Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 65:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 ఇకపై వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు నివసించరు. వారు నాటిన వాటి పండ్లను వేరొకరు తినరు. నా ప్రజల ఆయుష్షు చెట్ల ఆయుష్షంత ఉంటుంది; నేను ఏర్పరచుకున్నవారు తమ చేతిపనిని పూర్తిగా అనుభవిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరువారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 వారు కట్టుకున్న ఇళ్ళల్లో వేరేవాళ్ళు కాపురముండరు. వారు నాటిన వాటిని ఇతరులు తినరు. నా ప్రజల ఆయువు వృక్షాల ఆయువంత ఉంటుంది. నేను ఎన్నుకున్నవారు తాము చేతులతో చేసిన వాటిని చాలాకాలం ఉపయోగించుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 ఒకడు ఇల్లు కట్టగా మరొకడు ఆ ఇంటిలో నివసించటం అనేది జరుగదు. ఒకడు ఒక తోటను నాటగా మరొకడు ఆ తోట ఫలాలు తినటం అనేది జరుగదు. వృక్షాలు బ్రతికినంత కాలం నా ప్రజలు బ్రతుకుతారు. నేను ఏర్పరచుకొనే ప్రజలు, వారు తయారుచేసే వాటిని అనుభవిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 ఇకపై వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు నివసించరు. వారు నాటిన వాటి పండ్లను వేరొకరు తినరు. నా ప్రజల ఆయుష్షు చెట్ల ఆయుష్షంత ఉంటుంది; నేను ఏర్పరచుకున్నవారు తమ చేతిపనిని పూర్తిగా అనుభవిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 65:22
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.


ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.


అతడు మిమ్మల్ని ఆయుష్షును అడుగగా, మీరు అతనికి శాశ్వతకాలం ఉండే దీర్ఘాయువును ఇచ్చారు.


దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను.


యెహోవా తన కుడిచేతితో తన బలమైన హస్తంతో ఇలా ప్రమాణం చేశారు: “ఇకనుండి ఎప్పుడూ నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా నేనివ్వను. నీవు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని విదేశీయులు ఇక ఎన్నడు త్రాగరు;


అయితే పంట పండించిన వారే దానిని తిని యెహోవాను స్తుతిస్తారు. ద్రాక్షలను సమకూర్చిన వారే నా పరిశుద్ధాలయ ఆవరణాల్లో దాని త్రాగుతారు.”


నేను ఏర్పరచుకున్నవారు వారి శాపవచనాల్లో మీ పేరును ఉపయోగిస్తారు; ప్రభువైన యెహోవా మిమ్మల్ని చంపుతారు. ఆయన తన సేవకులకు మరొక పేరు పెడతారు.


యాకోబు నుండి యూదా నుండి వారసుల్ని తీసుకువస్తాను, వారు నా పర్వతాల్ని స్వాధీనపరచుకుంటారు. నేను ఏర్పరచుకున్న ప్రజలు వాటిని స్వతంత్రించుకుంటారు. నా సేవకులు అక్కడ నివసిస్తారు.


“నేను చేయబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నా ఎదుట నిత్యం నిలిచి ఉన్నట్లు, నీ పేరు నీ సంతానం నిలిచి ఉంటుంది” అని యెహోవా తెలియజేస్తున్నారు.


అప్పుడు నేను మీకు ఇలా చేస్తాను: మీ దృష్టిని నాశనం చేసే, మీ బలాన్ని తగ్గించే ఆకస్మిక భీభత్సం, చెడు వ్యాధులు జ్వరాలు తెస్తాను. మీరు వృధాగా విత్తనాన్ని చల్లుతారు, ఎందుకంటే మీ శత్రువులు దానిని తింటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ