Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 16:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 అప్పుడు ఆమె, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అన్నది. అతడు నిద్ర మేల్కొని, “నేను ఎప్పటిలాగే లేచి బయటకు వెళ్లి రెచ్చిపోతాను” అని అనుకున్నాడు, కానీ యెహోవా తనను విడిచిపెట్టారని అతనికి తెలియలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారనగా అతడు నిద్రమేలుకొని–యెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ఆమె “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అంది. సంసోను నిద్ర లేచి “ఎప్పటి లానే లేచి విసిరికొట్టి విడిపించుకుంటాను” అనుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచి పెట్టాడని అతనికి తెలియలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 అప్పుడు అతణ్ణి లేవమని చెప్పి, “సమ్సోనూ, ఫిలిష్తీయులిప్పుడు నిన్ను పట్టుకోనున్నారు” అని ఆమె చెప్పింది. అతను మేల్కొన్నాడు. ఆలోచన చేశాడు, “నేను పూర్వం చేసినట్లుగా చేసి తప్పించుకుంటాను. స్వతంత్రుణ్ణి అవుతాను.” కాని యెహోవా అతనిని విడనాడి వెళ్లినట్లు సమ్సోను గ్రహించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 అప్పుడు ఆమె, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అన్నది. అతడు నిద్ర మేల్కొని, “నేను ఎప్పటిలాగే లేచి బయటకు వెళ్లి రెచ్చిపోతాను” అని అనుకున్నాడు, కానీ యెహోవా తనను విడిచిపెట్టారని అతనికి తెలియలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 16:20
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు ఆసాను కలుసుకోడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పాడు, “ఆసా, సర్వ యూదా ప్రజలారా, బెన్యామీనీయులారా, నేను చెప్పేది వినండి. మీరు యెహోవాతో ఉంటే ఆయన మీతో ఉంటారు. మీరు ఆయనను వెదికితే, ఆయన మీకు కనిపిస్తారు. ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతారు.


యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించింది, ఇశ్రాయేలును దోపిడి చేసేవారికి అప్పగించింది ఎవరు? యెహోవా కాదా, మేము ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు కాదా? వారు ఆయన మార్గాలను అనుసరించలేదు ఆయన ధర్మశాస్త్రానికి లోబడలేదు.


విదేశీయులు అతని బలాన్ని లాగేస్తారు, కాని అతడు గ్రహించడు. అతని తలమీద నెరసిన వెంట్రుకలు ఉంటాయి, కాని అతడు గమనించడు.


మీరు మాత్రం యెహోవా మీద తిరగబడకండి. అక్కడి ప్రజలకు భయపడకండి ఎందుకంటే వారిని మనం చంపుతాము. వారికి కాపుదల లేదు, కానీ యెహోవా మనతో ఉన్నారు. వారికి భయపడకండి” అని చెప్పారు.


నేను వీన్ని మీ శిష్యుల దగ్గరకు తీసుకువచ్చాను కానీ వారు బాగు చేయలేకపోయారు” అని చెప్పాడు.


అందుకు యేసు, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణము. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఈ కొండతో, ‘ఇక్కడినుండి అక్కడికి వెళ్లు’ అంటే అది పోతుంది. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


మేము ఈ పనిని సాధించగలమని చెప్పుకోడానికి మేము సమర్థులమని కాదు, మాలో ఉన్న సామర్థ్యం దేవుని నుండి వచ్చింది.


తమ ఆశ్రయదుర్గం వారిని అప్పగిస్తేనే తప్ప, యెహోవా వారిని వదిలివేస్తేనే తప్ప, ఒక్కడు వేయిమందిని తరుమగలడా? ఇద్దరు పదివేలమందిని పారిపోయేలా చేయగలరా?


అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల ఎదుట నిలువలేక పోతున్నారు; వారు శాపానికి గురికావడం వల్లనే శత్రువులకు వెన్ను చూపి పారిపోయారు. మీ మధ్య వేరుగా ఉంచబడిన వాటన్నిటిని మీరు నాశనం చేస్తేనే తప్ప నేను ఇప్పటినుండి మీతో ఉండను.


మేకు పెట్టి బిగించింది. అప్పుడు సంసోనుతో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అనగానే అతడు నిద్ర మేల్కొని అనపసూదిని మగ్గాన్ని లాగివేశాడు.


ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒకని పిలిపించి, సంసోను ఏడు జడలను క్షౌరం చేయించి అతన్ని ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టింది. అతని బలం అతన్ని విడిచిపోయింది.


తర్వాత ఫిలిష్తీయులు అతన్ని బంధించి కళ్లు ఊడదీసి గాజాకు తీసుకెళ్లారు. అతన్ని ఇత్తడి గొలుసులతో బంధించి చెరసాలలో ధాన్యం విసరడానికి పెట్టారు.


అయితే సంసోను మధ్యరాత్రి వరకు మాత్రమే అక్కడ పడుకున్నాడు. తర్వాత అతడు లేచి, పట్టణ ద్వారం తలుపులను వాటి అడ్డకర్రలతో సహా ఊడబెరికి తన భుజాల మీద ఎత్తుకుని హెబ్రోనుకు ఎదురుగా కొండ మీదికి వాటిని మోసుకెళ్లాడు.


లోపలి గదిలో మనుష్యులు దాక్కొని ఉన్నప్పుడు అతనితో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని ఆమె అతనితో అనగా అతడు నూలు పోగును మంట దగ్గర పెడితే తెగిపోయినట్లు ఆ వింటినారలను తెంపేశాడు. కాబట్టి అతని బలం యొక్క రహస్యం వెల్లడి కాలేదు.


యెహోవా ఆత్మ సౌలును విడిచివెళ్లి, యెహోవా దగ్గర నుండి వచ్చిన దురాత్మ అతన్ని బాధించింది.


తర్వాత రోజు దేవుని దగ్గర నుండి దురాత్మ ఒకటి సౌలు మీదికి బలంగా వచ్చి అతడు ఇంట్లో ప్రవచిస్తున్నప్పుడు దావీదు ఎప్పటిలాగానే వీణ పట్టుకుని వాయించాడు. సౌలు చేతిలో ఒక ఈటె ఉంది.


యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదుకు భయపడ్డాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ