న్యాయాధి 15:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అప్పుడు దేవుడు లేహిలో ఉన్న ఒక బోలు స్థలం తెరవగా దానిలో నుండి నీళ్లు వచ్చాయి. సంసోను నీరు త్రాగగానే అతనికి బలం తిరిగివచ్చి అతని ప్రాణం తెప్పరిల్లింది. కాబట్టి ఆ ఊట ఎన్-హక్కోరె అని పిలువబడింది. అది ఇప్పటికి లేహిలో ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దానినుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రదికెను. కాబట్టి దానిపేరు నేటివరకు ఏన్హక్కోరె అనబడెను; అది లేహీలో నున్నది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అప్పుడు దేవుడు లేహీలో పల్లంగా ఉన్న ఒక స్థలాన్ని నెర్రె విచ్చేలా చేశాడు. దానిలోనుండి నీళ్ళు ఉబికి వచ్చాయి. అతడు ఆ నీటిని తాగాడు. అతడి ప్రాణం ఉపశమనం పొంది తేరుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి “ఏన్ హక్కోరే” అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతం ఇప్పటికీ లేహీ లో ఉంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్19 లేహీలోని నేలలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం బద్దలయ్యేలా దేవుడు చేసెను. నీళ్లు వెలికి వచ్చాయి. ఆ నీటిని సమ్సోను తాగి, హాయిపొందాడు. అతను మళ్లీ బలవంతుడయ్యాడు. అందువల్ల అతను ఆ నీటి బుగ్గకి ఎన్ హకోరె అని పేరు పెట్టాడు. నేటికీ లేహీ నగరంలో అది ఉంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అప్పుడు దేవుడు లేహిలో ఉన్న ఒక బోలు స్థలం తెరవగా దానిలో నుండి నీళ్లు వచ్చాయి. సంసోను నీరు త్రాగగానే అతనికి బలం తిరిగివచ్చి అతని ప్రాణం తెప్పరిల్లింది. కాబట్టి ఆ ఊట ఎన్-హక్కోరె అని పిలువబడింది. అది ఇప్పటికి లేహిలో ఉంది. အခန်းကိုကြည့်ပါ။ |