న్యాయాధి 14:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఏడవ రోజు సూర్యాస్తమయం కాకముందు, ఆ నగరవాసులు అతనితో అన్నారు, “తేనె కంటే తియ్యగా ఉండేదేంటి? సింహం కంటే బలమైనదేది?” అందుకు సంసోను, “మీరు నా దూడ దున్నకపోతే నా పొడుపు కథను చెప్పే వారే కాదు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఏడవదినమున సూర్యుడు అస్తమింపకమునుపు ఆ ఊరివారు– తేనెకంటె తీపియైనదేది? సింహముకంటె బలమైనదేది? అని అతనితో అనగా అతడు– నా దూడతో దున్నకపోయినయెడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 ఏడో రోజున సూర్యాస్తమయం ముందే ఆ ఊరి వాళ్ళు సంసోనుతో “తేనె కన్నా తీపి అయినదేది? సింహం కన్నా బలమైనదేది?” అన్నారు. సంసోను వారితో ఇలా అన్నాడు “మీరు నా దూడతో దున్నకపోయి ఉంటే నా పొడుపుకథను విప్పగలిగేవారు కాదు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 ఏడవ రోజున సూర్యుడు అస్తమించేలోగా ఫిలిష్తీయుల మనుష్యులకు సమాధానం లభించింది. వారు సమ్సోను వద్దకు వచ్చి, ఇలా అన్నారు: “తేనె కంటె మధురమైనదేది? సింహంకంటె బలంకలది ఏది?” తర్వాత సమ్సోను వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు కనుక నా ఆవుతోనే దున్నక పోతే మీరు నా విప్పుడుకథను పరిష్కరించి ఉండలేరు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఏడవ రోజు సూర్యాస్తమయం కాకముందు, ఆ నగరవాసులు అతనితో అన్నారు, “తేనె కంటే తియ్యగా ఉండేదేంటి? సింహం కంటే బలమైనదేది?” అందుకు సంసోను, “మీరు నా దూడ దున్నకపోతే నా పొడుపు కథను చెప్పే వారే కాదు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |