నదెవరు” అంటూ వాకబు చేసారు. ఎందుకంటే అలాంటి వారికి కచ్చితంగా మరణ శిక్ష విధించాలని శపథం చేశారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 “యెహోవా సమక్షంలో మమ్మల్ని కలుసుకోవడానికి రాని ఇశ్రాయేలు వంశాలవారెవరైనా ఉన్నారా?” అని ఇశ్రాయేలు ప్రజలు అడిగారు. ఒక తీవ్రమైన ప్రతిజ్ఞ చేశారు కనుక, వారీ ప్రశ్న అడిగారు. ఇతర ఇశ్రాయేలీయుల వంశముల నుండి మిస్పా నగరం రాకుంటే వారిని హతమార్చుతామని వారు ప్రతిజ్ఞ చేశారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని వారున్నారా?” అని అడిగారు. ఎందుకంటే ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాకపోతే వారికి మరణశిక్ష విధించాలని శపథం చేశారు. အခန်းကိုကြည့်ပါ။ |