Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యాకోబు 4:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 మీరు కోరుకున్నదానిని పొందలేదు కాబట్టి మీరు హత్య చేస్తారు. మీరు ఆశపడిన దానిని సంపాదించుకోలేదు కాబట్టి మీరు పోరాటాలు, గొడవలు చేస్తారు. మీరు దేవుని అడగలేదు కాబట్టి మీరు పొందలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 మీరు కోరుతారు. అది లభించదు. దాని కోసం మీరు చంపటానికి కూడా సిద్ధమౌతారు. మీలో అసూయ కలుగుతుంది. అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు పోట్లాడుతారు. యుద్ధం చేస్తారు. కాని మీరు దేవుణ్ణి అడగరు కనుక మీ కోరిక తీరదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 మీరు కోరుకున్నదానిని పొందలేదు కాబట్టి మీరు హత్య చేస్తారు. మీరు ఆశపడిన దానిని సంపాదించుకోలేదు కాబట్టి మీరు పోరాటాలు, గొడవలు చేస్తారు. మీరు దేవుని అడగలేదు కాబట్టి మీరు పొందలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

2 మీరు కోరుకున్నదానిని పొందలేదు, కాబట్టి మీరు హత్య చేస్తారు. మీరు ఆశపడిన దానిని సంపాదించుకోలేదు, కనుక మీరు పోరాటాలు, గొడవలు చేస్తారు. మీరు దేవుని అడగలేదు కాబట్టి మీరు పొందలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యాకోబు 4:2
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకతడు, “నేను యెజ్రెయేలీయుడైన నాబోతుతో, ‘నీ ద్రాక్షతోటను నాకు వెండికి అమ్ము; లేదా నీకిష్టమైతే నీ తోటకు బదులుగా నేను నీకు ఇంకొక తోట ఇస్తాను’ అని అన్నాను. కాని అతడు, ‘నా ద్రాక్షతోట మీకివ్వను’ అన్నాడు” అని చెప్పాడు.


అక్రమ సంపాదన వెంటపడే వారందరి దారులు అలాంటివే; అది దానిని సొంతం చేసుకున్న వారి ప్రాణాలు తీస్తుంది.


ఒక ఒంటరివాడు ఉండేవాడు; అతనికి కుమారుడు కాని సోదరుడు కాని లేరు. కాని అతడు నిత్యం కష్టపడుతూనే ఉన్నాడు, అయినప్పటికీ అతని సంపద అతని కళ్లను తృప్తిపరచలేకపోయింది. “నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? నేను ఎందుకు ఆనందంగా లేను?” అని ప్రశ్నించుకున్నాడు, ఇది కూడా అర్థరహితమే విచారకరమైన క్రియ!


అయితే ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు.


ద్రాక్షరసం అతన్ని మోసం చేస్తుంది; గర్విష్ఠియైన అతడు ఎప్పుడూ విశ్రమించడు. అతనికి పాతాళమంత దురాశ ఉన్నందున మరణంలా అది ఎన్నడూ తృప్తిపడదు, అతడు సమస్త జనాలను వశపరచుకుంటాడు ప్రజలందరిని బందీలుగా తీసుకెళ్తాడు.


ఇప్పటివరకు మీరు నా పేరట ఏమి అడగలేదు. అడగండి మీరు పొందుకొంటారు, మీ ఆనందం పరిపూర్ణమవుతుంది.


యేసు, “నీవు దేవుని బహుమానం గురించి, నిన్ను నీళ్లు అడుగుతున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే నీవే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు” అని ఆమెకు జవాబిచ్చారు.


మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు.


మిమ్మల్ని ఎదిరించలేని నీతిమంతులను మీరు శిక్షించి వారిని హత్య చేశారు.


తన సహోదరిని, సహోదరుని ద్వేషించేవారు నరహంతకులు, ఏ నరహంతకునిలో నిత్యజీవం ఉండదని మీకు తెలుసు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ