Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 18:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 యాజకుడు, యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, దేశాన్ని పరిశోధించడానికి వెళ్లిన ఆ అయిదుగురు మనుష్యులు లోనికి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును గృహదేవతలను తీసుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 గవినివాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మనుష్యులు లోపలచొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆయాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ ఆరువందలమంది మనుష్యులతోకూడ గవిని యెదుట వాకిట నిలిచియుండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 అప్పుడు ఆ యాజకుడు ఆయుధాలు ధరించిన ఆరు వందలమందితో కలసి సింహద్వారం దగ్గర నిలిచి ఉండగా దేశాన్ని పరిశోధించడానికి వెళ్ళిన ఆ ఐదుగురు శూరులు లోపలికి వెళ్ళి ఆ ప్రతిమనూ, ఎఫోదునూ, గృహ దేవుళ్ళ విగ్రహాలనూ, పోత విగ్రహాన్నీ తీసుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17-18 ఐదుగురు గూఢచారులు ఇంట్లోకి వెళ్లారు. వెలుపల ద్వారం పక్కగా యుద్ధ సన్నద్ధులైన ఆ ఆరువందల మంది మనుష్యులతో యాజకుడు నిలబడివున్నాడు. ఆ మనుష్యులు మలిచిన విగ్రహం, ఏఫోదు, గృహదేవతలు మరియు వెండి విగ్రహం తీసుకున్నారు. యువకుడైన లేవీ యాజకుడు, “మీరేమి చేస్తున్నారు?” అని అడిగాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 యాజకుడు, యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, దేశాన్ని పరిశోధించడానికి వెళ్లిన ఆ అయిదుగురు మనుష్యులు లోనికి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును గృహదేవతలను తీసుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 18:17
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించే పనిమీద వెళ్లినప్పుడు, రాహేలు తన తండ్రి యొక్క గృహదేవతలను దొంగిలించింది.


సరే, నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాలన్న ఆశతో నీవు బయలుదేరావు. కానీ నా దేవతలను ఎందుకు దొంగిలించావు?”


అతడు ఆ ప్రజలు చేసిన దూడ విగ్రహాన్ని తీసుకుని అగ్నిలో కాల్చివేశాడు; తర్వాత అతడు దానిని పొడిచేసి, నీళ్ల మీద చల్లి, ఆ నీళ్లను ఇశ్రాయేలీయులతో త్రాగించాడు.


చూడండి, వారందరు మాయాస్వరూపులే వారి క్రియలు మోసమే; వారి పోత విగ్రహాలు వట్టి గాలి అవి శూన్యములే.


వారు దానిని తమ భుజాలపై ఎత్తుకుని మోస్తారు; దాని చోటులో దానిని నిలబెడతారు, ఆ చోటు నుండి అది కదల్లేదు. ఎవరైనా దానికి మొరపెట్టినా, అది జవాబివ్వలేదు; వారి కష్టాల నుండి వారిని రక్షించలేదు.


దారులు విడిపోయే చోట రెండు మార్గాలు చీలే స్థలంలో శకునం తెలుసుకోవడానికి బబులోను రాజు ఆగుతాడు. అతడు బాణాలను అటూ ఇటూ ఆడిస్తూ విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు. అతడు కాలేయం శకునాన్ని పరీక్షించి చూస్తున్నాడు.


ఎందుకంటే ఇశ్రాయేలీయులు చాలా కాలం రాజు గాని పాలకుడు గాని లేకుండా, బలులు గాని పవిత్ర రాళ్లు గాని లేకుండా, ఏఫోదు గాని గృహ దేవుళ్ళు గాని లేకుండా ఉంటారు.


నేను మీ విగ్రహాలను, మీ పవిత్ర రాళ్లను మీ మధ్య నుండి నిర్మూలిస్తాను; ఇకపై మీరు ఎన్నడు మీ చేతి పనులకు మ్రొక్కరు.


అప్పుడు లాయిషు ప్రాంతానికి వేగులవారిగా వెళ్లిన ఆ అయిదుగురు తమ తోటి దానీయులతో, “ఈ ఇళ్ళలో ఒక ఇంట్లో ఏఫోదు, కొన్ని గృహదేవతలు, వెండితో పొదిగించిన విగ్రహం ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడు ఏమి చేయాలో ఆలోచించండి” అన్నారు.


ద్వారం దగ్గర యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది దానీయులు నిలబడ్డారు.


ఆ అయిదుగురు మీకా ఇంట్లోకి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును, గృహదేవతలను తీసుకున్నప్పుడు, ఆ యాజకుడు, “మీరు ఏం చేస్తున్నారు?” అని వారిని అడిగాడు.


కాబట్టి దానీయులు తమ వంశాల నుండి అయిదుగురు సమర్థులైన యోధులను ఎన్నుకుని దానీయులందరి తరుపున జోరహు నుండి ఎష్తాయోలు నుండి దేశాన్ని పరిశీలించడానికి పంపి వారితో, “మీరు వెళ్లి దేశాన్ని పరిశీలించి రండి” అని అన్నారు. కాబట్టి వారు ఎఫ్రాయిం కొండసీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చి అక్కడే ఆ రాత్రి గడిపారు.


యోవాషు తన చుట్టూ చేరి గొడవ చేస్తున్న గుంపుతో, “మీరు బయలు పక్షాన ఉన్నారా? అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? వాని పక్షాన వాదించేవారు తెల్లవారక ముందే చావాలి! ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, ఎవరైనా తన బలిపీఠం పడగొట్టినప్పుడు తాను పోరాడతాడు కదా” అని చెప్పాడు.


తర్వాత మీకాలు ఒక విగ్రహాన్ని తీసుకువచ్చి మంచం మీద పెట్టి తల దగ్గర మేక వెంట్రుకలు ఉంచి దుప్పటితో దానిని కప్పింది.


దేవుని మందసం స్వాధీనం చేసుకోబడింది, ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులు చనిపోయారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ