Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 8:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 “ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీటిని వద్దు అని, రెజీను గురించి, రెమల్యా కుమారుని గురించి సంతోషిస్తున్నారు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 “ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీళ్లు వద్దని, రెజీనును బట్టి, రెమల్యా కుమారుణ్ణి బట్టి సంతోషిస్తున్నారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 నా ప్రభువు చెప్పాడు: “ఈ ప్రజలు నిదానంగా ప్రవహించే షిలోహు జలాలను స్వీకరించేందుకు నిరాకరించారు. రెజీను, రెమల్యా కుమారునితో (పెకహు) వీళ్లు సంతోషపడి పోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 “ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీటిని వద్దు అని, రెజీను గురించి, రెమల్యా కుమారుని గురించి సంతోషిస్తున్నారు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 8:6
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ స్తంభాల మీద ఉంచడానికి అతడు రెండు ఇత్తడి పీటలను కూడా పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు అయిదు మూరలు.


నీటి ఊట గుమ్మాన్ని మిస్పా ప్రదేశానికి అధిపతియైన కొల్-హోజె కుమారుడైన షల్లూము బాగుచేశాడు. అతడు దానిని బాగుచేసి పైకప్పు వేసి తలుపులు నిలబెట్టి తాళాలు గడియలు అమర్చాడు. అంతే కాకుండా దావీదు పట్టణం నుండి క్రిందకు వెళ్లే మెట్ల వరకు రాజుగారి తోట దగ్గర సిలోయము కొలను గోడను అతడే నిర్మించాడు.


అది ఒక నది. దాని శాఖలు దేవుని పట్టణాన్ని సంతోషపెడతాయి, అది మహోన్నతుడు నివసించే పరిశుద్ధస్థలము.


ఒకవేళ మీరు ఎదిరించి తిరుగుబాటు చేస్తే, మీరు ఖడ్గం చేత నాశనమవుతారు” యెహోవా ఈ మాట చెప్తున్నారు.


చూడండి, బలం, పరాక్రమం కలిగిన ఒకడు ప్రభువుకు ఉన్నాడు. వడగండ్లు, తీవ్రమైన గాలులు కుండపోత వర్షం, తీవ్రమైన వరద కొట్టివేసినట్లు ఆయన తన బలంతో దానిని నేలమీద పడవేస్తారు.


కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు చెప్పిన మాట ఇదే: “మీరు ఈ వర్తమానాన్ని తిరస్కరించారు, బాధించడాన్ని నమ్ముకుని, మోసాన్ని ఆధారం చేసుకున్నారు కాబట్టి,


వారు సైన్యాల యెహోవా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్యాన్ని తృణీకరించారు, కాబట్టి మంటలు గడ్డిని కాల్చినట్లుగా ఎండుగడ్డి మంటలో కాలిపోయినట్లుగా వారి వేరులు కుళ్లిపోతాయి, వారి పూలు ధూళిలా ఎగిరిపోతాయి.


అతనితో, ‘జాగ్రత్త, నెమ్మదిగా ఉండు, భయపడకు. పొగరాజుకుంటున్న ఈ రెండు కాగడాలకు అనగా రెజీను, అరాము, రెమల్యా కుమారుడైన పెకహు యొక్క తీవ్రమైన కోపానికి అధైర్యపడకు.


“మనం యూదాపై దాడి చేద్దాము; మనం దానిని చీల్చివేసి, మన మధ్యలో పంచుకుందాం, టాబెయేలు కుమారున్ని దానికి రాజుగా చేద్దాం” అని చెప్పుకున్నారు.’ ”


ఎఫ్రాయిముకు సమరయ రాజధాని, సమరయకు రెమల్యా కుమారుడు రాజు. మీరు మీ విశ్వాసంలో స్థిరంగా ఉండకపోతే మీరు క్షేమంగా ఉండలేరు.”


యెహోవా నాతో మరలా ఇలా మాట్లాడారు:


లెబానోను మంచు దాని రాతి బండల నుండి ఎప్పుడైనా మాయమవుతుందా? సుదూర ప్రాంతాల నుండి వచ్చే దాని చల్లని జలాలు ప్రవహించడం ఆగిపోతాయా?


“నా ప్రజలు రెండు చెడు పాపాలు చేశారు: జీవజలపు ఊటనైన నన్ను వారు విసర్జించి, తమ కోసం సొంత తొట్లు తొలిపించుకున్నారు, అవి పగిలిన తొట్లు, వాటిలో నీళ్లు నిలువవు.


నైలు నది నీళ్లు త్రాగడానికి ఈజిప్టుకు ఎందుకు వెళ్లాలి? యూఫ్రటీసు నుండి నీళ్లు త్రాగడానికి అష్షూరుకు ఎందుకు వెళ్లాలి?


సిలోయము గోపురం కూలి దాని క్రిందపడి పద్దెనిమిది మంది చనిపోయారు, వారు యెరూషలేములో జీవిస్తున్న వారందరికంటే ఎక్కువ పాపం చేశారని అనుకుంటున్నారా?


ఆయన అతనితో, “వెళ్లు, సిలోయము అనే కోనేటిలో కడుక్కో” అని చెప్పారు. సిలోయము అనగా, “పంపబడిన” అని అర్థము. అతడు వెళ్లి కడుక్కుని చూపుతో ఇంటికి వచ్చాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ