Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 7:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 ఆ రోజున యెహోవా యూఫ్రటీసు నది అవతలి నుండి కూలికి తెచ్చిన మంగలకత్తితో అనగా, అష్షూరు రాజుతో మీ తలవెంట్రుకలు కాళ్లవెంట్రుకలు క్షౌరం చేయిస్తారు. అది మీ గడ్డాలను కూడా గీసివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 ఆ దినమున యెహోవా నది (యూఫ్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ఆ దినాన యెహోవా నది (యూప్రటీసు) అవతలి నుండి కిరాయికి వచ్చే మంగలి కత్తితో, అంటే అష్షూరు రాజు చేత నీ తల వెంట్రుకలను కాళ్ల వెంట్రుకలను గొరిగిస్తాడు. అది నీ గడ్డాన్ని కూడా గొరిగిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 యూదాను శిక్షించటానికి యెహోవా అష్షూరును వాడుకొంటాడు. అష్షూరు కూలికి వినియోగించబడే మంగలి కత్తిలా ఉపయోగించబడుతుంది. అది యూదా తలమీద, కాళ్లమీద, వెంట్రుకలను యెహోవా తానే గీసేస్తున్నట్టుగా ఉంటుంది. అది యూదా గడ్డాన్ని యోహోవా గీసేస్తున్నట్టుగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 ఆ రోజున యెహోవా యూఫ్రటీసు నది అవతలి నుండి కూలికి తెచ్చిన మంగలకత్తితో అనగా, అష్షూరు రాజుతో మీ తలవెంట్రుకలు కాళ్లవెంట్రుకలు క్షౌరం చేయిస్తారు. అది మీ గడ్డాలను కూడా గీసివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 7:20
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎందుకు మీరు ఇంకా దెబ్బలు తింటున్నారు? ఎందుకు మీరు ఇంకా తిరుగుబాటు కొనసాగిస్తున్నారు? మీ తలంతా గాయపరచబడింది, మీ గుండె మొత్తం బాధించబడింది.


గొడ్డలి తనను ఉపయోగించే వ్యక్తి కన్నా అతిశయపడుతుందా, రంపం దానిని ఉపయోగించే వ్యక్తి మీద ప్రగల్భాలు పలుకుతుందా? కర్ర తనను ఎత్తేవానిని ఆడించినట్లు దుడ్డుకర్ర కర్రకానివాన్ని ఆడిస్తుంది!


యెహోవా ఈజిప్టు సముద్రపు అగాధాన్ని నాశనం చేస్తారు; తన వేడి గాలితో యూఫ్రటీసు నది మీద తన చేయి ఆడిస్తారు. ఆయన ఏడు కాలువలుగా దానిని చీల్చుతారు చెప్పులు తడువకుండ మనుష్యులు దానిని దాటేలా చేస్తారు.


రాజైన హిజ్కియా పాలన పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు.


కాబట్టి ప్రభువు భయంకరమైన యూఫ్రటీసు నది వరద నీటిని అనగా అష్షూరు రాజును, అతని బలగమంతటిని వారి మీదికి రప్పించబోతున్నారు. అవి దాని కాలువలన్నిటి నుండి ఉప్పొంగి దాని ఒడ్డులన్నిటి మీది నుండి ప్రవహిస్తాయి.


అయితే ప్రజలు తమను కొట్టినవాడి వైపు తిరుగలేదు, సైన్యాల యెహోవాను వారు వెదకలేదు.


నైలు నది నీళ్లు త్రాగడానికి ఈజిప్టుకు ఎందుకు వెళ్లాలి? యూఫ్రటీసు నుండి నీళ్లు త్రాగడానికి అష్షూరుకు ఎందుకు వెళ్లాలి?


“మనుష్యకుమారుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యంతో దండెత్తి చాలా బాధాకరమైన పని చేయించాడు. వారందరి తలలు బోడివయ్యాయి. అందరి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరు పట్టణం మీదికి అతడు తెచ్చిన నష్టాన్ని బట్టి అతనికి అతని సైన్యానికి ప్రతిఫలం కూడా దొరకలేదు.


అతడు అతని సైన్యం నా కోసమే శ్రమించారు కాబట్టి అతడు చేసిన దానికి ప్రతిఫలంగా బహుమానంగా ఈజిప్టు దేశాన్ని అతనికి అప్పగించాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ