యెషయా 65:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 యెహోవా చెప్పే మాట ఇదే: “ద్రాక్షగుత్తిలో ఇంకా రసం కనబడినప్పుడు ప్రజలు, ‘దానిలో ఆశీర్వాదం ఉంది, దానిని నాశనం చేయకండి’ అని చెప్తారు కదా. అలాగే నా సేవకులందరి కోసం చేస్తాను; నేను వారందరిని నాశనం చేయను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –ద్రాక్షగెలలో క్రొత్తరసము కనబడునప్పుడు జనులు–ఇది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా? నా సేవకులనందరిని నేను నశింపజేయకుండునట్లువారినిబట్టి నేనాలాగే చేసెదను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 యెహోవా ఇలా చెబుతున్నాడు. “ద్రాక్షగెలలో కొత్త రసం ఇంకా కనబడితే ప్రజలు, ‘దానిలో మంచి రసం ఉంది. దాన్ని నష్టం చేయవద్దు.’ అంటారు. నా సేవకుల కోసం అలాగే చేస్తాను. నేను వాళ్లందరినీ నాశనం చేయను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 యెహోవా చెబుతున్నాడు: “ద్రాక్షపండ్లలో క్రొత్తరసం ఉన్నప్పుడు, ప్రజలు ఆ ద్రాక్షరసాన్ని పిండుతారు. కాని ద్రాక్ష పండ్లను మాత్రం వారు పూర్తిగా నాశనం చేయరు. ఆ ద్రాక్షపండ్లు ఇంకా ఉపయోగపడ్తాయి. కనుక వారు యిలా చేస్తారు. నా సేవకులకు కూడ నేను అలాగే చేస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చేయను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 యెహోవా చెప్పే మాట ఇదే: “ద్రాక్షగుత్తిలో ఇంకా రసం కనబడినప్పుడు ప్రజలు, ‘దానిలో ఆశీర్వాదం ఉంది, దానిని నాశనం చేయకండి’ అని చెప్తారు కదా. అలాగే నా సేవకులందరి కోసం చేస్తాను; నేను వారందరిని నాశనం చేయను. အခန်းကိုကြည့်ပါ။ |