Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 8:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 మీతో ఎవరైనా, గుసగుసలాడే గొణిగే మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించమని చెప్పినప్పుడు, ప్రజలు తమ దేవుని దగ్గరే విచారించాలి కదా? సజీవుల గురించి చచ్చిన వారిని ఎందుకు సంప్రదించాలి?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 వారు మిమ్మును చూచి–కర్ణపిశాచిగలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించు డని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్ల దగునా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 వారు మాతో “శకునాలు చెప్పే వారి దగ్గరికి, గొణుగుతూ గుసగుసలాడుతూ ఉండే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్లి విచారణ చెయ్యండి” అని చెబుతారు. కానీ ప్రజలు విచారించవలసింది తమ దేవుడి దగ్గరనే గదా? బతికి ఉన్న వారి కోసం చచ్చిన వారి దగ్గరికి వెళ్లడం ఏమిటి?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 కొంతమంది, “జ్యోతిష్కుల దగ్గరకు, మాంత్రికుల దగ్గరకు వెళ్లి, ఏమి చేయాలో తెలుసుకోండి” అంటున్నారు. (ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు పిట్టల్లా కిచకిచలాడి తమకి చాలా తెలివిగల తలపులు ఉన్నట్టు మనుష్యులు తలచాలని గుసగుసలాడుతారు.) అయితే వాళ్లు వాళ్ల దేవుణ్ణి సహాయం అడుక్కోవాలి అని నేను చెబుతున్నాను. ఆ జ్యోతిష్కులు, మాంత్రికులు వారు ఏమి చేయాలి అనేది చచ్చిపోయిన వాళ్లను అడుగుతారు. బ్రతికి ఉన్న వాళ్లు చచ్చిన వాళ్లను ఏదైనా ఎందుకు అడగాలి?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 మీతో ఎవరైనా, గుసగుసలాడే గొణిగే మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించమని చెప్పినప్పుడు, ప్రజలు తమ దేవుని దగ్గరే విచారించాలి కదా? సజీవుల గురించి చచ్చిన వారిని ఎందుకు సంప్రదించాలి?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 8:19
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. ఇది మాంత్రికులకు చెప్పాను, కానీ దాని అర్థాన్ని చెప్పేవారు ఎవరూ లేరు.”


అయితే యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో, “నీవు వెళ్లి, సమరయ రాజు పంపిన దూతలను కలిసి, ‘ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నారా?’


అతడు తన సొంత కుమారుడిని అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం రేపాడు.


అంతేకాక యోషీయా కర్ణపిశాచులను, ఆత్మలతో మాట్లాడేవారిని, గృహదేవతలు, విగ్రహాలు, యూదాలో యెరూషలేములో కనిపించే ఇతర అసహ్యకరమైన వస్తువులన్నిటిని తీసివేసి యాజకుడైన హిల్కీయాకు యెహోవా మందిరంలో దొరికిన గ్రంథంలో వ్రాయబడిన ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడానికి అతడు ఇలా చేశాడు.


యెహోవాకు నమ్మకద్రోహిగా ఉన్నందుకు సౌలు చనిపోయాడు; అతడు యెహోవా వాక్కును పాటించకుండా సలహా కోసం ఆత్మలతో మాట్లాడేవారి దగ్గరకు వెళ్లాడు.


అతడు తన పిల్లలను బెన్ హిన్నోము లోయలో అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని, చేతబడిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ, ఆయనకు కోపం రేపాడు.


వారు బయల్-పెయోరు దగ్గరి విగ్రహం దగ్గర చేరారు. నిర్జీవ విగ్రహాలకు పెట్టిన నైవేద్య బలులు తిన్నారు.


ఈజిప్టువారు ఆత్మస్థైర్యం కోల్పోతారు, వారి ఆలోచనలను నాశనం చేస్తాను; వారు విగ్రహాలను, మరణించిన వారి ఆత్మలను, భవిష్యవాణి చెప్పేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదిస్తారు.


వారు చనిపోయారు, మరల బ్రతకరు; వారి ఆత్మలు లేవవు. మీరు వారిని శిక్షించి నాశనం చేశారు; మీరు వారి జ్ఞాపకాలన్నిటిని తుడిచివేశారు.


అప్పుడు నీవు క్రిందపడి నేలపై నుండి మాట్లాడతావు; నీ మాట ధూళినుండి గొణుగుతున్నట్లు ఉంటుంది. దయ్యం స్వరంలా నీ స్వరం నేల నుండి వస్తుంది; ధూళినుండి నీ మాట గుసగుసలాడుతుంది.


వారు నన్ను సంప్రదించకుండా ఈజిప్టుకు వెళ్తారు; వారు సహాయం కోసం ఫరో కాపుదల కోసం చూస్తారు, ఆశ్రయం కోసం ఈజిప్టు నీడ కోసం చూస్తారు.


“ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దానిని సృష్టించిన యెహోవా చెప్పే మాట ఇదే: జరుగబోయే వాటి గురించి, నా కుమారుల గురించి నన్ను అడుగుతారా? నా చేతిపనుల గురించి నన్నే ఆజ్ఞాపిస్తారా?


“నీ చిన్నప్పటి నుండి నీవు కష్టపడి నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను నీ విస్తారమైన శకునాలను ప్రయోగించుకో బహుశ నీవు విజయం సాధిస్తావేమో, బహుశ నీవు భయం కలిగించగలవేమో.


నీవు తీసుకున్న సలహాలన్నీ విని నీవు అలసిపోయావు. నీ జ్యోతిష్యులు, నెలలవారీగా రాశి ఫలాలను చెప్పేవారిని రమ్మను, నీ మీదికి వచ్చే వాటినుండి నిన్ను వారు రక్షించాలి.


అయితే యెహోవాయే నిజమైన దేవుడు; ఆయన సజీవుడైన దేవుడు, నిత్య రాజు. ఆయనకు కోపం వచ్చినప్పుడు, భూమి కంపిస్తుంది; ఆయన ఉగ్రతను దేశాలు సహించలేవు.


కాబట్టి, ‘మీరు బబులోను రాజుకు సేవ చేయరు’ అని మీతో చెప్పే మీ ప్రవక్తలు, భవిష్యవాణి చెప్పేవారు, కలల భావం చెప్పేవారు, మృతుల ఆత్మతో మాట్లాడేవారు, మంత్రగాళ్ల మాటలు మీరు వినవద్దు.


“ ‘మృతుల ఆత్మలతో మాట్లాడేవారి వైపు తిరగకండి లేదా ఆత్మలతో మాట్లాడేవారిని అనుసరించకండి, ఎందుకంటే మీరు వారి ద్వార అపవిత్రం అవుతారు. నేను మీ దేవుడనైన యెహోవాను.


“ ‘మృతుల ఆత్మలతో మాట్లాడేవారితో సోదె చెప్పేవారితో వ్యభిచారం చేయడానికి వారిని అనుసరించేవారికి నేను విరోధిగా మారి వారిని ప్రజల్లో నుండి తొలగిస్తాను.


మీ మధ్య మంత్రవిద్య లేకుండా నాశనం చేస్తాను ఇక ఎన్నడూ మీరు సోదె చెప్పరు.


మరొక రోజు మేము ప్రార్థన స్థలానికి వెళ్తుండగా, దయ్యం పట్టి సోదె చెప్పే ఒక బానిస స్త్రీ మాకు ఎదురయింది. ఆమె సోదె చెప్తూ తన యజమానికి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించేది.


తమ కుమారున్ని లేదా కుమార్తెను అగ్నిలో బలి ఇచ్చే వారినైననూ, భవిష్యవాణి లేదా మంత్రవిద్య, శకునాలను చెప్పు వారినైననూ, మంత్రవిద్యలో నిమగ్నమయ్యేవారునూ మీలో ఎవరూ కనబడకూడదు.


మంత్రాలు జపించేవారు గాని, ఆత్మలతో మాట్లాడేవారు గాని, చనిపోయినవారిని సంప్రదించేవారు గాని మీలో ఉండకూడదు.


ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎలాంటిదో వారే సాక్ష్యమిస్తున్నారు. సజీవుడైన నిజమైన దేవున్ని సేవించడానికి మీరు విగ్రహాలను విడిచిపెట్టి ఎలా దేవుని వైపుకు తిరిగారో,


అయితే మీలో అబద్ధ బోధకులు ఉన్నట్లుగానే, గతంలో కూడా ప్రజల మధ్యలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు రహస్యంగా నాశనకరమైన నియమాలను ప్రవేశపెడుతూ, తమను కొన్న సర్వాధికారియైన ప్రభువును కూడా తిరస్కరిస్తూ తమ మీదికి తామే వేగంగా నాశనాన్ని తెచ్చుకుంటారు.


అప్పుడు ఆ స్త్రీ, “నీతో మాట్లాడడానికి నేనెవరిని రప్పించాలి?” అని అడిగింది. అందుకతడు, “సమూయేలును రప్పించు” అన్నాడు.


అందుకు సమూయేలు, “యెహోవా నిన్ను విడిచిపెట్టి నీకు శత్రువైనప్పుడు నీవు నన్ను ఎందుకు అడుగుతావు?


సౌలు తన సహాయకులకు, “మీరు వెళ్లి మృతుల ఆత్మలతో మాట్లాడే స్త్రీని వెదకండి, అప్పుడు నేను వెళ్లి ఆమె దగ్గర విచారణ చేస్తాను” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వారు, “ఎన్-దోరులో ఒక స్త్రీ ఉంది” అని చెప్పారు.


కాబట్టి సౌలు మారువేషం వేసుకుని వేరే బట్టలు ధరించి ఇద్దరు మనుష్యులతో పాటు బయలుదేరి రాత్రివేళ ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, “చనిపోయినవారి ఆత్మతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పేవాన్ని రప్పించు” అని అడిగాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ