Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 11:39 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

39 ఆ రెండు నెలల తర్వాత ఆమె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది, అతడు తన మ్రొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు. ఆమె కన్యగానే ఉండిపోయింది. దీని నుండి ఇశ్రాయేలీయుల వచ్చిన ఆచారం ఏంటంటే

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

39 ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

39 ఆ రెండు నెలల తరువాత ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అతడు తాను మొక్కు కొన్న మొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

39 రెండు నెలల అనంతరం, యెఫ్తా కుమార్తె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది. యెఫ్తా యెహోవాకు వాగ్దానం చేసిన ప్రకారమే జరిగించాడు. యెఫ్తా కుమార్తెకు ఎవరితోనూ ఎన్నడూ లైంగిక సంబంధాలు లేవు. కనుక ఇశ్రాయేలులో ఇది ఒక ఆచారం అయ్యింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

39 ఆ రెండు నెలల తర్వాత ఆమె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది, అతడు తన మ్రొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు. ఆమె కన్యగానే ఉండిపోయింది. దీని నుండి ఇశ్రాయేలీయుల వచ్చిన ఆచారం ఏంటంటే

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 11:39
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

యిర్మీయా యోషీయా గురించి శోకగీతాన్ని రచించాడు. ఈ రోజు వరకు గాయనీ గాయకులందరు తమ విలాపవాక్కులలో యోషీయాను జ్ఞాపకం చేసుకుంటూ ఆలపిస్తారు. ఇలా చేయడం ఇశ్రాయేలులో ఒక ఆచారంగా మారింది.


అయితే కోడెను బలిచ్చేవారు నరబలి ఇచ్చేవారి వంటివారే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు, కుక్క మెడను విరిచేవారి వంటివారే; భోజనార్పణ చేసేవారు పందిరక్తం అర్పించేవారి వంటివారే, జ్ఞాపకార్థ ధూపం వేసేవారు విగ్రహాలను పూజించేవారి వంటివారే. వారు తమకిష్టమైన దుష్ట మార్గాలను ఎంచుకున్నారు వారి అసహ్యమైన పనులలో వారు సంతోషిస్తారు;


వారి విధానాల్లో మీ దేవుడనైన యెహోవాను మీరు ఆరాధించకూడదు, ఎందుకంటే వారు తమ దేవుళ్ళను పూజిస్తూ యెహోవా ద్వేషించే అసహ్యమైన సమస్తాన్ని చేస్తారు. వారు తమ కుమారులను కుమార్తెలను తమ దేవుళ్ళకు బలిగా అగ్నిలో కాల్చివేస్తారు.


నేను అమ్మోనీయుల దగ్గర నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, నా ఇంటి నుండి నన్ను కలుసుకోడానికి మొదలు ఏది బయటకు వస్తే, అది యెహోవాకు చెందినది, దానిని నేను దహనబలిగా అర్పిస్తాను.”


అందుకతడు, “నీవు వెళ్లవచ్చు” అని ఆమెతో అన్నాడు. రెండు నెలల వరకు అతడు ఆమెను వెళ్లనిచ్చాడు. ఆమె తన స్నేహితులతో కొండల్లోకి వెళ్లి తాను ఇక పెళ్ళి చేసుకోలేదని ప్రలాపించింది.


ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు యువతులు నాలుగు రోజులపాటు బయటకు వెళ్లి, గిలాదు వంశస్థుడైన యెఫ్తా కుమార్తె జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు.


ఆమె, “సైన్యాల యెహోవా, మీరు మీ సేవకురాలినైన కష్టాలను చూసి నన్ను గుర్తుంచుకుని, మీ సేవకురాలినైన నన్ను మరచిపోకుండా నాకు ఒక కుమారున్ని ఇస్తే, అతడు బ్రతికే దినాలన్ని యెహోవాకే ఇస్తాను, అతని తలపై క్షౌరపుకత్తి ఎప్పుడూ ఉపయోగించబడదు” అని అంటూ ఒక మ్రొక్కుబడి చేసింది.


హన్నా వెళ్లలేదు. ఆమె తన భర్తతో ఇలా చెప్పింది: “బాలుడు పాలు విడిచిన తర్వాత, నేను అతన్ని తీసుకెళ్లి యెహోవా ముందు ఉంచుతాను, ఇక అతడు ఎప్పుడూ అక్కడే ఉంటాడు.”


వాడు పాలు విడిచిన తర్వాత, వాడు చిన్నవాడిగా ఉండగానే ఆమె తనతో పాటు మూడు సంవత్సరాల ఎద్దును, ఒక ఏఫా పిండిని, ద్రాక్షతిత్తిని తీసుకుని షిలోహులో ఉన్న యెహోవా మందిరానికి తీసుకెళ్లింది.


కాబట్టి ఇప్పుడు నేను ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వాడు జీవించినంత కాలం యెహోవాకు ప్రతిష్ఠితుడై ఉంటాడు” అని చెప్పింది. అప్పుడు ఆ చిన్నవాడు అక్కడే యెహోవాను ఆరాధించాడు.


అయితే బాలుడైన సమూయేలు నారతో చేసిన ఏఫోదు ధరించుకొని యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ