Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 14:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 అప్పుడు సంసోను భార్య అతనిపై పడి ఏడుస్తూ, “నీవు నన్ను ద్వేషిస్తున్నావు, నేనంటే నీకు ప్రేమ లేదు. నా ప్రజలకు ఒక పొడుపు కథ వేశావు, కానీ దాని అర్థం నాకు చెప్పలేదు” అన్నది. అతడు అన్నాడు, “దాని అర్థం నా తండ్రికి కాని తల్లికి గాని చెప్పలేదు, కాబట్టి నీకెందుకు దానిని వివరించాలి?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 కాబట్టి సమ్సోను భార్య అతని పాదములయొద్దపడి యేడ్చుచు–నీవు నన్ను ద్వేషించితివిగాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుప వైతివి అనగా అతడు–నేను నా తలిదండ్రులకైనను దాని తెలుపలేదు, నీకు తెలుపుదునా? అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతనియొద్ద ఏడ్చుచువచ్చెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 సంసోను భార్య అతని ఎదుట ఏడవడం మొదలు పెట్టింది “నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు గానీ ప్రేమించడం లేదు. నువ్వు మా వాళ్లకు ఒక పొడుపు కథ చెప్పావు. కానీ దానినెలా విప్పాలో నాకు చెప్పలేదు” అంది. దానికతడు “నేను మా అమ్మానాన్నలకే చెప్పలేదు నీకెలా చెప్తాను” అన్నాడు. ఆమె విందు జరిగిన ఏడు రోజులూ అతని దగ్గర ఏడుస్తూనే ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 అందువల్ల సమ్సోను భార్య అతనిని సమీపించి విలపించింది. ఆమె అన్నది: “నీవు నన్ను ద్వేషిస్తున్నావు. నీవు నిజంగా నన్ను ప్రేమించడంలేదు. నీవు మా మనుష్యులకో విప్పుడుకథ ఇచ్చావు. నీవు నాకైనా సమాధానం చెప్పవా?” అప్పుడు సమ్సోను ఇలా అన్నాడు: “నేను నా తల్లిదండ్రులకైనా చెప్పలేదు. నేను నీకు ఎందుకు చెప్పాలి?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 అప్పుడు సంసోను భార్య అతనిపై పడి ఏడుస్తూ, “నీవు నన్ను ద్వేషిస్తున్నావు, నేనంటే నీకు ప్రేమ లేదు. నా ప్రజలకు ఒక పొడుపు కథ వేశావు, కానీ దాని అర్థం నాకు చెప్పలేదు” అన్నది. అతడు అన్నాడు, “దాని అర్థం నా తండ్రికి కాని తల్లికి గాని చెప్పలేదు, కాబట్టి నీకెందుకు దానిని వివరించాలి?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 14:16
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏకశరీరం అవుతారు.


విందు జరిగిన ఏడు రోజులు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుస్తూ, అతన్ని ఇంకా విసిగిస్తున్నందుకు ఏడవ రోజున అతడు దాని అర్థం చెప్పాడు, ఆమె ఆ పొడుపు కథను తన ప్రజలకు వివరించింది.


అప్పుడు ఆమె, “నామీద నమ్మకం లేకుండా నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్తావు? నీ గొప్ప బలం యొక్క రహస్యం నాకు చెప్పకుండా నన్ను మోసం చేయడం ఇది మూడవసారి” అని అన్నది.


ఇలా ఆమె ప్రతిరోజు అతన్ని వేధించడంతో అతడు చస్తే బాగుండేది అనుకున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ