Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 11:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు, వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేషుకు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రమువరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుంచి వస్తున్నప్పుడు వాళ్ళు ఎర్రసముద్రం వరకూ అరణ్యంలో నడిచి కాదేషుకు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనికి వెళ్లారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రానికి వెళ్లారు. తర్వాత వారు కాదేషు వెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు, వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేషుకు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 11:16
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

తర్వాత అక్కడినుండి వెనుకకు తిరిగి ఎన్ మిష్పాతు అనబడిన కాదేషుకు వెళ్లి, అమాలేకీయుల భూభాగమంతా, హససోన్ తామారులో నివసిస్తున్న అమోరీయుల భూభాగమంతా జయించారు.


వారు పారాను ఎడారిలో కాదేషులో ఉన్న మోషే అహరోనులు, ఇశ్రాయేలు సర్వసమాజం దగ్గరకు వచ్చారు. అక్కడ వారికి, సర్వ సమాజానికి విశేషాలు చెప్పి, ఆ దేశ పండ్లను వారికి చూపించారు.


అమాలేకీయులు, కనానీయులు ఆ లోయల్లో నివసిస్తున్నారు కాబట్టి, రేపు వెనుకకు తిరగండి, ఎడారి వైపు ఎర్ర సముద్రం మార్గం గుండా రండి” అని చెప్పారు.


సంవత్సరం మొదటి నెలలో ఇశ్రాయేలు సమాజమంతా సీను ఎడారికి చేరి కాదేషులో దిగారు. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడింది.


యెహోవా సమాజాన్ని ఈ అరణ్యంలోనికి ఎందుకు తెచ్చావు? మేము, మా పశువులు చావాలనా?


మీరైతే వెనుకకు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణించండి” అని అన్నారు.


కాబట్టి మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు.


యెహోవా మాట వినలేదు కాబట్టి, ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచినప్పుడు సైనిక వయస్సులో ఉన్న పురుషులందరు చనిపోయే వరకు వారు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. ఎందుకంటే మనకు ఇస్తానని వారి పూర్వికులకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు చూడరని యెహోవా వారితో ప్రమాణం చేశారు.


“యెఫ్తా చెప్పేది ఇది: ఇశ్రాయేలు మోయాబు దేశాన్ని లేదా అమ్మోనీయుల దేశాన్ని తీసుకోలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ