Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 6:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 అందుకు నేను, “ప్రభువా! ఇలా ఎంతకాలం వరకు?” అని అడిగాను. అందుకు ఆయన ఇలా జవాబిచ్చారు: “నివాసులు లేక పట్టణాలు నాశనం అయ్యేవరకు, మనుష్యులు లేక ఇల్లు పాడై విడిచిపెట్టబడే వరకు, భూమి పూర్తిగా నాశనమై బీడుగా అయ్యేవరకు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 – ప్రభువా, ఎన్నాళ్లవరకని నేనడుగగా ఆయన–నివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 “ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 అప్పుడు నేను “ప్రభూ, ఎన్నాళ్లు నేను ఇలా చేయాలి?” అని అడిగాను. యెహోవా జవాబిచ్చాడు, “పట్టణాలు నాశనం చేయబడి, ప్రజలు వెళ్లిపోయేంత వరకు ఇలా చేయి. ఇళ్లలో మనుష్యులు ఎవ్వరూ నివసించకుండా ఉండే అంతవరకు ఇలా చేయి. దేశం నాశనం చేయబడి, నిర్జనం అయ్యేంతవరకు ఇలా చేయుము.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 అందుకు నేను, “ప్రభువా! ఇలా ఎంతకాలం వరకు?” అని అడిగాను. అందుకు ఆయన ఇలా జవాబిచ్చారు: “నివాసులు లేక పట్టణాలు నాశనం అయ్యేవరకు, మనుష్యులు లేక ఇల్లు పాడై విడిచిపెట్టబడే వరకు, భూమి పూర్తిగా నాశనమై బీడుగా అయ్యేవరకు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 6:11
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవా, ఎంతకాలం శత్రువు మిమ్మల్ని వెక్కిరిస్తాడు? శత్రువు శాశ్వతంగా మీ పేరును దూషిస్తాడా?


ఎంతకాలం, యెహోవా? మీరు ఎప్పటికీ కోప్పడతారా? ఎంతకాలం మీ రోషం అగ్నిలా మండుతుంది?


యెహోవా, మా దగ్గరకు తిరిగి రండి! ఇంకెంత కాలం? మీ దాసుల మీద కనికరం చూపండి.


యెహోవా, ఎంతకాలం దుష్టులు, ఎంతకాలం దుష్టులు ఆనందిస్తారు?


మీ దేశం నాశనమైపోయింది. మీ పట్టణాలు అగ్నిచేత కాలిపోయాయి; మీ కళ్లెదుటే మీ పొలాలు విదేశీయులచేత దోచుకోబడ్డాయి, కంటికి కనబడినవాటిని పరాయివారిగా నాశనం చేశారు.


నేను మనుష్యులను స్వచ్ఛమైన బంగారం కంటే కొరతగా, ఓఫీరు దేశ బంగారం కంటే అరుదుగా ఉండేలా చేస్తాను.


సీయోను గుమ్మాలు విలపిస్తూ దుఃఖిస్తాయి; ఆమె ఒంటరిదై, నేల మీద కూర్చుంటుంది.


యెరూషలేము పాడైపోయింది, యూదా పతనమవుతుంది, వారి మాటలు పనులు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆయన మహిమగల సన్నిధిని వారు ధిక్కరించారు.


కోట విడిచిపెట్టబడుతుంది కోలాహలంగా ఉన్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది; కోట, కావలికోట శాశ్వతంగా బంజరు భూమిలా మారుతాయి, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగా, మందలకు పచ్చికబయళ్లుగా ఉంటాయి,


ఎడారి, ఎండిన భూమి సంతోషిస్తాయి; అరణ్యం సంతోషించి పూస్తుంది. అది కుంకుమ పువ్వులా,


నేను వినేలా సైన్యాల యెహోవా చెప్పిన మాట: “నిజంగా గొప్ప ఇల్లు ఖాళీగా అయిపోతాయి, చక్కటి భవనాలు నివాసులు లేక పాడైపోతాయి.


“నీవు విడిచిపెట్టబడి, ద్వేషించబడి నీ మార్గంలో ఎవరూ ప్రయాణించకపోయినా, నేను నిన్ను శాశ్వత ఘనతగా అన్ని తరాలకు ఆనందంగా చేస్తాను.


మీ పరిశుద్ధ పట్టణాలు బంజరు భూమిగా మారాయి; చివరకు సీయోను బంజరు భూమిగా, యెరూషలేము నిర్జనంగా మారాయి.


ఎందుకంటే యూదా రాజభవనం గురించి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు నాకు గిలాదులా ఉన్నా, లెబానోను శిఖరంలా ఉన్నా, నిన్ను బంజరు భూమిలా, నివసించేవారు లేని పట్టణాల్లా చేస్తాను.


ఒక సింహం తన పొద చాటు నుండి బయటకు వచ్చింది; దేశాలను నాశనం చేసేవాడు బయలుదేరాడు. మీ దేశాన్ని పాడుచేయడానికి ఆయన తన స్థలాన్ని విడిచిపెట్టాడు. నీ పట్టణాలు నివాసులు లేకుండా శిథిలావస్థలో ఉంటాయి.


“ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: యెరూషలేము మీదా యూదా పట్టణాలన్నింటి మీదా నేను తెచ్చిన మహా విపత్తును మీరు చూశారు. వారు చేసిన దుర్మార్గం కారణంగా నేడు అవి నిర్జనమై శిథిలావస్థలో ఉన్నాయి.


హమాతు దేశంలోని రిబ్లాలో బబులోను రాజు వారిని చంపించాడు. కాబట్టి యూదా తన దేశానికి దూరంగా బందీగా వెళ్లిపోయింది.


మీరు ఎక్కడ నివసించినా, ఆ పట్టణాలు నిర్జనమవుతాయి, క్షేత్రాలు పడగొట్టబడతాయి, తద్వారా మీ బలిపీఠాలు అపవిత్రమవుతాయి, మీ విగ్రహాలు పగిలి శిథిలమవుతాయి, మీ ధూపవేదికలు పగులగొట్టబడతాయి, మీరు తయారుచేసినవి తుడిచివేయబడతాయి.


అప్పుడు ఒక పరిశుద్ధుడు మాట్లాడడం నేను చూశాను, మరో పరిశుద్ధుడు అతనితో, “అనుదిన అర్పణలు, నాశనానికి కారణమైన తిరుగుబాటు, పరిశుద్ధాలయాన్ని లోబరచుకోవడం, యెహోవా ప్రజలు పాదాల క్రింద త్రొక్కబడుతున్న ఈ దర్శనం నెరవేరడానికి ఎంతకాలం పడుతుంది?” అన్నాడు.


నేను మీ పట్టణాలను శిథిలాలుగా మారుస్తాను, మీ పరిశుద్ధాలయాలను వృథా చేస్తాను, మీ అర్పణల సువాసన యందు నేను ఆనందించను.


నేను మిమ్మల్ని దేశాల మధ్యకు చెదరగొట్టి, నా ఖడ్గాన్ని తీసి మిమ్మల్ని వెంటాడుతాను. మీ భూమి వృథా అవుతుంది, మీ పట్టణాలు శిథిలావస్థలో ఉంటాయి.


ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు; మీ గురించి ఈ విషాద గీతం పాడుతూ ఎగతాళి చేస్తారు: ‘మేము పూర్తిగా పాడైపోయాం; నా ప్రజల ఆస్తి విభజింపబడింది ఆయన దాన్ని నా నుండి తీసుకుంటారు! ఆయన మా భూములను దేశద్రోహులకు అప్పగించారు.’ ”


మీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను మీ కోటలను పడగొడతాను,


కాబట్టి మీ పాపాల కారణంగా నేను మిమ్మల్ని నాశనం చేసి నిర్మూలిస్తాను.


భూనివాసులు చేసిన క్రియలకు ఫలితంగా దేశం పాడవుతుంది.


ఆకాశంలోని నక్షత్రాల్లా అనేకమైన మీరు కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు.


మీరు వృద్ధి చెందడం, సంఖ్య పెరగడం యెహోవాకు ఎంత సంతోషాన్ని కలిగించిందో, మిమ్మల్ని పతనం చేయడం, నాశనం చేయడం కూడా ఆయనను అంతే సంతోషపరుస్తుంది. మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశిస్తున్న దేశం నుండి మీరు పెరికివేయబడతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ