Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 61:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 “ఎందుకంటే యెహోవానైన నాకు న్యాయమంటే ఇష్టము; దోపిడి చేయడం, చెడు చేయడం నాకు అసహ్యము. నా నమ్మకత్వాన్ని బట్టి నా ప్రజలకు ప్రతిఫలమిస్తాను వారితో శాశ్వతమైన నిబంధన చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచువారితో నిత్యనిబంధన చేయుదును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఎందుకంటే న్యాయం చేయడం యెహోవా అనే నాకు ఇష్టం. దోచుకోవడం, అన్యాయంగా ఒకడి సొత్తు తీసుకోవడం అంటే నాకు అసహ్యం. నమ్మకంగా నేను వారికి తిరిగి ఇచ్చేస్తాను. వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 ఎందుకు ఇలా జరగుతుంది? ఎందుకంటె, నేను యెహోవాను గనుక, న్యాయం అంటే నాకు ఇష్టం గనుక. దొంగతనం, సమస్త చెడుగు నాకు అసహ్యం. కనుక ప్రజలకు తగిన శిక్ష నేను ఇస్తాను. నా ప్రజలతో శాశ్వతంగా నేను ఒక ఒడంబడిక చేసుకొన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 “ఎందుకంటే యెహోవానైన నాకు న్యాయమంటే ఇష్టము; దోపిడి చేయడం, చెడు చేయడం నాకు అసహ్యము. నా నమ్మకత్వాన్ని బట్టి నా ప్రజలకు ప్రతిఫలమిస్తాను వారితో శాశ్వతమైన నిబంధన చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 61:8
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా నిబంధనను నాకు నీకు మరి నీ తర్వాత వచ్చు నీ వారసులకు మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, నీకు దేవునిగా, నీ తర్వాత నీ వారసులకు దేవునిగా ఉంటాను.


“ఒకవేళ నా కుటుంబం దేవునితో సరిగా లేకపోయినా, నిజంగా ఆయన నాతో శాశ్వతమైన నిబంధన చేసి ఉండరు కదా, ఆ నిబంధన అన్నివిధాల పరిపూర్ణమైనది స్థిరమైనది; నిజంగా ఆయన నా రక్షణను ఫలవంతం చేసి ఉండరు, నా ప్రతి కోరికను ఇచ్చి ఉండరు.


ఆయన దానిని యాకోబుకు శాసనంగా, ఇశ్రాయేలుకు శాశ్వతమైన నిబంధనగా స్థిరపరిచారు:


యెహోవా నీతిమంతుడు, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు; యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూస్తారు.


మీరు నడవాల్సిన మార్గాన్ని నేను మీకు ఉపదేశించి నేర్పుతాను; మీమీద దృష్టిపెట్టి నేను మీకు సలహా ఇస్తాను.


యెహోవా నీతిన్యాయాలను ప్రేమిస్తారు; భూమంతా ఆయన మారని ప్రేమతో నిండిపోయింది.


యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు తన నమ్మకస్థులను ఆయన విడిచిపెట్టరు. ఆయన వారిని శాశ్వతంగా భద్రపరుస్తారు; కాని దుష్టుల సంతానం నశిస్తుంది.


మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషిస్తారు; కాబట్టి దేవుడు, మీ దేవుడు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి, మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు.


“బలి అర్పణల వల్ల నాతో నిబంధన చేసుకున్న భక్తులను నా ఎదుట సమావేశపరచండి.”


బలాత్కారాన్ని నమ్ముకోకండి దోపిడీలు చేసి ధనవంతులై విర్రవీగకండి. ధనం ఎక్కువైనా సరే, దాని మీద మనస్సు పెట్టకండి.


రాజు నిజాయితీ కలిగి న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి మీరు అతన్ని సుస్థిరంగా నిలబెడతారు; యాకోబు ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలీయుల పట్ల నీతి నాయ్యాలు జరిగిస్తారు.


నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు, అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు.


నీతి మార్గాల్లోను, న్యాయమైన మార్గాల్లోను నేను నడుస్తూ ఉన్నాను.


నేను న్యాయాన్ని కొలమానంగా, నీతిని మట్టపు గుండుగా చేస్తాను: వడగండ్లు మీ అబద్ధం అనే ఆశ్రయాన్ని తుడిచివేస్తాయి. మీ దాగుచోటు నీటికి కొట్టుకుపోతుంది.


అయినా, యెహోవా మీమీద దయ చూపించాలని కోరుతున్నారు; కాబట్టి మీ పట్ల దయ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు ఆయన కోసం ఎదురు చూసే వారందరు ధన్యులు!


కాని సైన్యాల యెహోవా తీర్పు తీర్చి మహిమపరచబడతారు, తన నీతి క్రియలనుబట్టి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధునిగా నిరూపించబడతారు.


పర్వతాలు కదిలినా కొండలు తొలగిపోయినా నా మారని ప్రేమ నిన్ను విడిచిపోదు. నా సమాధాన నిబంధన తొలిగిపోదు” అని నీపై దయ చూపించే యెహోవా చెప్తున్నారు.


శ్రద్ధగా విని నా దగ్గరకు రండి; మీరు వింటే బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు వాగ్దానం చేసిన నా శాశ్వత ప్రేమను మీకు చూపిస్తాను.


యెహోవా చెప్పే మాట ఇదే: “నా రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది, నా నీతి త్వరలో వెల్లడవుతుంది, కాబట్టి న్యాయంగా ఉండండి సరియైనది చేయండి.


“నేను చేయబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నా ఎదుట నిత్యం నిలిచి ఉన్నట్లు, నీ పేరు నీ సంతానం నిలిచి ఉంటుంది” అని యెహోవా తెలియజేస్తున్నారు.


నేను వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను: నేను వారికి మేలు చేయడం ఎప్పటికీ మానను, వారు నా నుండి ఎన్నటికీ దూరంగా ఉండకుండ నా పట్ల వారికి భయభక్తులు కలిగిస్తాను.


అయితే గర్వించేవారు దీనిని గురించి గర్వించాలి: నన్ను తెలుసుకునే జ్ఞానం వారికి ఉందని, నేనే యెహోవానని, భూమిపై దయను, న్యాయాన్ని నీతిని అమలు చేసేవాడినని, ఎందుకంటే వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


అయినా నీ యవ్వనంలో నేను నీతో చేసిన ఒడంబడికను జ్ఞాపకం చేసుకుంటాను, నీతో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను.


“ ‘అవి అరణ్యంలో క్షేమంగా నివసించి అడవుల్లో పడుకునేలా నేను వాటితో సమాధాన ఒడంబడిక చేసుకుంటాను, అలాగే అడవి మృగాలను దేశంలో లేకుండా చేస్తాను.


పైగా, ‘ఎంత భారంగా ఉంది!’ అంటూ ఆ బల్లను తిరస్కరిస్తున్నారు” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “మీరు గాయపడిన దాన్ని కుంటి దాన్ని, జబ్బుపడిన జంతువులను తీసుకువచ్చి బలి అర్పించినప్పుడు నేను మీ చేతుల నుండి వాటిని స్వీకరించాలా?” అని యెహోవా అంటున్నారు.


“వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! కాబట్టి మీకు మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించే మనుష్యులను ప్రవేశించకుండా వారి ముఖం మీదనే తలుపు వేసేస్తున్నారు. మీరు దానిలో ప్రవేశించడంలేదు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వడంలేదు.


ప్రభువు మీ హృదయాలను దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన సహనం వైపు నడిపించును గాక.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ